కోహ్లీ త్వరలోనే ఆ కలను నిజం చేసుకుంటాడు.. బహుశా 2021లో: హర్భజన్

ముంబై: టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ ఎంతటి గొప్ప బ్యాట్స్‌మనో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. విరాట్ గొప్ప కెప్టెన్ కూడా. ఎంఎస్ ధోనీ నుంచి పగ్గాలు అందుకున్న అనంతరం ఐదేళ్లుగా టెస్టుల్లో.. మూడేళ్లుగా వన్డే, టీ20ల్లో తనదైన ముద్ర వేస్తున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియాను అత్యుత్తమంగా ముందుకు తీసుకెళుతున్నాడు.
అయితే కోహ్లీ ఎన్ని విజయాలు సాధించినా.. అతడి కెరీర్‌లో ఇప్పటివరకూ ఓ లోటు మాత్రం అలానే ఉండిపోయింది. అదే ఒక్క ఐసీసీ ట్రోఫీ గెలవకపోవడం. 2017 ఛాంపియన్స్ ట్రోఫీ సందర్భంగా తొలిసారి ఆ అవకాశాన్ని కోల్పోయిన కోహ్లీ.. గతేడాది 2019 వన్డే ప్రపంచకప్ రూపంలో మరోసారి అవకాశాన్ని చేజార్చుకున్నాడు. అయితే త్వరలోనే కోహ్లీ ఐసీసీ ట్రోఫీ సాధిస్తాడని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ జోస్యం చెప్పాడు.

కోహ్లీ త్వరలో ప్రపంచకప్ సాధిస్తాడు
హర్భజన్ సింగ్ తాజాగా మాట్లాడుతూ... 'ఏ కెప్టెన్ అయినా ప్రపంచకప్ సాధించాలని అనుకుంటాడు. 2021లో విరాట్ కోహ్లీ అది సాధిస్తే బాగుంటుంది. దాంతో అతడేం పెద్ద ఆటగాడు అయిపోడు. ఎందుకంటే.. కోహ్లీ ఇప్పటికే గొప్ప క్రికెటర్‌గా కొనసాగుతున్నాడు. కానీ ప్రపంచకప్ గెలవడం అనేది అతడి కీర్తి ప్రతిష్ఠలకు మరింత వన్నె తెస్తుంది. ప్రస్తుత జట్టును చూస్తే కోహ్లీ ఐసీసీ కప్పు సాధించకుండా వెనుతిరగడనిపిస్తోంది. త్వరలోనే ఆ కలను నిజం చేసుకుంటాడు. బహుశా 2021లో లేదా తర్వాతి సీజన్‌లో' అని అన్నాడు.

రెండుసార్లు కప్పు మిస్
విరాట్ కోహ్లీ నేతృత్వంలో టీమిండియా 2017 ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్లో పాకిస్థాన్ చేతిలో ఓటమి పాలయింది. తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 338 పరుగులు చేసింది. అనంతరం 339 పరుగుల భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన టీమిండియా 30.3 ఓవర్లకు గాను 158 పరుగులు చేసిన ఆలౌటైంది. గతేడాది ప్రపంచకప్ సెమీ ఫైనల్లో న్యూజిలాండ్ చేతిలో విఫలమైంది. 240 పరుగుల లక్ష్య ఛేదనలో తడబడిన టీమిండియా 18 పరుగుల తేడాతో ఓడిపోయింది. దీంతో భరత్ రెండుసార్లు కప్పు చేజార్చుకుంది.

నంబర్ 4లో రాహుల్ బెస్ట్
ఆస్ట్రేలియా పర్యటనలో కంగారూలపై టీమిండియాదే పైచేయి అవుతుందని హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. తొలి టెస్టు అనంతరం విరాట్ కోహ్లీ స్థానాన్ని.. లోకేశ్ రాహుల్‌తో భర్తీ చేయడం ఉత్తమమని భజ్జీ పేర్కొన్నాడు. 'సుదీర్ఘ ఫార్మాట్‌లోనూ రోహిత్ శర్మ ఓపెనింగ్ చేయడమే ఉత్తమం. ఇక రెండో టెస్టు నుంచి విరాట్ కోహ్లీ అందుబాటులో ఉండటం లేదు. ఇది టీమిండియాకు పెద్ద సవాలు. ఆ స్థానంలో రాహుల్‌ను ఆడించడం మేలు. అతడు క్లాసిక్ ఆటగాడు. పరిస్థితులకు తగ్గట్లు ఎక్కడైనా ఇమిడిపోగలడు. బలాబలాలను పరిశీలిస్తే.. ఇరు జట్లు సమఉజ్జీలుగా కనిపిస్తున్నాయి. అయినా నా ఓటు టీమిండియాకే' అని హర్భజన్ చెప్పాడు.
India vs Australia: 'మాలాంటి బౌలింగ్ మరెక్కడా లేదు.. 2018-19 ప్రదర్శనను పునరావృతం చేస్తాం'
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications