ఆ విషయంలో విరాట్ కోహ్లీ సూపర్: హర్భజన్ సింగ్ సతీమణి

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సతీమణి గీతా బస్రా ప్రశంసల జల్లు కురిపించింది. భారత్‌లో పెటర్నిటీ లీవ్‌పై విరాట్ కోహ్లీ అవగాహన కల్పించాడని, అది అతను చేసిన అద్భుతమైన పనని కొనియాడింది. అసలు భారత్‌లో చాలా మందికి పెటర్నిటీ లీవ్ అంటే ఏంటో కూడా తెలియదని, విరాట్ కోహ్లీ వల్ల దాని గురించి చాలా మందికి తెలిసొచ్చిందని గీతా బస్రా అభిప్రాయపడింది. ఇక తన సతీమణి అనుష్క శర్మ ప్రసవ సమయంలో ఆమె పక్కనే ఉండేందుకు విరాట్ కోహ్లీ పెటర్నిటీ లీవ్‌పై ఆస్ట్రేలియా పర్యటన నుంచి మధ్యలోనే వచ్చిన విషయం తెలిసిందే.

ఆస్ట్రేలియా పర్యటన నుంచి..
విరాట్ కోహ్లీ అలా రావడంపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. దేశం కోసం విరాట్ ఆ మాత్రం త్యాగం చేయలేడా? అని కొందరంటే.. కుటుంబం కూడా ముఖ్యమేనని మరికొందరు వాదించారు. మొత్తానికి కోహ్లీ పనివల్ల పెటర్నిటీ లీవ్ అనే విషయంపై అందరికి అవగాహన కలిగింది. ఆ పర్యటనలో భారత్ నాలుగు టెస్ట్‌లు ఆడాల్సి ఉండగా.. కెప్టెన్‌గా ఉన్న కోహ్లీ ఫస్ట్ టెస్ట్ అనంతరం ఇండియాకు తిరిగిరావడంతో మూడు టెస్ట్‌లు మిస్సయ్యాడు. ఇక విరాట్-అనుష్కలకు గతేడాది జనవరి 11న వామిక జన్మించింది. ఇద్దరి పిల్లల తల్లి అయిన గీత.. టైమ్స్ ఆఫ్ ఇండియకు ఇచ్చి ఇంటర్వ్యూలో పెటర్నిటీ లీవ్‌పై అవగాహన కల్పించిన విరాట్‌పై ప్రశంసల జల్లు కురిపించింది.

కోహ్లీని మెచ్చుకోవాలి..
'జాబ్ చేస్తూనే నా తల్లి నాతో పాటు ఇద్దరు తోబుట్టువులను పెంచింది. నేను అలానే ఉండాలనుకున్నాను. బిడ్డను పెంచడంలో తల్లికి ఎంత బాధ్యత ఉందో తండ్రికి కూడా అంతే ఉంది. నేను పుట్టి పెరిగిన యూకేలో పెటర్నటీ లీవ్ అనేది సాధారణ విషయం. కానీ భారత్‌లో పెటర్నిటీ లీవ్ అంటే ఏంటో కూడా తెలియనివారు చాలా మంది ఉన్నారు. ఇలాంటిది ఒకటుందని కూడా చాలా మందికి తెలియదు. విరాట్ కోహ్లీ వల్ల ఈ విషయం చాలా మందికి తెలిసింది. ఈ పని చేసిన కోహ్లీని మెచ్చుకోవాలి.'అని గీతా బస్రా చెప్పుకొచ్చింది.

భజ్జీనే డైపర్స్ మారుస్తాడు..
తమ పిల్లల పెంపకం విషయంలో హర్భజన్ సింగ్ సాయం చేస్తాడని గీతా బస్రా చెప్పుకొచ్చింది. తమ కొడుకు డైపర్స్‌ను భజ్జీ మారుస్తాడని చెప్పింది. కానీ చాలా మంది మగవారు ఇలాంటి పనులు చేయరని, ఆ పని తల్లి మాత్రమే చేయాలనే భ్రమలో ఉంటారని చెప్పుకొచ్చింది. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రుల బాధ్యత సమంగా ఉండాలని చెప్పింది. ఇక అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన హర్భజన్ సింగ్.. కామెంటేటర్, అనలిస్ట్‌గా రెండో ఇన్నింగ్స్ ప్రారంభించగా.. ఆర్‌సీబీ తరఫున ఐపీఎల్ ఆడుతూ కోహ్లీ బిజీగా ఉన్నాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications