కెప్టెన్‌గా మయాంక్ అగర్వాల్‌కు స్వేచ్చనివ్వలేదు: హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ మయాంక్ అగర్వాల్ తీవ్ర అసౌకర్యానికి గురైనట్లు కనిపించిందని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. కెప్టెన్‌గా అతనికి పూర్తి స్వేచ్చనివ్వలేదని, ప్రత్యేక నిఘాలో జట్టును నడిపించాడని అభిప్రాయపడ్డాడు. ఐపీఎల్ 2022 సీజన్‌లో పంజాబ్ 7 విజయాలు, 7 ఓటములతో పాయింట్స్ టేబుల్‌లో ఆరోస్థానంలో నిలిచి ప్లేఆఫ్స్‌కు చేరకుండానే ఇంటిదారి పట్టింది. ఈ క్రమంలోనే తొలిసారి కెప్టెన్సీ చేపట్టిన మయాంక్ అగర్వాల్ బ్యాట్స్‌మన్‌గానూ విఫలమయ్యాడు.

ఒత్తిడికి గురయ్యాడు..
అతను 13 మ్యాచ్‌ల్లో 16.33 సగటుతో కేవలం 196 పరుగులే చేశాడు. ఈ నేపథ్యంలోనే ఓ చానెల్‌తో అతని బ్యాటింగ్ స్పందించిన హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. 'ఈ సీజన్‌లో మయాంక్ అగర్వాల్ ఆటను చూసి అతడికి ఏమైందోనని బాధపడ్డా. అతడెంతో మేటి ఆటగాడు. అయితే, కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాక మానసికంగా ఒత్తిడికి గురైనట్లు ఉన్నాడు. ఓపెనింగ్ బ్యాటింగ్ చేయాల్సిన అతడు నాలుగో స్థానంలో ఆడాడు. జట్టును కూడా బయటి నుంచి నడిపించారు.

కెప్టెన్‌గా స్వేచ్చలేదు..
అతడు కెప్టెన్‌గా అన్నీ చూసుకుంటున్నాడంతే. ఈ క్రమంలోనే తీవ్ర ఇబ్బందులకు గురైనట్లు కనిపించాడు. అతనికి కెప్టెన్‌గా స్వేచ్ఛనివ్వాల్సింది. కానీ, మయాంక్ ప్రత్యేక నిఘాలో ఉన్నట్లు అనిపించాడు' అని హర్భజన్ సింగ్ వివరించాడు. ఇదే కార్యక్రమంలో మాట్లాడిన మాజీ స్పిన్నర్ పీయూష్ చావ్లా.. ఈసారి కెప్టెన్సీ అతని ప్రదర్శనపై ప్రభావం చూపించిందని అన్నాడు.

కెప్టెన్సీ ఒత్తిడితోనే..
'గతేడాది మయాంక్ అగర్వాల్ ఆడిన తీరు అద్భుతం. అందుకే అతనిపై నమ్మకం ఉంచిన పంజాబ్ జట్టు ఈసారి అలాగే అట్టిపెట్టుకుంది. ఆ నమ్మకాన్ని అతను నిలబెట్టుకోలేకపోయాడు. మరోవైపు అతనికి ఇంతకుముందు దేశవాళి క్రికెట్‌లో లేదా భారత్-ఏ తరఫున కెప్టెన్సీ చేసిన అనుభం లేదు. ఆ లోపం ఈ సీజన్‌లో స్పష్టంగా కనిపించింది. అలాగే కెప్టెన్సీ ఒత్తిడి కూడా అతనిపై తీవ్ర ప్రభావం చూపినట్లు స్పష్టంగా కనిపించింది. కెప్టెన్సీ అనేది అందరూ చేయలేరు. మయాంక్‌కు కూడా ఆ బాధ్యత సరిపోలేదు' అని పీయూష్ చావ్లా అభిప్రాయపడ్డాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications