For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

నేను చేసిన అతి పెద్ద తప్పు అదే.. ఆమె మాటలకు నా కళ్లు చెమ్మగిల్లాయి: హర్భజన్ సింగ్

సహచర ఆటగాడైన శ్రీశాంత్‌ను మైదానంలో కొట్టడం తాను చేసిన అతి పెద్ద తప్పు అని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. ఈ ఘటన పట్ల ఇప్పటికీ పశ్చాతాపానికి గురువుతానని తెలిపాడు. జీవితంలో ఏదైనా మార్చుకునే అవకాశం ఇస్తే.. ఆ ఘటనను సరిదిద్దుకుంటానని చెప్పాడు. ఈ చెంపదెబ్బ ఘటనను ఉద్దేశించి శ్రీశాంత్ కూతురు తనతో అన్న మాటలు ఇప్పటికీ మరిచిపోలేదన్నాడు.

అరంగేట్ర ఐపీఎల్ 2008 సీజన్‌లో ఓ మ్యాచ్ సందర్భంగా శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చేయి చేసుకున్నాడు. ముంబై ఇండియన్స్ తరఫున బరిలోకి దిగిన హర్భజన్ సింగ్.. మ్యాచ్ అనంతరం పంజాబ్ కింగ్స్‌కు ఆడిన శ్రీశాంత్‌పై చేయి చేసుకున్నాడు. దాంతో శ్రీశాంత్ కన్నీటి పర్యంతమయ్యాడు. ఇదంతా టీవీ కెమెరాల్లో కనిపించింది. ఐపీఎల్ చరిత్రలోనే ఇది అత్యంత వివాదాస్పదమైన ఘటనగా నిలిచిపోయింది. హర్భజన్ సింగ్ క్షమాపణలు చెప్పినా.. అతనిపై బీసీసీఐ కఠిన చర్యలు తీసుకుంది. ఆ సీజన్‌లోని మిగతా మ్యాచ్‌లు ఆడకుండా నిషేధం విధించింది. ఈ ఘటన జరిగి 17 ఏళ్లు పూర్తయినా.. హర్భజన్ సింగ్ మరిచిపోలేదు. తాజాగా రవిచంద్రన్ అశ్విన్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఈ ఘటనను గుర్తు చేసుకుంటూ భావోద్వేగానికి లోనయ్యాడు.

Harbhajan Singh Recalls Slapgate Incident with Sreesanth and Confrontation by Sreesanth s Daughter

నా జీవితంలోనే చేసిన అతి పెద్ద తప్పు..

'నా జీవితంలో ఏదైనా మార్చుకొనే అవకాశాన్ని దేవుడిస్తే.. శ్రీశాంత్ జరిగిన ఘటనను సరిదిద్దుకుంటా. నా కెరీర్‌కు మచ్చగా మారిన ఈ ఘటనను పూర్తిగా తొలగిస్తా. నేను చేసింది తప్పే. అలా చేయి చేసుకోవాల్సింది కాదు. ఇప్పటికే 200 సార్లు క్షమాపణలు చెప్పి ఉంటా. ఇన్నేళ్లు గడిచినా.. ఆ ఘటన విషయంలో ఇప్పటికీ పశ్చాత్తాపపడుతూనే ఉంటా. తప్పులు చేయడం సహజమే. కానీ వాటిని పునరావృతం చేయకూడదు. అతను నా సహచరుడు. మేమిద్దం కలిసి మ్యాచ్‌లు ఆడాం. కానీ ఆ మ్యాచ్‌లో ప్రత్యర్థులుగా తలపడ్డాం. శ్రీశాంత్ రెచ్చగొట్టాడు. కానీ నేను కాస్త విజ్ఞతతలో ప్రవర్తించాల్సింది. చేయి చేసుకోవాల్సింది కాదు.

నీతో మాట్లాడను.. నువ్వు మా డాడీని కొట్టావు..

ఈ ఘటన జరిగిన చాలా రోజులకు శ్రీశాంత్ కూతురిని కలిసాను. ఆమెతో మాట్లాడేందుకు ప్రయత్నించా. కానీ ఆ చిన్నారి మాత్రం నాతో మాట్లాడటానికి నిరాకరించింది. 'నేను నీతో మాట్లాడాలనుకోవడం లేదు. నువ్వు మా డాడీని కొట్టావు'అని అంది. ఆ మాటలకు నా హృదయం ముక్కలైంది. కళ్లు చెమ్మగిల్లాయి. ఆమెను ఎలా ఆకట్టుకోవాలో అర్థం కాలేదు. నా గురించి తను ఇంకా ఇలానే ఆలోచిస్తోందా? అనిపించింది. ఆమె తండ్రిని కొట్టిన వ్యక్తిగానే చూస్తోందా? ఇప్పటికీ ఆ చిన్నారికి క్షమాపణలు మాత్రమే చెప్పగలను. అంతకు మించి ఏం చేయలేను. ఈ సందర్భంగా ఓ మాట ఇస్తున్నా. నాపై తన ఉద్దేశానికి మార్చుకునేందుకు ఏం చేయడానికైనా సిద్దమే. నేను అలాంటి వ్యక్తిని కాదని నిరూపించుకోవడానికి ఏం చేయాలో చెప్పండి. ఆమె పెద్దయ్యాక నన్ను ఆకోణంలో చూడకూడదని భావిస్తున్నా. ఓ అంకుల్‌గా ఆ చిన్నారికి ఎప్పుడూ అండగా ఉంటా. నా కెరీర్‌ను ఆ ఘటనను తొలగించాలనుకుంటున్నా' హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Monday, July 21, 2025, 14:43 [IST]
Other articles published on Jul 21, 2025
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+