
డారెన్ లీమన్ స్లెడ్జింగ్‌తో..
ఈ క్రమంలో ఓ మ్యాచ్ సందర్భంగా భజ్జీని కవ్వించే ప్రయత్నం చేయగా.. అతను తనదైన శైలిలో బదులిచ్చాడట. ఈ విషయాన్ని అప్ కి అదాలత్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూలో భజ్జీ చెప్పుకొచ్చాడు. 'ఆస్ట్రేలియా ఆటగాళ్లు అంటే స్లెడ్జింగ్‌కు మారుపేరుగా ఉండేవారు. ముఖ్యంగా వారి గడ్డపై సిరీస్ ఆడే జట్లను తమ స్లెడ్జింగ్‌తోనే మానసికంగా దెబ్బతీసి పైచేయి సాధించేవారు. కానీ నాలాంటి వారిని ఎదుర్కొనడానికి మాత్రం ఆస్ట్రేలియన్ ఆటగాళ్లు భయపడేవారు. ఒక సందర్భంగా మ్యాచ్‌లో నేను బ్యాటింగ్ చేస్తున్న సమయంలో నా పక్కనే ఉన్న డారెన్ లీమన్ అదే పనిగా నాపై స్లెడ్జింగ్ చేస్తూనే ఉన్నాడు.

గర్భవతివా..?
దానికి చిర్రెత్తి పోయిన నేను.. లీమన్ పొట్టవైపు చూస్తూ.. నువ్వేమైనా గర్భవతివా.. ఆ పొట్టేంటి! అని నవ్వుతూనే అడిగేసాను. ఆ సమయంలో ఈ విషయంపై ఇద్దరి మధ్య చిన్నపాటి వాగ్వాదం కూడా జరిగింది. అయితే ఈ విషయాన్ని లీమన్ అప్పటి స్పిన్నర్ షేన్ వార్న్‌కు చెప్పాడు. అంతే.. వార్న్ ఒక్కసారిగా పగలబడి నవ్వుతూ.. ''నా దగ్గరకొచ్చి లీమన్ ఏమైనా అన్నావా'' అని అడిగాడు. దానికి ''నేను అవునని సమాధానం ఇవ్వడంతో.. కరెక్టే.. ఆటగాళ్లకు అంత పెద్ద పొట్ట ఉండకూడదు''.
ఆ తర్వాత వార్నర్ లీమన్‌తో.. మనం ఎవరినైనా స్లెడ్జ్ చేయొచ్చు.. కానీ టర్బోనేటర్‌తో(భజ్జీ) మాత్రం జాగ్రత్తగా ఉండాలి అని చెప్పడం నాకు ఇప్పటికి గుర్తుంది.'' అని ఆప్ కి అదాలత్‌కు గతంలో ఇచ్చిన ఇంటర్య్వూలో భజ్జీ చెప్పుకొచ్చాడు. అతని రిటైర్మెంట్ నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి.

ఆటో బయోగ్రఫీ ద్వారా
23 ఏళ్ల కెరీర్‌లో టీమిండియా స్పిన్నర్‌గా ఎన్నో ఘనతలు అందుకున్న భజ్జీ టెస్టుల్లో 400కు పైగా వికెట్లు, వన్డేల్లో 200కు పైగా వికెట్లు, టీ20ల్లో 25 వికెట్లు.. ఓవరాల్‌గా అన్ని ఫార్మాట్లు కలిపి 711 వికెట్లు పడగొట్టాడు. ఇక తన కెరీర్‌లోనే మాయని మచ్చలా మిగిలిపోయిన మంకీ గేట్ వివాదంపై స్పందించాడు. అతి త్వరలోనే ఆ వివాదం గురించి తన ఆటో బయోగ్రఫీ ద్వారా వాస్తవాలు తెలియజేస్తానని చెప్పాడు.
భారత జట్టు 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో చోటుచేసుకున్న ఈ 'మంకీగేట్ వివాదం' అప్పట్లో తీవ్ర దుమారం రేగింది. ఈ వివాదంలో భజ్జీ జాతి విద్వేష వ్యాఖ్యలు చేయలేదని తేలినా.. చివరికి మ్యాచ్ ఫీజులో 50 శాతం కోతకు గురయ్యాడు. అయితే ఈ వివాదంతో తన వాదనను ఎవరూ వినలేదన్నాడు.


Click it and Unblock the Notifications












