షేన్ వార్న్‌ను చూసి బౌలింగ్ చేయకుండా బీరిపోయా: హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ: ఆస్ట్రేలియా దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్‌తో తనకు ఉన్న అనుబంధాన్ని టీమిండియా మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ గుర్తు చేసుకున్నాడు.షేన్ వార్న్ క్రికెట్ చరిత్రలో ఒక గొప్ప ఆటగాడంటూ ప్రశంసించాడు. తనతో సహా ఒక తరానికే అతను ప్రేరణగా నిలిచాడని కొనియాడాడు. ఆస్ట్రేలియా మాజీ పేసర్ బ్రెట్ లీ పాడ్‌కాస్ట్‌లో మాట్లాడిన భజ్జీ ఈ వ్యాఖ్యలు చేశాడు. ఈ సందర్భంగా 2001లో ఆస్ట్రేలియా.. భారత పర్యటనకు వచ్చినపుడు జరిగిన ఓ సంఘటనను హర్భజన్ గుర్తు చేసుకున్నాడు.

అలా చూస్తూ ఉండిపోయా..
'చెన్నైలో జరుగుతున్న మూడో టెస్టులో స్టీవ్ వాతో కలిసి షేన్ వార్న్ బ్యాటింగ్ చేస్తున్నాడు. వార్న్ నాన్ స్ట్రైకర్ ఎండ్‌లో ఉండగా.. నా రన్‌అప్‌లో ఉండి అతడినే చూస్తు నిలబడ్డా. వార్న్ వచ్చి 'ఏమైనా సమస్యా' అని అడిగాడు. దీంతో అతడి దగ్గరికి వెళ్లి 'నా పక్కనే ఉన్న నా హీరోను ఆరాధిస్తున్నాను. ఇదంతా ఒక కలగా అనిపిస్తుంది. మీతో కలిసి ఆడటం గొప్ప అనుభూతి' అని చెప్పా. అప్పటి నుంచి మా ఇద్దరి మధ్య బంధం కొనసాగుతూనే ఉంది. నేను ఆ సిరీస్‌లో 32 వికెట్లు తీసినప్పుడు కూడా వార్న్ నన్ను అభినందించాడు."అని హర్భజన్ చెప్పుకొచ్చాడు.

అత్యధిక వికెట్ల వీరుడిగా..
ఇక స్నేహితులతో థాయిలాండ్ వెకేషన్‌ను వెళ్లిన షేన్ వార్న్.. ఈ నెల 4న హఠాన్మరణం చెందిన విషయం తెలిసిందే. టెస్టుల్లో 708 వికెట్లు తీసిన వార్న్ అత్యధిక వికెట్లు తీసిన జాబితాలో రెండో స్థానంలో ఉన్నాడు. శ్రీలంక దిగ్గజ స్పిన్నర్ ముత్తయ్య మురళీధరన్ 800 వికెట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. 5 టెస్టు మ్యాచ్‌ల్లో 708 వికెట్లు తీసిన వార్న్, 194 వన్డే మ్యాచ్‌ల్లో 293 వికెట్లు పడగొట్టాడు. ఇక ఐపీఎల్‌లోనూ ఆడిన షేన్ వార్న్ 55 మ్యాచ్‌ల్లో 57 వికెట్లు తీశాడు. అంతేకాకుండా కెప్టెన్‌గా రాజస్థాన్ రాయల్స్‌ను తొలి సీజన్లోనే టైటిల్ విజేతగా నిలబెట్టాడు.

మెల్‌బోర్న్‌లో అంత్యక్రియలు..
ఇక రెండు రోజుల క్రితమే షేన్ వార్న్ అంత్యక్రియలు ముగిసిన విషయం తెలిసిందే. మెల్‌బోర్న్‌లో జరిగిన ఈ కార్యక్రమానికి షేన్ వార్న్ కుటుంబసభ్యులతోపాటు 80 మంది ఇతరులు హాజరయ్యారు. వారంతా వార్న్‌కు బరువెక్కిన హృదయంతో కన్నీటి వీడ్కోలు పలికారు. షేన్ వార్న్ అంత్యక్రియల్లో పాల్గొన్న వారిలో తల్లిదండ్రులు కీత్, బ్రిగెట్, అతడి ముగ్గురు పిల్లలు ఉన్నారు. ఇక క్రికెట్‌లో వార్న్‌కు సన్నిహితంగా ఉన్న ఆండ్రూ సైమండ్స్, మైకేల్ క్లార్క్, మార్క్ టేలర్, మెర్వ్ హ్యూస్, గ్లెన్ మెక్‌గ్రాత్, ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, మెర్వ్ హ్యూస్ తదితరులు కూడా అంత్యక్రియల్లో పాల్గొన్నారు.

మెల్‌బోర్న్‌తో వీడదీయని బంధం..
ఇక మార్చి 30న మెల్‌బోర్న్ క్రికెట్ గ్రౌండ్ వేదికగా ఆస్ట్రేలియా ప్రభుత్వం ఆధ్వర్యంలో షేన్ వార్న్ అధికారిక స్మారక సభను నిర్వహించనున్నారు. ఈ స్మారక సభకు షేన్ వార్న్ కుటుంబసభ్యులతోపాటు స్నేహితులు అనేక మంది ప్రముఖులు హాజరయ్యే అవకాశాలున్నాయి. కాగా మెల్‌బోర్న్‌తో షేన్‌వార్న్‌కు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వార్న్ పుట్టి పెరిగిందంతా మెల్‌బోర్న్‌లోనే కావడం గమనార్హం. 1994లో యాషెస్ సిరీస్‌లో హ్యాట్రిక్ వికెట్లు వార్న్ మెల్‌బోర్న్ మైదానంలోనే సాధించాడు. ఇక 2006లో బాక్సింగ్ డే రోజున తీసిన 700వ టెస్ట్ వికెట్, అంతర్జాతీయ క్రికెట్‌లో తన చివరి మ్యాచ్ షేన్‌వార్న్ ఇక్కడే ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications