ధర్మశాల: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వ్యతిరేకంగా తాను ఎటువంటి వ్యాఖ్యలు చేయలేదని, తన వ్యాఖ్యలను మీడియా వక్రీకరించిందని వెటరన్ ఆఫ్ స్నిన్నర్ హార్భజన్ సింగ్ సోమవారం మైక్రో బ్లాగింగ్ వెబ్‌సైట్ ట్విట్టర్ ద్వారా వివరణ ఇచ్చాడు.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండివివరాల్లోకి వెళితే... న్యూజిలాండ్‌తో జరిగిన మూడు మ్యాచ్‌ల టెస్టు మ్యాచ్‌ల సిరిస్‌లో 27 వికెట్లు తీసుకుని బౌలింగ్‌లో అశ్విన్ సరికొత్త రికార్డు నెలకొల్పాడు. అంతేకాదు చివరిదైన ఇండోర్ టెస్టులో భారత్ విజయం సాధించడంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్' అవార్డుని అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో టెస్టుల్లో నెంబర్ వన్ ర్యాంకుని కైవసం చేసుకున్నాడు. అంతేకాదు భారత క్రికెట్ చరిత్రలో వందేళ్లలో ఎవరికీ సాధ్యం కాని అరుదైన రికార్డుని అశ్విన్ సొంతం చేసుకున్నాడు. టెస్టుల్లో స్ట్రయిక్ రేట్ పరంగా చూస్తే, గత వందేళ్లలో అశ్విన్ నెంబర్ వన్ స్థానంలో నిలిచాడు.

''గత నాలుగేళ్లుగా భారత్ ఆడుతున్నటువంటి పిచ్‌లపై నేను, కుంబ్లే ఆడుంటే ఇంకా చాలా చాలా వికెట్లు పడగొట్టేవాళ్లం'' అని అశ్విన్‌ని ఉద్దేశించి భజ్జీ వ్యాఖ్యానించాడు. దీంతో అశ్విన్‌పై హర్భజన్ సింగ్ చేసిన వ్యాఖ్యలు క్రికెట్ వర్గాల్లో చర్చనీయాంశమయ్యాయి.
భారత్ Vs న్యూజిలాండ్ ధర్మశాల వన్డే చిత్రాలుఒక సీనియర్ ఆటగాడిగా, సాటి క్రికెటర్‌గా హర్భజన్ ఇలా మాట్లాడడం మంచిది కాదని కొందరు చెబుతుంటే, భజ్జీ మాత్రం అసూయతోనే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని విమర్శించారు. ఈ వివాదం కాస్త చిలికి చిలికి 'హార్భజన్ వర్సెస్ అశ్విన్' టైటిల్‌లాగా మారింది.
ఎవరు గొప్ప?: అశ్విన్‌పై అసూయతోనే భజ్జీ వ్యాఖ్యలు దీంతో ఈ అంశంపై అశ్విన్ సోమవారం ట్విట్టర్లో ట్వీట్ చేశాడు. హార్భజన్ సింగ్ తనకు ప్రేరణ అని, 2001 సిరిస్ తర్వాత అతడిని చూసే తాను ఆఫ్ స్పిన్ బౌలింగ్ నేర్చుకున్నట్లు తెలిపాడు. ఈ వివాదం అనారోగ్యకరంగా ఉందని పేర్కొన్నాడు.
అశ్విన్ ట్వీట్‌పై హార్భజన్ సింగ్ కూడా స్పందించాడు. నీకు వ్యతిరేకంగా తానేమీ చెప్పలేదని తెలిపాడు. కొన్ని కారణాల వల్ల తన వ్యాఖ్యలను వక్రీకరించాలని తెలిపాడు. అశ్విన్‌కు మద్దతు తెలుపుతూ జాతీయ జెండాను మరింతగా ఎగిరేలా చేయాలంటూ ట్వీట్ చేశాడు.