Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అభిషేక్ శర్మను ఎందుకు ఎంపిక చేయలేదు.. బీసీసీఐపై భారత మాజీ క్రికెటర్ ఫైర్!

శ్రీలంక పర్యటనకు సన్‌రైజర్స్ హైదరాబాద్ సంచలనం, టీమిండియా ఓపెనర్ అభిషేక్ శర్మను ఎంపిక చేయకపోవడాన్ని మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్ తప్పుబట్టాడు. జింబాబ్వే పర్యటనలో రికార్డు సెంచరీ సాధించిన అభిషేక్ శర్మను తదుపరి పర్యటనకు ఎంపిక చేయకపోవడం సరికాదన్నాడు. మూడు టీ20లు, మూడు వన్డేల కోసం టీమిండియా.. శ్రీలంక పర్యటనకు వెళ్లనుంది.

జూలై 27 నుంచి ఈ టూర్ ప్రారంభం కానుండగా.. నయా హెడ్ కోచ్‌ గౌతమ్ గంభీర్ బాధ్యతలు చేపట్టనున్నాడు. ఈ పర్యటనకు వెళ్లే భారత టీ20, వన్డే ఫార్మాట్ల జట్లను అజిత్ అగార్కర్ సారథ్యంలోని సెలెక్షన్ కమిటీ గురువారం ప్రకటించింది. భారత టీ20 జట్టులో అభిషేక్ శర్మతో పాటు యుజ్వేంద్ర చాహల్‌కు చోటు దక్కలేదు.

Harbhajan Singh Questions Selection Committee s Decision To Bench THESE Three Cricketers For Sri Lanka Series

వన్డే ప్రపంచకప్‌లో సంజూ శాంసన్‌ను పక్కనపెట్టారు. జింబాబ్వే పర్యటనలో అభిషేక్ శర్మ విధ్వంసంకర శతకంతో చెలరేగాడు. అయినా అతన్ని సెలెక్టర్లు పక్కనపెట్టారు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. భారత జట్ల ఎంపికపై హర్భజన్ సింగ్ సోషల్ మీడియా వేదికగా అసంతృప్తి వ్యక్తం చేశాడు.

'యుజ్వేంద్ర చాహల్, అభిషేక్ శర్మ, సంజూ శాంసన్ అద్భుతమైన ఆటగాళ్లు. ఈ ముగ్గురికీ చోటు ఎందుకు దక్కలేదో అర్థం చేసుకోవడం చాలా కష్టం.'అని పేర్కొన్నాడు. సంజూ శాంసన్‌ టీ20లకు ఎంపికవ్వగా.. మిగతా ఇద్దరికీ శ్రీలంక పర్యటనలో చోటు దక్కలేదు. శ్రీలంక పర్యటనకు సీనియర్ ఆటగాళ్లు దూరంగా ఉంటారని ప్రచారం జరిగింది. కానీ గంభీర్ పట్టుబట్టడంతో కెప్టెన్ రోహిత్ శర్మతో పాటు విరాట్ కోహ్లీ వన్డే సిరీస్‌తో రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్దమయ్యారు.

ప్రస్తుతం విరాట్ కోహ్లీ లండన్‌లో ఉండగా.. రోహిత్ శర్మ అమెరికాలో కుటుంబంతో హాలీడేస్ ఎంజాయ్ చేస్తున్నారు.

భారత వన్డే జట్టు: రోహిత్ శర్మ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), విరాట్ కోహ్లి, కేఎల్ రాహుల్, రిషభ్ పంత్, శ్రేయస్ అయ్యర్, శివమ్ దూబె, కుల్‌దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, వాషింగ్టన్ సుందర్, అర్షదీప్ సింగ్, రియాన్ పరాగ్, అక్షర్ పటేల్, ఖలీల్ అహ్మద్, హర్షిత్ రాణా.

టీమిండియా టీ20 జట్టు:
సూర్యకుమార్ యాదవ్ (కెప్టెన్), శుభ్‌మన్ గిల్ (వైస్ కెప్టెన్), యశస్వీ జైస్వాల్, రింకూ సింగ్, రియాన్ పరాగ్, రిషభ్ పంత్, సంజు శాంసన్, హార్దిక్ పాండ్య, శివమ్ దూబె, అక్షర్ పటేల్, వాషింగ్టన్ సుందర్, రవి బిష్ణోయ్, అర్షదీప్ సింగ్, ఖలీల్ అహ్మద్, మహ్మద్ సిరాజ్

Story first published: Saturday, July 20, 2024, 18:27 [IST]
Other articles published on Jul 20, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+