Harbhajan Singh: ఆ ఇద్దరు జట్టులోకి వస్తే విజయం మనదే.. ఇప్పటికైనా నా మాట వినండి! హర్భజన్ జట్టు ఇదే!

హైదరాబాద్: టీ20 ప్రపంచకప్ 2021 తొలి మ్యాచ్‌లోనే టీమిండియాకు భారీ షాక్ తగిలిన విషయం తెలిసిందే. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌పై భారత్ ఘోర ఓటమిని ఎదుర్కొంది. ఆదివారం దుబాయి అంతర్జాతీయ మైదానంలో జరిగిన మ్యాచ్‌లో భారత్ 10 వికెట్ల తేడాతో ఓడిపోయింది. ముందుగా బ్యాటింగ్ చేసిన భారత్ నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 151 పరుగుల స్కోర్ చేయగా.. పాక్ మరో 13 బంతులు మిగిలుండగానే విజయం సాధించి ప్రపంచకప్‌ల అపజయాల పరంపరకు అడ్డుకట్ట వేసింది.
ఇక బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో పూర్తిగా విఫలమయిన కోహ్లీసేనపై విమర్శల వర్షం కురుస్తోంది. మ్యాచ్ అనంతరం పలువురు క్రీడా పండితులు భారత్ ప్రదర్శనపై విమర్శలు చేయగా.. మరికొంతమంది ఆటలో గెలుపోటములు సహజమేనని పేర్కొన్నారు. ఇక భారత మాజీ ప్లేయర్స్ రానున్న మ్యాచులకు జట్టులో కొన్ని మార్పులు చేయాలని సూచిస్తున్నారు.

హర్భజన్ సూచనలు
టీ20 ప్రపంచకప్ 2021లో రానున్న మ్యాచులలో భారత జట్టు కొన్ని మార్పులతో బరిలోకి దిగాలని టీమిండియా వెటరన్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ సూచించాడు. ఫామ్‌లో ఉన్న ఇషాన్ కిషన్, శార్దూల్ ఠాకూర్‌ను తుది జట్టులో ఆడించాలన్నాడు. ఈ ఇద్దరు జట్టులోకి వస్తే విజయం మనదే అని.. ఇప్పటికైనా తన మాట వినండని భజ్జి అన్నాడు.
న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే మ్యాచులో రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్ ఓపెనర్లుగా రావాలన్నాడు. మూడవ స్థానంలో విరాట్ కోహ్లీ, నాలుగవ స్థానంలో లోకేష్ రాహుల్ వస్తే బ్యాటింగ్ ఆర్డర్ చాలా బాగుంటుందని హర్భజన్ అభిప్రాయపడ్డాడు. శార్దూల్ ఠాకూర్‌ను 8వ స్థానంలో దించాలని సూచించాడు.
IND vs PAK: టీమిండియా ఓటమికి కారణాలు చెప్పిన సచిన్.. అవేంటో తెలుసా?

ఠాకూర్‌ను 8వ స్థానంలో దించాలి
ఈ విషయాన్ని నేను చాలా కాలంగా చెబుతున్నా. ఇషాన్ కిషన్‌కు ఆడే అవకాశం ఇవ్వండి. న్యూజిలాండ్ జట్టుతో జరగబోయే మ్యాచులో రోహిత్ శర్మతో కలిసి అతడు ఓపెనర్‌గా రావాలి. విరాట్ కోహ్లీ మూడు, లోకేష్ రాహుల్ నాలుగు, రిషబ్ పంత్ ఐదో స్థానంలో దిగాలి. హార్దిక్ పాండ్యా ఆరో స్థానంలో బ్యాటింగ్‌కు వస్తే బాగుంటుంది.
పాక్‌పై విఫలమైనా.. హార్దిక్ మ్యాచ్ విన్నర్. రవీంద్ర జడేజా ఏడో స్థానంలో రావాలి. శార్దూల్ ఠాకూర్‌ను 8వ స్థానంలో దించాలి. శార్దూల్ ఇప్పటికే బ్యాటింగ్, బౌలింగ్, ఫీల్డింగ్‌లోనూ నిరూపించుకున్నాడు. శార్దూల్‌కు కచ్చితంగా ఓ అవకాశం ఇవ్వాలి. జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తిలు తర్వాత వస్తే బాగుంటుంది' అని హర్భజన్ సింగ్ చెప్పాడు.

దారులు పూర్తిగా మూసుకుపోలేదు
భారత్ ఘోర ఓటమిపై కూడా హర్భజన్ సింగ్ స్పందించాడు. 'పాక్‌పై ఓడిపోవడం భారత జట్టుపై పెద్దగా ప్రభావం చూపదని అనుకుంటున్నా. ఎందుకంటే.. ఇది తొలి మ్యాచ్ మాత్రమే. ఇలాంటి టోర్నీలో గొప్ప ఆరంభం లభించాలి. అయినా ఈ ఓటమితో దారులు పూర్తిగా మూసుకుపోలేదు. భారత జట్టు బలంగా ఉంది. మంచి ప్లేయర్స్ ఉన్నారు. గొప్పగా పుంజుకుంటారని నేను భావిస్తున్నా. చేసిన తప్పులను సరిదిద్దుకుని తిరిగి గెలుపు బాట పడతారు' అని హర్భజన్ ధీమా వ్యక్తం చేశాడు. భారత్‌తో జరిగిన మ్యాచ్‌లో పాకిస్థాన్ 10 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది.

హర్భజన్ సింగ్ ఎంపిక చేసిన భారత జట్టు ఇదే
రోహిత్ శర్మ, ఇషాన్ కిషన్, విరాట్ కోహ్లీ, లోకేష్ రాహుల్, రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, జస్ప్రీత్ బుమ్రా, మొహ్మద్ షమీ, వరుణ్ చక్రవర్తి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications