న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

గంగూలీ లేకుంటే నా క్రికెట్ కెరీరే ఉండేది కాదు: భజ్జీ

Harbhajan Singh opens up on Sourav Ganguly’s influence on his career

న్యూఢిల్లీ: తన కెరీర్‌లో మాజీ సారథి సౌరవ్ గంగూలీ ఇచ్చిన మద్దతు మరే కెప్టెన్ నుంచి లభించలేదని భారత వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు.1998లో అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన భజ్జీ.. కెరీర్ ప్రారంభంలో ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు చెప్పుకొచ్చాడు. జట్టులో అప్పటి వరకూ తనకు మద్దతుగా నిలుస్తామని చెప్పిన వారు.. కష్టకాలంలో పత్తాలేకుండా పోయారన్న హర్భజన్.. గంగూలీ ఒక్కడే తనకు అండగా నిలిచాడని గుర్తు చేసుకున్నాడు.

'నా జీవితంలో సౌరవ్ గంగూలీ పాత్ర చాలా కీలకమైనది. ఓ దశలో నాతో ఉన్నవారెవరూ.. లేని వారెవరో తెలియలేదు. అప్పటి వరకూ మేమున్నాం అని నా ఎదుటే చెప్పినవాళ్లు పత్తా లేకుండా పోయారు. సెలక్టర్లు నా గురించి చాలా వ్యతిరేకంగా మాట్లాడారు. కానీ.. ఆ సమయంలో నా వెనుక ఎవరూ లేకున్నా.. సెలెక్టర్లు వ్యతిరేకంగా ఉన్నా.. సారథిగా సౌరవ్ గంగూలీ నాకు మద్దతుగా నిలిచాడు.

నాకు తెలిసి అతని స్థానంలో ఏ కెప్టెన్ ఉన్నా నాకు సపోర్ట్ ఇచ్చేవాడు కాదు. గంగూలీ వల్లే నా కెరీర్‌ను కొనసాగించా. అతనే లేకుంటే నేను 100 టెస్ట్‌లు ఆడేవాడిని కాదు.'అని భారత మాజీ ఓపెనర్ ఆకాష్ చోప్రా నిర్వహించిన ఓ యూట్యూబ్ షోలో పాల్గొన్న హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

అజారుద్దీన్ సారథ్యంలో అరంగేట్రం చేసిన భజ్జీ.. గంగూలీ కెప్టెన్సీలోనే ఎక్కువ కాలం ఆడాడు. ఇక ధోనీ సారథ్యంలో భారత్ గెలిచిన 2007, 2011 ప్రపంచకప్‌ జట్లలో హర్భజన్ కూడా ఉన్నాడు. కుంబ్లే, విరాట్ నాయకత్వంలో కూడా ఆడాడు. ఐపీఎల్‌లో రోహిత్ సారథ్యంలో కూడా బరిలోకి దిగాడు.
భారత్ తరఫున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20 మ్యాచ్‌లాడిన హర్భజన్ .. మొత్తం 711 వికెట్లు పడగొట్టాడు. భారత తరఫున చివరిసారిగా 2015లో ఆడిన ఈ వెటరన్ స్పిన్నర్ పునరాగమనం కోసం ఉవ్విళ్లూరుతున్నాడు. టీ20 ప్రపంచకప్ ఆడుతానని కూడా ఇటీవలే తన మనసులోని కోరికను బయటపెట్టాడు.

అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆడిన సచిన్!అండర్‌వేర్‌లో టిష్యూ పేపర్లు పెట్టుకొని ఆడిన సచిన్!

Story first published: Tuesday, June 16, 2020, 18:16 [IST]
Other articles published on Jun 16, 2020
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X