Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

శుభ్‌మన్ గిల్ భారత క్రికెట్‌ను ఏలుతాడు: హర్భజన్ సింగ్

Harbhajan Singh Lavishes praise for Shubman Gill, He is future India captain

న్యూఢిల్లీ: టీమిండియా యువ బ్యాటర్ శుభ్‌‌మన్ గిల్‌పై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. భవిష్యత్తులో భారత క్రికెట్‌ను అతను ఏలుతాడని జోస్యం చెప్పాడు. భవిష్యత్తు సారథి అతనేనని కొనియాడాడు. ప్రస్తుతం అతను అత్యద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడని, స్టార్ ప్లేయర్లు విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ తరహాలో బ్యాటింగ్ చేస్తున్నాడని మెచ్చుకున్నాడు.

జింబాబ్వేతో సోమవారం జరిగిన ఆఖరి వన్డేలో శుభ్‌గిల్(130) సెంచరీతో రాణించిన విషయం తెలిసిందే. కెరీర్‌లో అతనికి ఇదే తొలి సెంచరీ కాగా.. గతంలో అనేక సార్లు 90 పరుగుల వద్ద ఔటయ్యాడు. ఎట్టకేలకు నిన్నటి మ్యాచ్‌లో శతకాన్ని అందుకున్నాడు. ఈ క్రమంలోనే గిల్‌పై ప్రశంసల జల్లు కురుస్తోంది.

భవిష్యత్తు సారథి..

భవిష్యత్తు సారథి..

ఈ నేపథ్యంలోనే టైమ్స్ ఆఫ్ ఇండియాతో మాట్లాడిన హర్భజన్.. గిల్‌ను తన ప్రశంసలతో ఆకాశానికెత్తాడు. 'శుభ్‌మన్ గిల్‌ అద్భుతమైన ఫామ్‌లో ఉన్నాడు. అతని బ్యాటింగ్ టెక్నిక్, షాట్ సెలెక్షన్ అద్భుతంగా ఉన్నాయి. గిల్‌ బ్యాటింగ్‌ శైలీ భారత జట్టులో రోహిత్‌ శర్మ, విరాట్‌ కోహ్లి, రాహుల్‌ వంటి కీలక ఆటగాళ్లను తలపిస్తోంది. నాకైతే అతను భావి భారత కెప్టెన్‌ అవుతాడని అనిపిస్తోంది. అతనికి కెప్టెన్‌గా అనుభవం లేనప్పటకీ రాబోయే రోజుల్లో అతను నేర్చుకోనే అవకాశం ఉంది'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

సచిన్‌ రికార్డు బద్దలు!

సచిన్‌ రికార్డు బద్దలు!

జింబాబ్వేతో మూడో వన్డేలో 130 పరుగులు సాధించిన గిల్‌ ఓ అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. జింబాబ్వే గడ్డపై అత్యధిక వ్యక్తిగత స్కోర్‌ సాధించిన భారత ఆటగాడిగా గిల్‌ నిలిచాడు. అంతకుమందు ఈ రికార్డు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ పేరిట ఉండేది. 1998లో బులవాయో వేదికగా జింబాబ్వేతో జరిగిన వన్డేలో 127 పరుగులు సాధించి సచిన్‌ అజేయంగా నిలిచాడు.

తాజా మ్యాచ్‌లో సచిన్‌ 24 ఏళ్ల రికార్డును గిల్‌ అధిగమించాడు. విదేశీ గడ్డపై సెంచరీ చేసిన మూడో పిన్న వయస్కుడిగా నిలిచిన శుభ్‌మన్.. రోహిత్ శర్మ(23 ఏళ్ల 218 రోజులు) రికార్డును అధిగమించాడు. ఈ జాబితాలో గిల్(22 ఏళ్ల 348 రోజులు) కంటే యువ రాజ్(22 ఏళ్ల 41 రోజులు), విరాట్ కోహ్లీ(22 ఏళ్ల 315 రోజులు) ముందు స్థానంలో ఉన్నారు.

 రెండు అవార్డులు గిల్‌కే..

రెండు అవార్డులు గిల్‌కే..

ఇక మూడో వన్డేతో పాటు ఓవరాల్‌ సిరీస్‌లో అదరగొట్టిన గిల్‌కు మ్యాన్‌ ఆఫ్‌ది మ్యాచ్‌తో పాటు సిరీస్‌ అవార్డులు వరించాయి. ఈ సిరీస్‌లో మూడు మ్యాచ్‌లు ఆడిన గిల్‌ 245 పరుగులు సాధించాడు. అతని ఇన్నింగ్స్‌లో ఒక సెంచరీ, అర్ధశతకం ఉన్నాయి. కాగా ఇప్పటి వరకు భారత్‌ తరపున 9 వన్డేలు ఆడిన గిల్‌ 499 పరుగులు చేశాడు. మూడో వన్డేలో అతను పట్టి స్టన్నింగ్ క్యాచ్‌తోనే భారత్ విజయం సాధించింది.

Story first published: Tuesday, August 23, 2022, 18:13 [IST]
Other articles published on Aug 23, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+