For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Harbhajan Singh Retirement: శ్రీశాంత్ చెంప దెబ్బ.. భజ్జీ కెరీర్‌లోనే ఓ మాయని మచ్చ!

Harbhajan Singh Hitting Sreesanth Becomes Biggest Controversy In His Career

హైదరాబాద్: చిన్న స్పాట్ జంప్.. టూ స్టెప్ యాంగులర్ రనప్.. బ్యాట్స్‌మెన్‌‌ను బోల్తా కొట్టించే వేగం.. వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ బౌలింగ్ స్టైల్.. నాగు పాముల్లా తిరిగే బంతులతో బ్యాట్స్‌మెన్‌ను బెంబేలెత్తించడం.. ఎండకాస్తే ముచ్చెమటలు పట్టించడం.. అతని నైజం. ఈ తరహా బౌలింగ్‌తో భజ్జీ భారత జట్టుకు ఎన్నో చిరస్మరణీయ విజయాలను అందించాడు. భారత టాప్ స్పిన్నర్‌గా అందరి ప్రశంసలు అందుకున్నా.. అందరి క్రికెటర్లలానే సరైన ముగింపు అందుకోలేకపోయాడు. 1998లో అరంగేట్రం చేసిన భజ్జీ.. తన చివరి అంతర్జాతీయ మ్యాచ్‌ను 2016లో ఆడాడు. అప్పటి నుంచి భారత జట్టులో చోటు లభించకపోయినా ఐపీఎల్‌లో సత్తా చాటాడు. ఓ రకంగా ఐదేళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌కు దూరమైనా.. అన్ని రకాల ఆటకు నేడే(శుక్రవారం) వీడ్కోలు పలికాడు.

హర్భజన్ ఒక్కడే..

హర్భజన్ ఒక్కడే..

100 ప్లస్ టెస్ట్ కెరీర్.. 400 ప్లస్ వికెట్స్‌తో పాటు రెండు ప్రపంచకప్‌లు గెలిచిన హర్భజన్ సింగ్ భారత క్రికెట్‌లో ఓ గొప్ప స్పిన్నర్ అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. సాయం చేసిన వారికి ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా నిలవడం భజ్జీ నైజం. 2000 సంత్సరంలో తండ్రి మరణం తర్వాత అమెరికాకు వలస వెళ్లాలనుకున్న భజ్జీకి అండగా నిలిచిన సౌరవ్ గంగూలీకి.. ఇప్పటికీ కృతజ్ఞతగానే ఉంటాడు. గ్రేగ్ చాపెల్, సౌరవ్ గంగూలీ మధ్య తతెత్తిన వివాద సమయంలో భజ్జీ ఒక్కడే గంగూలీకి అండగా నిలిచాడు. మీడియా ముందుకు వచ్చి వాస్తవాలు మాట్లాడాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలోని నాణ్యతలేని ఫుడ్‌పై గళం విప్పింది కూడా అతనే. క్రికెట్ పెద్దల ప్రమేయం ఉన్నా.. అతను వెనక్కి తగ్గలేదు. 2000-2011 సమయం హర్భజన్ సింగ్ కెరీర్‌లో గోల్డెన్ ఈయర్స్ అని చెప్పవచ్చు. సహచర బౌలర్ అనిల్ కుంబ్లేతో కలిసి భజ్జీ ఎన్నో విజయాలు అందించాడు.

శ్రీశాంత్ చెంపదెబ్బ..

శ్రీశాంత్ చెంపదెబ్బ..

ఇలా ఎన్నో విషయాల్లో క్లీన్‌గా ఉన్న భజ్జీ కెరీర్‌లో వివాదాలు కూడా ఉన్నాయి. ఐపీఎల్ అరంగేట్ర సీజన్‌లో శ్రీశాంత్ చెంప దెబ్బ వివాదం అయితే అతని కెరీర్‌లో ఓ మాయని మచ్చగా మిగిలిపోయింది. అరంగేట్ర సీజన్‌లో ముంబై ఇండియన్స్‌-కింగ్స్ లెవ‌న్ పంజాబ్ జ‌ట్ల మ‌ధ్య జ‌రిగిన మ్యాచ్‌లో హ‌ర్భ‌జ‌న్ సింగ్‌, శ్రీశాంత్ మ‌ధ్య వివాదం నెల‌కొంది. ఈ మ్యాచ్‌లో భ‌జ్జీ ముంబైకీ ఆడ‌గా.. శ్రీశాంత్ పంజాబ్‌కు ప్రాతినిథ్యం వ‌హించాడు. మ్యాచ్ ముగిశాక భ‌జ్జీ.. శ్రీశాంత్‌ను చెంప‌దెబ్బ కొట్టాడు. దీంతో కెమేరాల్లో శ్రీ ఏడుస్తూ క‌న్పించాడు. అప్ప‌ట్లో ఇది సంచ‌ల‌న‌మైంది. దీనిపై ఐపీఎల్ యాజ‌మాన్యం ఆగ్ర‌హం వ్య‌క్తం చేసింది. భ‌జ్జీని మిగ‌తా టోర్నీ మొత్తానికి బ్యాన్ చేసింది. అయితే త‌న ప‌రిస్థితి చేయి దాట‌డంతోనే తాను శ్రీశాంత్‌ను కొట్టాన‌ని భ‌జ్జీ త‌ర్వాత వివరణ ఇచ్చుకున్నాడు. అప్ప‌ట్లో త‌న‌కు విధించిన శిక్ష స‌రైన‌దే అని కూడా అంగీకరించాడు.

 మంకీ గేట్ వివాదం..

మంకీ గేట్ వివాదం..

ఇక ఆస్ట్రేలియా పర్యటనలో చోటు చేసుకున్న మంకీ గేట్ వివాదం కూడా హర్భజన్ కెరీర్‌లో చెప్పుకోదగినదే. అప్పుడు సచిన్ టెండూల్కర్ గనుక భజ్జీకి అండగా నిలవకుంటే ఈ రోజు మనం భజ్జీ గురించే మాట్లాడుకునేవాళ్లం కాదు. 2007-08 ఆస్ట్రేలియా పర్యటనలో ఈ వివాదం చోటు చేసుకుంది. సిడ్నీ వేదికగా జరిగిన రెండో టెస్టులో ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్ ఆండ్రూ సైమండ్స్‌ని భారత ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మంకీ అంటూ జాతివివక్ష వ్యాఖ్యలు చేసినట్లు ఆరోపణలు వచ్చాయి. స్లెడ్జింగ్ తిప్పికొట్టే క్రమంలో కోల్పోయిన హర్భజన్.. మంకీతో తనని పోల్చినట్లు సైమండ్స్‌ ఫిర్యాదు చేశాడు. ఆ తర్వాత క్రమశిక్షణ చర్యల కింద హర్భజన్‌ మ్యాచ్ ఫీజులో కోతతో పాటు నిషేధం కూడా విధించారు. అయితే ఆ నిషేధాన్ని ఎత్తివేయకపోతే టూర్‌ని రద్దు చేసుకుంటామని టీమిండియా పట్టుబట్టడంతో ఆసీస్ దిగొచ్చింది.

 విదేశాల్లో పాంచ్ పటాకా..

విదేశాల్లో పాంచ్ పటాకా..

సెనా(సౌతాఫ్రికా, ఇంగ్లండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా) దేశాల్లో మూడింటిలో హర్భజన్ 5 వికెట్ల ఘనతను అందుకున్నాడు. హర్భజన్ రిథమ్‌లో ఉంటే అతని బంతులు నాగు పాముల్లా దూసుకొస్తాయని బ్యాట్స్‌మన్, వికెట్ కీపర్లు చెప్పడం విశేషం. గ్యారీ కిరిస్టన్ పర్యవేక్షణలో మరింత రాటు దేలిని భజ్జీ.. 2007 టీ20 ప్రపంచకప్ సెమీస్‌లో మైకేల్ క్లార్క్‌ను యార్కర్‌తో ఔట్ చేయడం అతని కెరీర్‌కే హైలైట్. ఇక ఐపీఎల్ విషయానికొస్తే.. ఈ లీగ్‌లో మొత్తంలో 163 మ్యాచ్‌లు ఆడిన హర్భజన్‌.. 150 వికెట్లు తీసి ఐపీఎల్ మోస్ట్ సక్సెస్‌ఫుల్ బౌలర్‌గా నిలిచాడు.

Story first published: Friday, December 24, 2021, 18:32 [IST]
Other articles published on Dec 24, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+