Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

టీమిండియా హెడ్ కోచ్ రేసులో గంభీర్‌కు పోటీగా దిగ్గజ స్పిన్నర్!

టీమిండియా హెడ్ కోచ్ పదవి బాధ్యతలు చేపట్టేందుకు సుముఖంగా ఉన్నట్లు మాజీ క్రికెటర్, దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తెలిపాడు. ఆ అవకాశం లభిస్తే సంతోషంగా స్వీకరిస్తానని చెప్పాడు. టీమిండియా హెడ్ కోచ్ పదవి ద్వారా త‌న‌కు ఎంతో ఇచ్చిన‌ క్రికెట్‌కు, ఎంతో కొంత తిరిగి ఇచ్చే అవ‌కాశం లభింస్తుందన్నాడు.

ఇటీవలే భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) టీమిండియా పురుషుల జట్టు హెడ్ కోచ్ పదవికి దరఖాస్తులు ఆహ్వానించిన విషయం తెలిసిందే.ఆసక్తి కలిగినవారు మే 27, సాయంత్ర 6 గంటల లోపు దరఖాస్తు చేసుకోవాలని బీసీసీఐ తమ ప్రకటనలో పేర్కొంది. ఈ క్రమంలో భజ్జీ టీమిండియా హెడ్ కోచ్ పదవిపై తనకు ఉన్న ఆసక్తిని వెల్లడించడం చర్చనీయాంశమైంది.

Harbhajan Singh has shown his interest in the Indian Head Coach post

హర్భజన్ సింగ్ కూడా టీమిండియా హెడ్ కోచ్ పదవి రేసులో నిలుస్తాడా? అనే చర్చ జరుగుతుంది. ప్ర‌స్తుతం టీమిండియా హెడ్ కోచ్‌గా ఉన్న రాహుల్ ద్రవిడ్ ప‌ద‌వీకాలం 2024 టీ20 ప్రపంచకప్‌తో ముగియనుంది. అంటే జూన్ చివ‌రి నాటికి ద్రావిడ్ కోచ్‌గా వైదొలుగుతారు. అందుకే కొత్త కోచ్ కోసం బీసీసీఐ తాజాగా ద‌ర‌ఖాస్తుల‌ను ఆహ్వానిస్తోంది.

కాగా, కొత్త కోచ్‌ పదవీ కాలం ఈ ఏడాది జులై 1 నుండి ప్రారంభమై 2027 డిసెంబర్ 31తో ముగుస్తుంద‌ని బీసీసీఐ త‌న ప్ర‌క‌ట‌న‌లో పేర్కొంది. అంటే టీమిండియాకు- కొత్త‌గా కోచ్ ప‌ద‌వికి ఎంపిక‌యిన వ్య‌క్తి 2027 వ‌న్డే ప్ర‌పంచ‌క‌ప్ వ‌ర‌కు భార‌త జ‌ట్టుకు ప్ర‌ధాన కోచ్‌గా కొన‌సాగనున్నాడు. ఇప్పటికే ఈ పదవి కోసం గౌతమ్ గంభీర్‌ను బీసీసీఐ అప్రోచ్ అయినట్లు వార్తలు వస్తున్నాయి.

ఈ క్రమంలోనే ఓ వార్త సంస్థకు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. ' టీమిండియా హెడ్ కోచ్ పదవికి నేను దరఖాస్తు చేస్తానో లేదో నాకు తెలియదు. కానీ, టీమిండియాకు కోచింగ్ అనేది మెంటార్‌లాంటిదే. భార‌త ఆట‌గాళ్ల‌కు క్రికెట్ గురించి ప్ర‌త్యేకంగా శిక్ష‌ణ ఇవ్వాల్సిన‌ అవ‌స‌రం లేదు.

Harbhajan Singh has shown his interest in the Indian Head Coach post

క్రికెట్‌ వారికి బాగా తెలుసు. వారికి మెంటార్‌గా ఉంటే సరిపోతుంది. నాకు క్రికెట్ ఎంతో ఇచ్చింది. కోచ్ రూపంలో ఎంతోకొంత తిరిగి ఇచ్చే అవ‌కాశం వ‌స్తే సంతోషంగా స్వీకరిస్తాను'అని భ‌జ్జీ చెప్పుకొచ్చాడు. అయితే తాను దరఖాస్తు చేస్తానా? లేదా? అనే విషయాన్ని మాత్రం వెల్లడించలేదు. అయితే హర్భజన్ సింగ్‌కు కోచ్‌గా పనిచేసిన అనుభవం పెద్దగా లేదు.

టీమిండియా హెడ్‌కోచ్‌ రేసులో గౌతమ్ గంభీర్‌తో పాటు స్టీఫెన్‌ ఫ్లెమింగ్‌, జ‌స్టిన్‌ లాంగర్‌, పాంటింగ్‌, నెహ్రా, జ‌య‌వ‌ర్ద‌నే ఉన్నట్లు తెలుస్తోంది.

Story first published: Tuesday, May 21, 2024, 19:08 [IST]
Other articles published on May 21, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+