Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harbhajan Singh: అతనితో హార్దిక్ పాండ్యాకు ఎసరు తప్పదు!

టీమిండియా ఆల్‌రౌండర్, చెన్నై సూపర్ కింగ్స్ స్టార్ ప్లేయర్ శివమ్ దూబేపై మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాను రిప్లేస్ చేసే సత్తా శివమ్ దూబేకు ఉందని కొనియాడాడు.

అఫ్గానిస్థాన్‌తో జరిగిన తొలి టీ20‌లో శివమ్ దూబే(40 బంతుల్లో 60 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. బౌలింగ్‌లో రెండు ఓవర్లు బౌలింగ్ చేసిన శివమ్ దూబే 9 పరుగులు మాత్రమే ఇచ్చి ఓ వికెట్ పడగొట్టాడు.ఈ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు అందుకున్నాడు.

Harbhajan Singh has found Hardik Pandya’s replacement, Shivam Dube can become pace-all rounder

శివమ్ దూబే ప్రదర్శనపై తన యూట్యూబ్ చానెల్ వేదికగా మాట్లాడిన హర్భజన్ సింగ్.. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. దూబే ఇలానే నిలకడగా రాణిస్తే టీమిండియాలో తన స్థానాన్ని సుస్థిరం చేసుకుంటాడని చెప్పాడు.

'శివమ్ దూబేలో నేను చూసిన మార్పు ఏంటంటే.. అతని బౌలింగ్‌లో పేస్ పేరిగింది. అతని బౌలింగ్ చాలా మెరుగుపరుచుకున్నాడు. ఫిట్‌నెస్‌‌బై కూడా ఫోకస్ పెట్టాడు. అతను ఇలానే రాణిస్తే సుదీర్ఘ కాలం పాటు భారత జట్టులో ఆల్‌రౌండర్‌గా కొనసాగుతాడు. అఫ్గాన్‌తో మిగిలిన రెండు మ్యాచ్‌ల్లోను దూబే రాణిస్తే.. అతన్ని పక్కనపెట్టడం కష్టమవుతుంది.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

Harbhajan Singh has found Hardik Pandya’s replacement, Shivam Dube can become pace-all rounder

తరుచూ ఫిట్‌నెస్ సమస్యలు ఎదుర్కొంటున్న హార్దిక్ పాండ్యాకు ప్రత్యామ్నాయంగా శివమ్ దూబేను రెడీ చేసుకోవాలని మాజీ క్రికెటర్లు కూడా సూచిస్తున్నారు. ఇప్పటికే గౌతమ్ గంభీర్ అనేకసార్లు శివమ్ దూబే గురించి మాట్లాడాడు. వన్డే ప్రపంచకప్‌లోనూ హార్దిక్ పాండ్యా గాయంతో మధ్యలోనే తప్పుకున్నాడు.

అప్పుడు హార్దిక్ పాండ్యాను భర్తీ చేసే ఆటగాడు జట్టులో లేడు. ఈ క్రమంలోనే శివమ్ దూబేను సిద్దం చేసుకోవాలని, అతని ఆట చాలా మెరుగైందని మాజీ క్రికెటర్లు సూచిస్తున్నారు.

Story first published: Saturday, January 13, 2024, 14:06 [IST]
Other articles published on Jan 13, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+