ఖాళీ కుండకు సౌండ్ ఎక్కువ.. శ్రీశాంత్ సవాల్‌కు భజ్జీ కౌంటర్!(వీడియో)
టీమిండియా మాజీ పేసర్ శ్రీశాంత్ విసిరిన సవాల్‌కు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ తనదైన శైలిలో స్పందించాడు. ఖాళీ కుండుకు సౌండ్ ఎక్కువ అనే సామెతను ఉపయోగిస్తూ అదిరిపోయే కౌంటరిచ్చాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత వివాదాస్పదమైన చెంపదెబ్బ ఉదంతానికి ఈ ఇద్దరూ కారణమనే విషయం తెలిసిందే. 18 ఏళ్ల క్రితం మైదానంలోనే ఈ ఇద్దరూ గొడవపడ్డారు. తన కంటే జూనియర్ అయిన శ్రీశాంత్‌పై హర్భజన్ సింగ్ చేయి చేసుకోవడం అప్పట్లో తీవ్ర చర్చనీయాంశమైంది.
ఆ తర్వాత ఈ ఘటనను మరిచిపోయిన ఈ ఇద్దరూ సన్నిహితంగా మెలిగారు. కలిసి ఇంటర్వ్యూల్లో కూడా పాల్గొన్నారు. కానీ ఈ చెంపదెబ్బ ఘటనను గుర్తు చేసేలా హర్భజన్ సింగ్ ఇటీవల ఒక యాడ్‌లో నటించడం తీవ్ర వివాదాస్పదమైంది. పాత గాయాలు మర్పిపోయారని భావిస్తున్న తరుణంలో భజ్జీ చేసిన ఈ యాడ్ శ్రీశాంత్‌కు తీవ్ర ఆగ్రహం తెప్పించింది.

తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న శ్రీశాంత్.. దమ్ముంటే ఇప్పుడురా.. బాక్సింగ్ రింగ్‌లో చూసుకుందాం అంటూ హర్భజన్ సింగ్‌కు సవాల్ విసిరాడు. 'భజ్జీ.. నేను మీకు సవాలు విసురుతున్నాను. నిజాయతీగా నాతో బాక్సింగ్ రింగ్‌లోకి రా.. సంతకం చేసి బరిలోకి దిగే దమ్ము నీకు ఉందా? . నేను బేర్ నకిల్ ఫైట్ లీగ్‌లో భాగస్వామిని. మలయాళీలు, సర్దార్ల ఆత్మగౌరవం కోసం ఈ సవాల్‌ను స్వీకరించు. నేను రింగ్‌లో నీ కోసం వేచి చూస్తుంటా' అంటూ శ్రీశాంత్ తీవ్ర వ్యాఖ్యలు చేశాడు.
అయితే ఈ సవాల్‌కు హర్భజన్ సింగ్ తనదైన శైలిలో కౌంటరిచ్చాడు. ఇన్‌స్టాగ్రామ్ వేదికగా ఓ వీడియోను షేర్ చేసిన హర్భజన్ సింగ్.. 'ఎవరో చాలా చక్కగా చెప్పారు... వాగేవాళ్ళను వాగనివ్వండి.. ఎందుకంటే ఎప్పుడూ ఖాళీ కుండలే ఎక్కువ శబ్దం చేస్తాయి'అనే సామెతను హిందీలో చెప్పారు. దాంతో ఈ వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. అయితే ఈ వీడియోలో హర్భజన్ సింగ్.. శ్రీశాంత్ పేరును ప్రస్తావించకపోయినప్పటికీ అతన్ని ఉద్దేశించే ఈ వీడియో పంచుకున్నట్లు తెలుస్తోంది. హర్భజన్ సింగ్ వీడియోపై శ్రీశాంత్ ఎలా రియాక్ట్ అవుతాడో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications

