For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

RCB vs SRH Dream11: డ్రీమ్11 టీమ్.. కెప్టెన్, వైస్ కెప్టెన్ టిప్స్! హెడ్ టు హెడ్ రికార్డ్స్, తుది జట్లు ఇవే!!

RCB vs SRH Dream11 Prediction: Fantasy Cricket Tips, Dream11 Team and Playing XI for match 52

హైదరాబాద్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్‌) 2021 తుది దశకు చేరుకుంది. ఇప్పటికివరకు జరిగిన మ్యాచ్‌ల్లో కొన్ని నిస్సారంగా సాగగా.. ఎక్కువ మ్యాచ్‌లు మాత్రం హోరాహోరీగా జరిగాయి. నాలుగు బెర్తుల ప్లే ఆఫ్స్‌ రేసులో ఇప్పటికే మూడు జట్లు ఖరారయ్యాయి. ఇక మిగిలింది ఒకే ఒక్క స్థానం. ఈ రెండు రోజులో ఆ చివరి బెర్త్ దక్కించుకునేది ఎవరో తేలనుంది. అయితే ఈరోజు జరిగే మ్యాచ్ మాత్రం కాస్త విచిత్రంగా ఉంటుంది. ఎందుకంటే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్‌సీబీ) ఇప్పటికే ప్లే ఆఫ్స్‌ బెర్త్ దక్కించుకోగా.. సన్‌రైజర్స్ హైదరాబాద్ (ఎస్‌ఆర్‌హెచ్) రేసు నుంచి ఇప్పటికే నిష్క్రమించింది. అబుదాబిలో మ్యాచ్ జరగనుంది.

హెడ్ టు హెడ్ రికార్డ్స్

హెడ్ టు హెడ్ రికార్డ్స్

ఈ మ్యాచులో విజయం సాధిస్తే రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు 18 పాయింట్లు సంపాదించవచ్చు. అయితే విజయం సాధించినంత మాత్రాన ఆర్‌సీబీ నంబర్ 3 స్థానంలో ఎటువంటి మార్పు ఉండదు. మరోవైపు సన్ రైజర్స్ హైదరాబాద్ వారి ఆత్మగౌరవం కోసం గెలవాలని కోరుకుంటుంది. ఒకవేళ గెలిస్తే పట్టికలో ఎస్‌ఆర్‌హెచ్ పాయింట్ల సంఖ్య 4 నుంచి 6కి చేరుతుంది. ఐపీఎల్ 2021లో ఈ రెండు జట్లు పోటీ పడటం ఇది రెండో సారి.. గతంలో బెంగళూరు విజయం సాధించింది. అబుదాబిలో కూడా రెండు జట్లు ఈ రోజు రెండోసారి తలపడుతున్నాయి.

మొత్తంగా ఐపీఎల్‌లో ఇరు జట్లు 19 సార్లు తలపడ్డాయి. ఇందులో సన్‌రైజర్స్ 10 మ్యాచ్‌లు గెలవగా, ఆర్‌సీబీ 8 సార్లు గెలిచింది. ఈరోజు ఆర్‌సీబీఒక విజయాన్ని నమోదు చేసుకుంటే.. అది ఐపీఎల్ టోర్నీలో వారి 100వ విజయం అవుతుంది.

పిచ్ రిపోర్ట్

పిచ్ రిపోర్ట్

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ 52వ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు మొదలు కానుంనుండగా.. టాస్ 7 గంటలకు పడనుంది. ఈ మ్యాచ్ స్టార్ స్పోర్ట్స్ నెట్‌వర్క్‌లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఓటీటీలో కూడా ఈ మ్యాచ్‌ను చూడాలనుకునే ఫాన్స్ హాట్‌స్టార్‌లో వీక్షించవచ్చు. అబుదాబిలో ఉష్ణోగ్రత 33 డిగ్రీల సెల్సియస్ ఉండనుంది. మ్యాచ్ సమయంలో వర్షం పడే అవకాశం లేదు. ఈ పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమైంది. ఇక్కడ మరోసారి బ్యాటర్‌లు చెలరేగే అవకాశం ఉంది. మిడిల్ ఓవర్లలో స్పిన్నర్లకు సహకరించనుంది. అయితే మ్యాచ్ చివరి భాగంలో పేసర్లు పట్టుసాధించవచ్చు.

మ్యాక్సీ, ఏబీలు కూడా రాణిస్తే

మ్యాక్సీ, ఏబీలు కూడా రాణిస్తే

బెంగళూరు ఓపెనర్లు దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీలు పరుగులు చేస్తున్నారు. ఇది జట్టుకు కలిసొచ్చే అంశం. అయితే స్టార్ ఆటగాళ్లు ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్ మాత్రం విఫలమవుతున్నారు. రెండో దశలో ఈ ఇద్దరు ఒక్క భారీ ఇన్నింగ్స్ కూడా ఆడలేదు. ఈ ఇద్దరు చెలరేగితే బెంగళూరు భారీ స్కోర్ చేసే అవకాశం ఉంది.

తొలి దశలో ఈ ఇద్దరు బెంగళూరు విజయాల్లో కీలక పాత్ర పోషించిన విషయం తెలిసిందే. వీరితో పాటు శ్రీకర్ భారత్ కూడా బ్యాట్ జులిపించాల్సి ఉంది. షాబాజ్ అహ్మద్, డాన్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్ కూడా అంచనాలను అందుకోలేకపోతున్నారు. ఇక హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్ రాణిస్తుండడం శుభపరిణామం.

ఇప్పటికైనా ఎస్‌ఆర్‌హెచ్ పుంజుకునేనా

ఇప్పటికైనా ఎస్‌ఆర్‌హెచ్ పుంజుకునేనా

వరుస వైఫల్యాలతో సతమతమవుతున్న సన్‌రైజర్స్‌ హైదరాబాద్ టీమ్ ఎంపిక ఎప్పుడూ ఆలోచించదగ్గదే. తుది జట్టులో ఎప్పుడూ మార్పులు చేస్తుంటుంది. ఎవరు జట్టులో ఉంటారో తెలియదు. ఓపెనర్ డేవిడ్ వార్నర్‌ స్థానంలో ఆడుతున్న జాసన్ రాయ్ పర్వాలేదనిపిస్తున్నాడు. తనకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకుంటున్నాడు. మరోసారి ఎస్‌ఆర్‌హెచ్ మేనేజ్మెంట్ అతడి నుంచి భారీ ఇన్నింగ్స్ కోరుకుంటోంది.

పరుగులు చేయడంలో విఫలమవుతున్న మరో ఓపెనర్ వృద్ధిమాన్ సాహా కూడా చెలరేగాల్సిన అవసరం ఉంది. మనీష్ పాండే స్థానంలో ఆడిన అభిషేక్ శర్మ మెరుపులు ఒక ఇన్నింగ్స్‌కే పరిమితం అయ్యాయి. అబ్దుల్ సమద్, ప్రియం గార్గ్ సత్తాచాటాల్సిన అవసరం ఉంది. జాసన్ హోల్డర్, సందీప్ శర్మ, భువనేశ్వర్ కుమార్, సిద్ధార్థ్ కౌల్, ఉమ్రాన్ మాలిక్ రాణిస్తేనే విజయావకాశాలు ఉంటాయి. హార్డ్ హిట్టర్ షెర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు. అతడికి ఈరోజు అవకాశం ఇస్తారేమో చూడాలి. ఇక మహ్మద్ నబీ, బాసిల్ థంపి, విరాట్ సింగ్, శ్రీవత్ గోస్వామి కూడా ఐపీఎల్ 2021 రెండో దశలో ఇప్పటివరకు ఒక్క మ్యాచ్ కూడా ఆడలేదు.

తుది జట్టు (అంచనా)

తుది జట్టు (అంచనా)

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు: దేవదత్ పడిక్కల్, విరాట్ కోహ్లీ (కెప్టెన్), శ్రీకర్ భారత్ (వికెట్ కీపర్), ఏబీ డివిలియర్స్, గ్లెన్ మాక్స్‌వెల్, షాబాజ్ అహ్మద్, డాన్ క్రిస్టియన్, జార్జ్ గార్టన్, హర్షల్ పటేల్, మహ్మద్ సిరాజ్, యుజ్వేంద్ర చహల్.

సన్‌రైజర్స్‌ హైదరాబాద్: జాసన్ రాయ్, వృద్ధిమాన్ సాహా (వికెట్ కీపర్), కేన్ విలియమ్సన్ (కెప్టెన్), ప్రియం గార్గ్, అభిషేక్ శర్మ, అబ్దుల్ సమద్, జేసన్ హోల్డర్, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, ఉమ్రాన్ మాలిక్/ సందీప్ శర్మ, సిద్దార్థ్ కౌల్.

డ్రీమ్ 11 టీమ్

డ్రీమ్ 11 టీమ్

దేవదత్ పడిక్కల్ (కెప్టెన్), విరాట్ కోహ్లీ, వృద్ధిమాన్ సాహా, శ్రీకర్ భరత్ (కీపర్), గ్లెన్ మాక్స్‌వెల్, అబ్దుల్ సమద్, జాసన్ హోల్డర్ (వైస్ కెప్టెన్), అభిషేక్ శర్మ, యుజ్వేంద్ర చహల్, హర్షల్ పటేల్, రషీద్ ఖాన్.

Story first published: Wednesday, October 6, 2021, 22:57 [IST]
Other articles published on Oct 6, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+