Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హర్భజన్ సింగ్ మాములోడు కాదు.. ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు తరలించుకుపోయాడు!

ఐపీఎల్ 2025 ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌ల వేదికలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) ప్రకటించింది. న్యూ చండీగఢ్‌లోని ముల్లన్‌పూర్ వేదికగా జరిగిన క్వాలిఫయర్-1, ఎలిమినేటర్ మ్యాచ్‌లు జరుగుతాయని పేర్కొంది. వాస్తవానికి ముందస్తు షెడ్యూల్ ప్రకారం హైదరాబాద్, కోల్‌కతా వేదికగా ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లు జరగాల్సింది. కానీ భారత్-పాక్ మధ్య నెలకొన్న ఉద్రిక్తతల కారణంగా ఐపీఎల్ 2025 సీజన్‌ వారం పాటు వాయిదా పడటంతో రివైజ్డ్ షెడ్యూల్‌ను ప్రకటించాల్సి వచ్చింది. అయితే హైదరాబాద్, కోల్‌కతా వేదికగా వర్ష ప్రభావం ఉండటంతో ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్, అహ్మదాబాద్‌లకు బీసీసీఐ తరలించింది.

అయితే ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లు ముల్లాన్‌పూర్‌కు కేటాయించడం వెనుక మాజీ క్రికెటర్, ఆ రాష్ట్ర ప్లేయర్ హర్భజన్ సింగ్ కీలక పాత్ర పోషించినట్లు జాతీయ మీడియాలో వార్తలు వస్తున్నాయి. ముల్లాన్‌పూర్ వేదికగా ఒక్క ఐపీఎల్ మ్యాచ్‌ జరగలేదు. అయినా ఆ వేదికను బీసీసీఐ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లకు కేటాయించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. హర్భజన్ సింగ్ ప్రస్తుతం పంజాబ్ క్రికెట్ అసోసియేషన్ సలహాదారుడిగా ఉన్నాడు. అంతేకాకుండా ఐపీఎల్ మ్యాచ్‌ల వేదికలను ఖరారు చేసే అధ్యయన కమిటీలో మెంబర్‌గా ఉన్నాడు.

Harbhajan Singh Convinced BCCI To Host IPL Playoffs In Punjab Reoprt

ఈ క్రమంలోనే ముల్లాన్‌పూర్ మైదానం గురించి స్టడీ చేసిన హర్భజన్ సింగ్.. ఆ నివేదికను బీసీసీఐకి అందజేశాడు. దాంతోనే బీసీసీఐ.. ఐపీఎల్ ప్లే ఆఫ్స్ మ్యాచ్‌లను ముల్లాన్‌పూర్‌కు కేటాయించింది. దాంతో అక్కడి అభిమానులు హర్భజన్ సింగ్‌పై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. చాలా రోజులుగా పంజాబ్, చండీగఢ్‌లో అంతర్జాతీయ మ్యాచ్‌లు జరగడం లేదు. ఈ విషయాన్ని హర్భజ్ సింగ్ అప్పుడప్పుడు ప్రస్తావిస్తూ తన నిరసనను తెలియజేసేవాడు. మరోవైపు గంగూలీ.. కోల్‌కతా నుంచి ఫైనల్‌ను తరలించకుండా అన్ని రకాల ప్రయత్నాలు చేశాడు. కానీ అతని విన్నపాన్ని బీసీసీఐ పట్టించుకోలేదు.

Story first published: Wednesday, May 21, 2025, 16:20 [IST]
Other articles published on May 21, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+