Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Harbhajan Singh: పాకిస్థాన్ క్రికెటర్ల ఫిక్సింగ్ గురించి తెలుసు గానీ.. ఈ బేఖార్ ముచ్చట్లు ఆపండి!

Harbhajan Singh blasts Pakistan fans

న్యూఢిల్లీ: టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా ఫిక్సింగ్‌కు పాల్పిందంటూ పాకిస్థాన్ అభిమానులు చేస్తున్న ఆరోపణలపై వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. భారత్ విజయాన్ని పాక్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారని మండిపడ్డాడు. పాకిస్థాన్ క్రికెటర్ల ఫిక్సింగ్ గురించి అందరికి తెలిసిందేనని, ఈ బేఖార్ ముచ్చట్లు ఆపాలని చురకలంటించాడు. పాకిస్థాన్, న్యూజిలాండ్ చేతిలో చిత్తుగా ఓడి తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న టీమిండియా.. చిన్న దేశాలైన అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు నమోదు చేసి సెమీస్ రేసులోకి వచ్చింది. దాంతో భారత్ విజయం కోసం ఫిక్సింగ్ చేసిందని, అఫ్గాన్ టీమ్‌ను కొనేసిందని పాక్ అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆరోపణలు చేశారు.

చెత్త వాగుడు ఆపండి..

చెత్త వాగుడు ఆపండి..

ఈ కామెంట్స్‌పై తన యూట్యూబ్ చానెల్ వేదికగా స్పందించిన హర్భజన్ సింగ్.. పాక్ అభిమానుల తీరును తప్పుబట్టాటు. ఈ చెత్త వాగుడు ఆపాలని హితవు పలికాడు. "పాకిస్థాన్​ మంచి క్రికెట్​ ఆడిందని అంగీకరించాం. టీమిండియాపై మెరుగ్గా ఆడి గెలిచినందుకు కూడా అభినందించాం. కానీ మీ విజయాలు న్యాయబద్దమైనవి, మేం గెలిచినప్పుడు మాత్రం అనుమానాలు వ్యక్తం చేస్తూ

'అక్రమంగా గెలిచారు.. ఫిక్సింగ్​కు పాల్పడ్డారు' అని అనడం సరైంది కాదు. మీ క్రికెటర్ల ఫిక్సింగ్, ఖ్యాతి గురించి మా అందరికీ తెలిసిందే.

హీనమైన చర్య..

హీనమైన చర్య..

"టీమిండియాపై తమ జట్టు సాధించిన విజయాన్ని పాకిస్థాన్​ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు. ప్రపంచకప్​లలో ఎన్నో ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ఈ విజయం దక్కడంతో వాళ్లు నమ్మలేకపోతున్నారు. అయితే మాట్లాడటానికి, ప్రశ్నలు లేవనెత్తడానికి ఓ పద్ధతి ఉంటుంది. మాపై, రషీద్ ఖాన్​పై తీవ్రమైన ఆరోపణలు చేయడం చాలా హీనమైన, అవమానకరమైన చర్య." అని హర్భజన్ మండిపడ్డాడు. ఇక ఐపీఎల్​ కాంట్రాక్టుల కోసం అఫ్గాన్​ ఆటగాళ్లు కోహ్లీసేన గెలిచేందుకు సహాయం చేశారని పాక్ అభిమానులు ఆరోపించడాన్ని కూడా భజ్జీ తప్పుబట్టాడు. ఇలాంటి ఆరోపణలతో సమయం వృథా చేసుకోకుండా, పాక్ విజయాలను ఆస్వాదించాలని సూచించాడు.

అంతా అఫ్గాన్ దయ..

అంతా అఫ్గాన్ దయ..

అఫ్గానిస్థాన్, స్కాట్లాండ్‌పై భారీ విజయాలు సాధించిన టీమిండియా మెరుగైన రన్‌రేట్‌తో పాయింట్స్‌ టేబుల్లో మూడో స్థానంలో నిలించింది. దాంతో సెమీ ఫైనల్ రేసు రసవత్తరంగా మారింది. ఆదివారం అఫ్గాన్‌ - న్యూజిలాండ్‌ మ్యాచ్‌ ఫలితంపైనే టీమిండియా భవితవ్యం ఆధారపడి ఉంది. ఈ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌ గెలిస్తే ఇప్పటికే ఆరు పాయింట్లతో ఉన్న విలియమ్సన్‌ సేన నేరుగా సెమీస్‌ చేరుతుంది. అదే అఫ్గాన్‌ గెలిస్తే.. 6 పాయింట్లతో ఉండటం వల్ల రన్‌రేట్‌ విషయంలో పోటీపడాల్సి ఉంటుంది. అప్పుడు కోహ్లీసేన చివరి మ్యాచ్‌లో నమీబియాను చిత్తుగా ఓడించి మెరుగైన రన్‌రేట్ సాధిస్తే సెమీస్ చేరుతుంది.

అక్తర్ సైతం..

అక్తర్ సైతం..

అఫ్గానిస్థాన్‌తో జరిగే కీలక లీగ్ మ్యాచ్‌లో న్యూజిలాండ్ ఓడిపోతే సోషల్ మీడియా వేదికగా తీవ్ర దుమారం రేగుతుందని పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ అన్నాడు. మ్యాచ్ ఫిక్సింగ్ జరిగిందంటూ పాక్ అభిమానులు ఆరోపణలు గుప్పించే అవకాశం ఉందన్నాడు. 'ప్రస్తుతం భారత్ భవితవ్యం న్యూజిలాండ్‌ చేతిలో ఉంది. ఒక వేళ న్యూజిలాండ్ ఓడితే చాలా ప్రశ్నలు వ్యక్తమవుతాయి. నేను వివాదాలు సృష్టించాలని ఇలా చెప్పడం లేదు. న్యూజిలాండ్ జట్టును హెచ్చరిస్తున్నా.. తదనంతర పరిణామాలను ఊహించి భయపడుతున్నా. సోషల్ మీడియాలో ఈ ఫలితమే ట్రెండింగ్ టాపిక్ అవుతుంది. న్యూజిలాండ్ విషయంలో పాక్ అభిమానుల సెంటిమెంట్స్ హైగా ఉన్నాయి. నా వరకైతే అఫ్గాన్ కంటే న్యూజిలాండే బలంగా కనిపిస్తుంది. కానీ ఆ జట్టుపై దేవుడు కన్నెర్ర చేస్తే మాత్రం ఆ జట్టు చెత్తగా ఆడి ఓడిపోవచ్చు. అప్పుడు పెద్ద సమస్య అవుతుంది. సోషల్ మీడియాను ఎవరూ కూడా ఆపలేరు.'అని అక్తర్ చెప్పుకొచ్చాడు.

Story first published: Saturday, November 6, 2021, 21:15 [IST]
Other articles published on Nov 6, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+