Harbhajan Singh: వారి జోక్యం వల్లే జట్టుకు దూరమయ్యా.. లేకుంటే మరో 150 వికెట్లు..

న్యూఢిల్లీ: భారత నియంత్రణ మండలి(బీసీసీఐ)లోని కొందరి జోక్యం వల్లే తాను టీమిండియాకు దూరం కావాల్సి వచ్చిందని మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అన్నాడు. తనను హఠాత్తుగా జట్టు నుంచి తప్పించి ఉండకపోతే టెస్టుల్లో తాను మరో 100-150 వికెట్లు పడగొట్టేవాడినని తెలిపాడు. ఇటీవలే భజ్జీ అంతర్జాతీయ క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. తాజాగా ఓ జాతీయ చానెల్‌తో తన కెరీర్ గురించిన మాట్లాడిన భజ్జీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. భారత జట్టులో ఇతర ఆటగాళ్ల కంటే మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకే ఎక్కువ మద్దతు లభించిందన్నాడు. అయితే తనను జట్టు నుంచి తీసేయడానికి ధోనీ ఒక్కడే కారణం కాదన్నాడు.

మరో 150 వికెట్లు తీసేవాడిని..
'అదృష్టం ఎప్పుడు నా పక్షానే ఉంది. కొన్ని ఇతర అంశాలు నావైపు లేవు. అవి నాకు పూర్తి వ్యతిరేకంగా ఉన్నాయి. నేను బౌలింగ్ చేస్తున్న తీరు, పురోగమిస్తున్న తీరే అందుకు కారణం. నేను 400 వికెట్లు తీసినప్పుడు నా వయసు 31 ఏళ్లు. మరో 4-5 ఏళ్లు ఆడగలిగితే మరో 100-150 వికెట్లు పడగొట్టగలిగేవాణ్ని. బోర్డు నుంచి ఇతర ఆటగాళ్లకంటే మాజీ కెప్టెన్ ధోనీకి ఎక్కువ మద్దతు లభించింది. అప్పుడు ధోనీనే కెప్టెన్. కానీ నా ఎంపిక అతడి చేతుల్లోనూ లేదు.

బీసీసీఐ పెద్దలకు..
కొందరు బీసీసీఐ అధికారులు కొంతవరకు ఇందులో జోక్యం చేసుకున్నారు. నేను జట్టులో ఉండడం వాళ్లకు ఇష్టం లేదు. ధోనీ వాళ్లకు మద్దతిచ్చి ఉంటాడు. అంతే కానీ.. కెప్టెన్ ఎప్పుడూ బీసీసీఐ కంటే ఎక్కువ కాదు. ఎప్పుడైనా బీసీసీఐ అధికారులే కెప్టెన్ కన్నా కోచ్ లేదా జట్టు కన్నా ఎక్కువ. బీసీసీఐ నుంచి ఇతర ఆటగాళ్ల కన్నా ధోనీకి ఎక్కువ మద్దతు లభించింది. అలా మద్దతు లభించి ఉంటే వాళ్లు కూడా ఎక్కువ కాలం ఆడేవాళ్లు'' అని హర్భజన్ చెప్పాడు. తన జీవితంపై బయోపిక్ తీయాలని అనుకుంటున్నట్లు భజ్జీ తెలిపాడు. భారత్ తరుపున ఆడే రోజుల్లో తను ఎలా ఉన్నానో ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని అతడు అభిప్రాయపడ్డాడు.

నా గురించి ప్రజలకు తెలియాలనే..
'నేను నా జీవితంపై ఒక సినిమా లేదా వెబ్ సిరీస్‌ని రూపొందించాలనుకుంటున్నాను. తద్వారా ఈ కథలో నేను ఎలాంటి వ్యక్తిని,భారత తరపున ఎలా రాణించానో అనే విషయాలను కూడా ప్రజలు తెలుసుకుంటారు" అని జీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు. కాగా గత ఏడాది డిసెంబర్‌లో హర్భజన్ అంతర్జాతీయ క్రికెట్‌కు విడ్కోలు పలికాడు. భారత తరుపున 103 టెస్టులు, 236 వన్డేలు, 28 టీ20లు భజ్జీ ఆడాడు. అదే విధంగా ఐపీఎల్‌లో ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్, కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున 163 మ్యాచ్‌లు ఆడాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications