నో డౌట్.. టీమిండియా తదుపరి కెప్టెన్ అతనే: హర్భజన్ సింగ్

న్యూఢిల్లీ: టీమిండియా స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యాపై దిగ్గజ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ప్రశంసల జల్లు కురిపించాడు. టీమిండియా తదుపరి కెప్టెన్ హార్దిక్ పాండ్యానేనని, ఈ విషయంలో ఎలాంటి సందేహం లేదని అభిప్రాయపడ్డాడు.
ఆసియా కప్‌లో భాగంగా దాయాది పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో ఆల్‌రౌండ్ ప్రదర్శన చేసి జట్టుకు అద్భుత విజయాన్ని అందించిన హార్దిక్ పాండ్యాపై సర్వత్రా ప్రశంసల జల్లు కురుస్తున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ఓ మీడియా చానెల్‌తో మాట్లాడిన హర్భజన్ సింగ్.. పాండ్యా బ్యాటింగ్ మరో స్థాయిలో ఉంటుందని, గాయాల తర్వాత ఎంతోగానో శ్రమించి తిరిగి ఫామ్‌లోకి వచ్చాడని కొనియాడాడు.

నో డౌట్ తదుపరి కెప్టెన్..
టీమిండియాకు విజయం సాధించి తీరుతానన్న భరోసాతో కనబడుతున్నాడని, అతను భారత జట్టు కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టడం త్వరలోనే చూస్తామని భజ్జీ ప్రశంసించాడు. ఇటీవల టీ20 మెగా టోర్నీలో, పాకిస్థాన్ మ్యాచ్‌లోనూ అతను ఆట అద్భుతంగా ఉందన్నాడు. టీమిండియా కెప్టెన్ అయ్యేందుకు అన్ని సామర్థ్యాలు అతనిలో ఉన్నాయన్నాడు.
'ఇప్పుడు పాండ్యాలో మరో కోణాన్ని మనం చూస్తున్నాం. ధోనీలా మారుతున్నాడు. చాలా కూల్‌గా, స్థిరంగా కనిపిస్తున్నాడు. బ్యాటింగ్ కూడా బాగుంది. మన సామర్థ్యంపై మనకు విశ్వాసం ఉన్నప్పుడే ఇలా మారగలం. అతను కెప్టెన్ కావాలి. తప్పకుండా అయి తీరుతాడు'' అని భజ్జీ విశ్వాసం వ్యక్తం చేశాడు.

మంచి నిర్ణయం..
రిషభ్ పంత్‌ను కాదని దినేశ్ కార్తీక్‌ను ఆడించడాన్ని హర్భజన్ సింగ్ సమర్థించాడు. ఈ నిర్ణయంపై సర్వత్రా విమర్శలు రాగా.. భజ్జీ ఒక్కడే ద్రవిడ్ అండ్ కో తీసుకున్న ఈ నిర్ణయాన్ని ట్విటర్ వేదికగా సమర్థించాడు. దినేశ్ కార్తీక్‌ను తీసుకోవడానికి గల కారణం ఏంటో కూడా చెప్పాడు. 'దినేశ్ కార్తీక్, హార్దిక్ పాండ్యా ఇద్దరూ డౌన్‌ది ఆర్డర్‌లో బ్యాటింగ్ చేస్తారు. ఈ జోడీని ఎదుర్కోవడం ప్రత్యర్థి బౌలర్లకు కత్తి మీద సామే.'అంటూ భజ్జీ టీమ్‌మేనేజ్‌మెంట్ నిర్ణయాన్ని కొనియాడాడు.

ధోనీని గుర్తు చేస్తూ..
గత ఆదివారం పాక్‌తో జరిగిన మ్యాచ్‌లో హార్దిక్ ఆల్‌రౌండ్ ప్రదర్శనతో చెలరేగి హీరో అయ్యాడు. తొలుత బౌలింగ్‌లో 25 పరుగులిచ్చి మూడు వికెట్లు తీసిన పాండ్యా.. ఆ తర్వాత బ్యాటింగ్‌లోనూ సత్తా చాటాడు. మ్యాచ్‌లో తీవ్ర ఉత్కంఠ ఉన్నప్పటికీ విన్నింగ్ సిక్స్‌తో భారత్‌కు అద్భుత విజయాన్ని అందించాడు. 2011 ప్రపంచకప్ ఫైనల్‌లో ధోనీ సిక్స్ నాటి రోజుల్ని గుర్తుచేశాడు. ఈ క్రమంలోనే అతని పేరు మారు మోగుతోంది.

హంకాంగ్‌తో పోరు..
టోర్నీలో అత్యంత బలహీన జట్టు, క్వాలిఫయర్స్ ద్వారా ఆసియా కప్‌నకు అర్హత సాధించిన హాంకాంగ్‌ను రోహిత్ సేన ఢీకొనబోతోంది. గ్రూప్-ఎలో భారత్, పాక్ కాకుండా ఉన్న మూడో జట్టు హాంకాంగే. తీవ్ర ఒత్తిడితో కూడిన పాక్ పోరు తర్వాత.. భారత్ ఈ మ్యాచ్‌ను ప్రశాంతంగా ఆడుకోవడానికి అవకాశముంది. ఒక రకంగా సూపర్-4 దశకు ముందు దీన్ని టీమ్‌ఇండియాకు ప్రాక్టీస్ మ్యాచ్‌లా భావించవచ్చు. హాంకాంగ్ స్థాయికి ఈ మ్యాచ్‌లో కాస్త పోటీ ఇచ్చినా గొప్ప విషయమే. ఆ జట్టులో ఎక్కువగా భారత్, పాకిస్థాన్ సంతతికి చెందిన ఆటగాళ్లున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications