Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అందుకే గౌతమ్ గంభీర్ ఎవరికీ నచ్చడం లేదు: హర్భజన్ సింగ్

టీమిండియా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్‌కు మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్ అండగా నిలిచాడు. టీమిండియా వైఫల్యానికి గంభీర్‌ను బాధ్యుడిని చేస్తూ అతనిపై విమర్శలు గుప్పించడం సరికాదని అభిప్రాయపడ్డాడు. గంభీర్ ముక్కుసూటిగా ఉండే మనిషని, అందుకే అతన్ని నిర్ణయాలు నచ్చడం లేదని హర్భజన్ సింగ్ పేర్కొన్నాడు. గంభీర్ కోచింగ్‌లో భారత జట్టు ఐసీసీ టోర్నీలు గెలిచిందని గుర్తు చేశాడు.

ఇంటి స్థలం కోసం అర్ధరాత్రి రిషభ్ పంత్ పోస్ట్.. స్పందించిన సీఎం!

ఇంటి స్థలం కోసం అర్ధరాత్రి రిషభ్ పంత్ పోస్ట్.. స్పందించిన సీఎం!

శ్రీలంకతో రెండు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా సిద్దమైంది. శనివారం నుంచి గాలే వేదికగా తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. డబ్ల్యూటీసీ ఫైనల్ బెర్త్ ఆశలు సజీవంగా ఉండాలంటే ఈ సిరీస్‌ను క్లీన్ స్వీప్ చేయడం టీమిండియాకు కీలకం. అయితే గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత టెస్ట్‌ల్లో టీమిండియా ఘోర పరాజయాలను చవిచూసింది. ఈ క్రమంలోనే అతని కోచింగ్ తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.

Harbhajan Singh Backs Gautam Gambhir Says Many People Can t Digest the Truth ahead of Sri Lanka Tests

గంభీర్ ముక్కుసూటి మనిషి..

శ్రీలంకతో సిరీస్‌కు ముందు మాట్లాడిన హర్భజన్ సింగ్.. గంభీర్‌ను వెనకేసుకొచ్చాడు. 'గౌతమ్ గంభీర్ ఎందుకు ఇంతలా ఎందుకు విమర్శలు ఎదుర్కొంటున్నాడు? జట్టు బాగా ఆడకపోతే అతన్ని నిదించడం ఏంటో ఇప్పటికీ అర్థం కావడం లేదు. గంభీర్ క్రికెట్ ఆడుతున్నప్పటి నుంచి నాకు తెలుసు. ఆట పట్ల చాలా నిబద్ధత కలిగిన వ్యక్తి. కెరీర్ ఆరంభంలో గంభీర్ చాలా తక్కువగా మాట్లాడేవాడు.

సెహ్వాగ్, అమిత్ మిశ్రా, మునాఫ్ పటేల్ అతనికి మంచి ఫ్రెండ్స్. ఇప్పటికీ వారే స్నేహితులనుకుంటా. అతను ముక్కుసూటి మనిషి. వాస్తవాలను నిక్కచ్చిగా మాట్లాడుతాడు. అందుకే అతని నిర్ణయాలు కొందరికి నచ్చవు. కవర్ చూసి పుస్తకం ఎలాంటిదో చెప్పకూడదని పెద్దలు అంటారు. గంభీర్‌ను విమర్శించడం కూడా తప్పే. గెలుపు కోసమే ఆడాలని నమ్మే కోచ్ అతను. ఓటమిని ఏ మాత్రం జీర్ణించుకోడు. డ్రా కోసం ఆడేందుకు అస్సలు ఇష్టపడడు.

ఆ ఆర్టికల్ నా జీవితాన్ని మార్చేసింది.. అతనికి నేను డై హార్డ్ ఫ్యాన్: రవిచంద్రన్ అశ్విన్

Also Read

ఆ ఆర్టికల్ నా జీవితాన్ని మార్చేసింది.. అతనికి నేను డై హార్డ్ ఫ్యాన్: రవిచంద్రన్ అశ్విన్

కోహ్లీ, రోహిత్ శర్మ ఆడితే తప్పేంటి..?

శుభ్‌మన్ గిల్ క్రికెట్ బ్రెయిన్ గొప్పది. అతను గొప్ప ఆటగాడు. ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో కెప్టెన్‌గా బ్యాటర్‌గా సత్తా చాటాడు. ఫుట్‌బాల్‌లో లియెనెల్ మెస్సి, క్రిస్టియానో రొనాల్డో ఇప్పటికీ ఆడుతున్నారు. విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ వన్డేల్లో ఆడితే తప్పేంటి? ఏ ఆటగాడికైనా సరే ప్రదర్శనే కొలమానం. వయసు ముఖ్యం కాదు. విరాట్ కోహ్లీ 37 ఏళ్ల వయసులోనూ 20 ఏళ్ల కుర్రాడిలా మైదానంలో చురుకుగా ఉంటాడు.

భారత జట్టులో కోహ్లీ.. మెస్సీ లాంటి ప్లేయర్. భారత జట్టులో ఫిట్‌నెస్ విప్లవం తెచ్చింది అతనే. చివరి రోజు 400 పరుగుల లక్ష్యం ఉన్నా సరే విజయం కోసం పోరాడాలని సహచరుల్లో స్ఫూర్తి నింపుతాడు. విరాట్ కోహ్లీ, రోహిత్ మెరుగ్గా రాణిస్తున్నారు. కాబట్టి వారిని వన్డేల్లో కొనసాగించాలి.'అని హర్భజన్ సింగ్ చెప్పుకొచ్చాడు.

Story first published: Thursday, August 13, 2026, 16:29 [IST]
Other articles published on Aug 13, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+