కమిన్స్ వచ్చినా.. ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలి: మాజీ క్రికెటర్లు
పాట్ కమిన్స్ వచ్చినా ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్‌కు టీమిండియా మాజీ క్రికెటర్లు హర్భజన్ సింగ్, సంజయ్ బంగర్ సూచించారు. ఇషాన్ సారథ్యంలో జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబరుస్తుందని, ఆ మూమెంటమ్‌ను దెబ్బతీయవద్దని కోరారు.
వెన్ను గాయంతో పాట్ కమిన్స్ ఐపీఎల్ ఫస్టాఫ్ మ్యాచ్‌లకు దూరమైన సంగతి తెలిసిందే. గాయం నుంచి కోలుకున్న కమిన్స్.. జట్టుతో కలిసాడు. శనివారం రాజస్థాన్ రాయల్స్‌తో జైపూర్ వేదికగా జరిగే తమ తదుపరి మ్యాచ్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నాడు. కమిన్స్ రాకతో సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్సీ మార్పు జరుగుతుందా? లేదా? అనే సస్పెన్స్ నెలకొంది.
ఇషాన్ కిషనే సరైనోడు..
ఈ వ్యవహారంపై జియో హాట్‌స్టార్ షోలో హార్భజన్ సింగ్, టీమిండియా మాజీ కోచ్ సంజయ్ బంగర్ మాట్లాడారు. ఈ ఇద్దరూ ఇషన్ కిషన్‌నే సారథిగా కొనసాగించాలని సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్‌కు సూచించారు. 'పాట్ కమిన్స్ తిరిగి వచ్చినా సరే.. ఇషాన్ కిషనే సన్‌రైజర్స్ హైదరాబాద్ కెప్టెన్‌గా కొనసాగించాలి. ఈ నిర్ణయం చర్చనీయాంశం కావచ్చు. కానీ జట్టు ఒక యువ నాయకుడికి మద్దతు ఇచ్చినప్పుడు.. అతనితోనే ముందుకు సాగాలి.

బౌలర్లు, ఇతర ఆటగాళ్లు ఇషాన్ కిషన్‌తో మంచి సమన్వయాన్ని పెంచుకున్నాడు. ఇషాన్ కిషన్‌ను కెప్టెన్‌గా కొనసాగించడం వల్ల సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు ప్రయోజనం చేకూరుతుంది.'అని హర్భజన్ సింగ్ అభిప్రాయపడ్డాడు.
మూమెంటమ్ దెబ్బతింటుంది..
కెప్టెన్ ఇషాన్ కిషన్ అద్భుత ప్రదర్శన కనబరుస్తున్నాడని, కమిన్స్ రాకతో అతన్ని పక్కనపెడితే టీమ్ మూమెంటమ్ దెబ్బతింటుందని సంజయ్ బంగర్ హెచ్చరించాడు. 'సారథిగా ఇషాన్ కిషన్ తన బౌలర్లను సమర్థవంతంగా ఉపయోగించకుంటున్నాడు. ఏ బ్యాటర్ మీద ఏ బౌలర్‌ను ఉపయోగించాలనే విషయంలో అతనికి స్పష్టమైన అవగాహన ఉంది. ఇది అతను ఆటను ఎంత బాగా నియంత్రిస్తున్నాడో చెప్పడానికి ఒక నిదర్శనం.
తీవ్ర ఒత్తిడిలో కూడా ఇషాన్ కిషన్ ఎలాంటి గందరగోళానికి గురికాకుండా.. తొందరపడకుండా మైదానంలో సరైన నిర్ణయాలు తీసుకుంటున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్‌తో మ్యాచ్‌లో స్పిన్నర్లను ఉపయోగించిన తీరు అద్భుతం. పాట్ కమిన్స్ ఇప్పుడిప్పుడే గాయం నుంచి కోలుకున్నాడు. అతను ఏ మేరకు రాణిస్తాడో చెప్పలేం. సన్‌రైజర్స్ మేనేజ్‌మెంట్ కూడా ఇషాన్ కిషన్‌నే కొనసాగించాలనే యోచనలో ఉండవచ్చు.'అని సంజయ్ బంగర్ అభిప్రాయపడ్డాడు.
కావ్య పాప ఏం చేస్తుందో..?
మెజార్టీ అభిమానులు కూడా ఇషాన్ కిషన్‌నే కెప్టెన్‌గా కొనసాగించాలని కోరుకుంటున్నారు. సన్‌రైజర్స్ హైదరాబాద్ మేనేజ్‌మెంట్ ఏం నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. మరోవైపు సన్‌రైజర్స్ హైదరాబాద్ జోరు మీద ఉంది. వరుసగా మూడు మ్యాచ్‌ల్లో గెలిచి పాయింట్స్ టేబుల్‌లో మూడో స్థానంలో కొనసాగుతోంది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications