
చెన్నై ఎలా గెలిచింది..?
'పాక్, న్యూజిలాండ్‌తో భారత్ టాస్ గెలిచి ఉంటే ఫలితం మరోలా ఉండేదని భరత్ అరుణ్ అన్నట్లు విన్నాను. అయితే ఈ వ్యాఖ్యలు ఏమాత్రం ఆహ్మానించదగినవు కావు. చెత్త బ్యాటింగ్‌తోనే టీమిండియా ఓటమి పాలైంది. ఇదే పిచ్‌పై ఐపీఎల్ ఫైనల్లో ముందుగా బ్యాటింగ్ చేసిన చెన్నై సూపర్ కింగ్స్ విజయం సాధించలేదా? ఆ జట్టు 190 పరుగుల భారీ స్కోర్ చేసి మ్యాచ్‌ను తమవైపు తిప్పుకుంది. ఇక్కడ టీమిండియా పరుగులు చేయడంలో విఫలమైంది. వాస్తవాన్ని అంగీకరించాల్సిందే తప్పా. సాకులు చెప్పవద్దు. మన బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారనేది వాస్తవం. ఒత్తిడికి చిత్తయి అంచనాలను అందుకోలేకపోయారు.'అని భజ్జీ ఇండియా టుడేతో మాట్లాడుతూ చెప్పుకొచ్చాడు.

ప్రత్యర్థి భీకరమైన బౌలింగ్‌తో..
పాకిస్థాన్, న్యూజిలాండ్ బౌలర్లు కట్టుదిట్టంగా బంతులేయడంతో భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారని.. అందుకే టీమిండియాపై ఆయా జట్లు పైచేయి సాధించాయని సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.'టీ20 ప్రపంచకప్‌లో టీమిండియాతో జరిగిన మ్యాచ్‌ల్లో పాకిస్థాన్, న్యూజిలాండ్ బౌలర్లు చాలా తెలివిగా బంతులేశారు. అందుకే, భారత బ్యాటర్లు పరుగులు చేసేందుకు ఇబ్బంది పడ్డారు.
అయితే, అఫ్గానిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌ల్లో టీమిండియా బ్యాటర్లు గొప్పగా పుంజుకున్నారు. స్వేచ్ఛగా ఆడుతూ 200లకు పైగా పరుగులు చేశారు. దీంతో ఆ జట్టుపై భారత్ సులభంగా విజయం సాధించగలిగింది. తొలి రెండు మ్యాచ్‌ల్లో కూడా భారీగా పరుగులు చేసి ఉంటే కచ్చితంగా టీమిండియా గెలుపొందేది' అని గవాస్కర్ చెప్పుకొచ్చాడు.

చెత్త బ్యాటింగ్‌తోనే..
ఇక భారత పరాజయాల్లో టాస్ పాత్ర ఏం లేదని అగార్కర్ చెప్పుకొచ్చాడు. 'భారత పరాజయాల్లో టాస్ పాత్ర పెద్దగా లేదు. భారత జట్టు చెత్త బ్యాటింగ్‌తో మూల్యం చెల్లించుకుంది. మంచి బ్యాటింగ్ లైనప్ కలిగి ఉన్నప్పటికీ.. దురదృష్టవశాత్తు రాణించలేకపోయింది. ఒకవేళ భారత్ భారీ స్కోర్ చేసి ఓడిపోయి ఉంటే అప్పుడు టాస్ కీలక పాత్ర పోషించిందని చెప్పవచ్చు. అయితే టాస్ ప్రభావం ఉన్నప్పటికీ అదే భారత ఓటమికి ప్రధాన కారణం అంటే మాత్రం అంగీకరించను'అని అగార్కర్ తెలిపాడు.

ఒత్తిడికి చిత్తయ్యింది..
ఇక భారత్ ఒత్తిడికి చిత్తయిందని ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ టామ్ మూడీ అన్నాడు. ఒత్తిడిలో తమ బెస్ట్ క్రికెట్ ఆడలేకపోయిందని, అందుకే సెమీస్ చేరకుండా ఇంటిదారి పట్టిందని చెప్పుకొచ్చాడు.'భారత పరాజయాల్లో టాస్ పాత్ర ఏ మాత్రం లేదు. తీవ్ర ఒత్తిడిలో తమ బ్రాండ్ ఆఫ్ క్రికెట్ ఆడలేకపోయింది. అదే భారత జట్టు వైఫల్యానికి కారణమైంది. సెమీస్ చేరకుండా ఇంటిదారి పట్టేలా చేసింది'అని టామ్ మూడీ చెప్పుకొచ్చాడు. ఇక 2012 టీ20 ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియా ఓ ఐసీసీ ఈవెంట్లో నాకౌట్ దశకు చేరుకోకపోవడం ఇదే తొలిసారి. నామమాత్రమైన ఆఖరి మ్యాచ్‌లో టీమ్‌ఇండియా సోమవారం నమీబియాతో తలపడనుంది.


Click it and Unblock the Notifications
