నేను కొట్టడం ఓ జోక్, ఎక్కువ చేశాడు: భజ్జీపై అక్తర్
లాహోర్: భారత్ ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ పైన తాను చేయి చేసుకున్నానన్న వార్తల పైన పాకిస్తాన్ మాజీ ఆటగాడు షోయబ్ అక్తర్ స్పందించాడు. తాను వారిని కొట్టానని చెప్పడం ఓ జోక్ అన్నాడు. అప్పట్లో జరిగిన విషయాన్ని భారత వర్గాలు ఎక్కువ చేసి చూపిస్తున్నాయని ఆరోపించాడు.
తాము కేవలం ఆర్మ్ రెజ్లింగ్ మాత్రమే చేశాం తప్ప అంతకంటే వేరే ఏం చేయలేదన్నాడు. తనకు భజ్జీ, యువీలు మంచి స్నేహితులు అని చెప్పాడు. ఇస్లామాబాద్ హోటల్ గదిలో జరిగిందంతా కేవలం జోక్ మాత్రమేనని తెలిపాడు.

భజ్జీ చాలా దూకుడుగా ఉంటాడని, కానీ అతడు అక్కడ జరిగిన దానిని ఎక్కువ చేసి చెప్పాడన్నాడు. జూనియర్లను కొట్టడం తనకు అలవాటు లేదన్నాడు.
అక్తర్ బెదిరిస్తే, నా గదికి రా.. చూసుకుందామని చెప్పా: భజ్జీ2004 సంవత్సరంలో పాకిస్తాన్‌లో పర్యటించినప్పుడు అక్తర్ తనను, యువీని రూంకు వచ్చి కొడతానని బెదిరించాడని, ఎవరు కొడతారో చూద్దామని తాను సవాల్ చేశానని, అక్తర్ బలవంతుడు కావడంతో భయపడ్డానని భజ్జీ చెప్పిన విషయం తెలిసిందే.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications