Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

అక్తర్ బెదిరిస్తే, నా గదికి రా.. చూసుకుందామని చెప్పా: భజ్జీ

ముంబై: టీమిండియా ఆఫ్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ మైదానంలో దూకుడుగా ఉంటాడు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆయన శ్రీశాంత్‌కు చెంప దెబ్బ, మంకీగేట్ తదితర అంశాలపై మాట్లాడిన విషయం తెలిసిందే. తాజాగా మరో విషయం వెల్లడించాడు.

పాకిస్తాన్ పేసర్ షోయబ్ అక్తర్ తనను నెట్టివేశాడని, ఆ సమయంలో యువరాజ్ సింగ్ హోటల్ రూంలో ఉన్నాడని చెప్పాడు. అక్తర్ తనను వేధించాడని, అయినా అతను మైదానం బయట తనకు మంచి స్నేహితుడు అని చెప్పాడు.

ఓసారి సిక్స్ కొట్టాలని తనను సవాల్ చేశాడని, అప్పుడు తాను సిక్స్ కొట్టానని, దాంతో అతను షాకయ్యాడని చెప్పాడు. ఆ తర్వాత అతను రెండు బౌన్సర్లు వేశాడని చెప్పాడు. దీంతో, తాను కొట్టలేకపోయానని, అప్పుడు అతను తనను కామెంట్ చేస్తే, దానికి కౌంటర్ ఇచ్చానని చెప్పాడు.

Harbhajan Singh

అయితే, మ్యాచ్ తర్వాత తామిద్దరం ఒకే దగ్గర కూర్చున్నామని, ఆ వాదన మైదానం వరకేనని అభిప్రాయపడ్డాడు. తన గదికి వచ్చి, తనను కొడతానని ఓసారి షోయబ్ అక్తర్ బెదిరించాడని భజ్జీ చెప్పాడు. తాను కూడా దీటుగా స్పందించానని చెప్పాడు.

నా గదికి రా.. ఎవరు కొడతారో చూసుకుందామని చెప్పానని అన్నాడు. కానీ, నిజంగా అయితే తాను భయపడ్డానని చెప్పాడు. ఓసారి తనను అతను గట్టిగా తోసేశాడని, అప్పుడు యువరాజ్ సింగ్ హోటల్ గదిలో ఉన్నాడని చెప్పాడు.

పాకిస్తాన్ - భారత్ మ్యాచ్ సందర్భంగా మన గెలుపు ఎప్పుడూ మంచి తీపి గుర్తు అని చెప్పాడు. దాయాదుల మ్యాచ్ అంటేనే మీడియా హైప్ క్రియేట్ చేస్తుందని, దానికి తగ్గట్లే హైవోల్టేజ్ మ్యాచ్ అవుతుందని చెప్పాడు. పెద్ద జట్టును ఓడిస్తే ఓ ఆటగాడిగా చాలా ఆనందంగా ఉంటుందని చెప్పాడు.

ఓ సమయంలో పాకిస్తాన్ గొప్ప జట్టు అని, వసీమ్ అక్రం, వకార్ యూనిస్, సక్లయిన్ ముస్తాక్, షోయబ్ అక్తర్ వంటి ఆటగాళ్లు ఉన్నారని, అప్పుడు ఆడి, గెలవడం ఓ తీపి గుర్తు అన్నాడు. భారత్ - పాక్ మ్యాచ్ మధ్య మీడియా కూడా హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పాడు.

Story first published: Monday, November 13, 2017, 12:12 [IST]
Other articles published on Nov 13, 2017
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+