
అనుష్క ఏం రాసిందంటే..?
'అచ్చం నువ్వు ఎలాగైతే జీవితంలో ముందుకు సాగుతావో.. అలాగే ఈ ఫొటోకు కూడా ఎలాంటి మెరుగులు అవసరం లేదు. ఉక్కు సంకల్పం.. నిజాయితీతో కూడినది నీ వ్యక్తిత్వం. చుట్టూ ఎలాంటి పరిస్థితులు ఉన్నా లెక్క చేయక ముందుకు వెళ్లే ధైర్యం నీ సొంతం. నీలా చీకటి నుంచి అత్యున్నత శిఖరాలకు చేరగల వ్యక్తి మరొకరు ఉండరని నాకు తెలుసు. నీ మనసులో భయానికి తావులేదు. రోజురోజుకీ నువ్వు ఎదుగుతున్న విధానం అద్భుతం.

గట్టిగా చెప్పాలనుంది..
మనిద్దరం ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా మాట్లాడుకునేంత తీరిక లేదని నాకు తెలుసు. అయితే, కొన్నిసార్లు నాకు బిగ్గరగా అరిచి చెప్పాలనిపిస్తుంది... నీ అంతటి అత్యద్భుత వ్యక్తి మరొకరు లేరని ఈ ప్రపంచానికి గట్టిగా చాటిచెప్పాలని ఉంటుంది. నువ్వంటే ఏమిటో తెలిసిన వాళ్లకు ఈ మాటలతో పనిలేదు. జీవితంలో ప్రతీ విషయాన్ని ప్రకాశవంతంగా.. మరింత అందంగా తీర్చిదిద్దుతున్నందుకు కృతజ్ఞతలు. హ్యాపీ బర్త్‌డే క్యూట్‌నెస్''అని అనుష్క తన పోస్ట్‌లో రాసుకొచ్చింది. దీనికి ఓ అందమైన ఫొటోను జత చేసింది.

కమర్షియల్ యాడ్‌తో
ఓ షాంపో వాణిజ్య ప్రకటన సందర్బంగా పరిచయమైన అనుష్క-విరాట్‌లు ప్రేమలో పడ్డారు. సుదీర్ఘకాలం పాటు ప్రేమయాణం నడిపిన ఈ జంట.. 2017లో వివాహ బంధంతో ఒక్కటైంది. డిసెంబరు 11న ఇటలీ డెస్టినేషన్ వెడ్డింగ్ ద్వారా వైవాహిక బంధంలో అడుగుపెట్టింది. ఈ అందమైన జంటకు 2021, జనవరి 11న కూతురు వామికా జన్మించింది. ప్రస్తుతం అనుష్క తన కూతురితో అమ్మ క్షణాలను ఆస్వాదిస్తుండగా.. విరాట్ కోహ్లీ టీ20 ప్రపంచకప్‌లో బిజీగా ఉన్నాడు. అనుష్క సైతం అతనితోపాటే ఉంది.

ఐసీసీ ట్రోఫీ ఒక్కటే..
కెరీర్‌లో ఎన్నో సాధించినా కెప్టెన్‌గా ఎన్ని ఘనతలు అనుకున్నా.. ఐసీసీ ట్రోఫీ మాత్రం అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. ప్లేయర్‌గా 2011, 2013 చాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ గెలిచిన కోహ్లీ.. కెప్టెన్‌గా ఒక్క టైటిల్ అందించలేకపోయాడు. వ్యక్తిగతంగా ఎన్ని ఘనతలు సాధించినా.. సగటు క్రికెట్ అభిమాని ట్రోఫీలనే లెక్కలోకి తీసుకుంటాడు. కానీ కోహ్లీకి ఆ అదృష్టం లేదు.
జట్టు కోసం నిరంతరం తపిస్తూ, చెమట చిందిస్తూ ఆడే అతనికి ఐసీసీ ట్రోఫీ ఎప్పటి నుంచో ఊరిస్తోంది. అదే విమర్శకులకు అస్త్రంగా మారింది. కెప్టెన్‌గా జట్టును ఎంతో దృఢంగా మలుస్తూ, యువకులకు ప్రేరణ కలిగిస్తూ ఉండే నాయకుడికి, విదేశీ క్రికెటర్లలోనూ స్థైర్యం నింపే ఈ సారథికి.. ఈ ఒక్క కారణంగా ప్రస్తుతం విమర్శలు తీవ్రమయ్యాయి. అదే అతని కెరీర్‌కు లోటుగా మిగిలిపోయింది.


Click it and Unblock the Notifications
