
హైదరాబాద్: భారత క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ నేటి(ఏప్రిల్)తో 48వ వసంతలోకి అడుగుపెట్టాడు. ఈ సందర్భంగా యావత్ భారతం మాస్టర్ బ్లాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపింది. వాట్సాప్, ఫేస్‌బుక్, ట్విటర్, ఇన్‌స్టా ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ తెరిచినా సచినే కనిపిస్తున్నాడు. ఎవరీ స్టేటస్ చూసినా సచిన్ పేరే మారుమోగిపోతుంది. త్రోబ్యాక్ వీడియోలు.. సచిన్ రికార్డులు అయితే హల్‌చల్ చేస్తున్నాయి. టీమ్ఇండియా క్రికెటర్లు, మాజీలు, రాజకీయ, సినీ ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా మాస్టర్‌కు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ఇప్పటికే సచిన్ అభిమానులు పోస్టులతో మాస్టర్ పేరు ట్రెండింగ్ నిలిచింది. టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, సూపర్ స్టార్ ప్రిన్స్ మహేశ్ బాబు కూడా భారత దిగ్గజానికి విషెస్ చెప్పారు.
గొప్ప ఆటగాళ్లలో ఒకరు.. ఎంతో మందికి స్పూర్తి ప్రదాత అయిన సచిన్ పాజీకి జన్మదిన శుభాకాంక్షలు- విరాట్ కోహ్లీ
"క్రికెట్ అర్థాన్ని మార్చి.. ఆటకు మారుపేరుగా నిలిచిన సచిన్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. మీరెప్పుడూ ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నా." -మహేశ్ బాబు, నటుడు
"లెజెండరీ మాస్టర్ బ్లాస్టర్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. పూర్తిగా కోలుకున్న మిమ్మల్ని చూడటం చాలా సంతోషకరం. మీకు నా ప్రేమ, శుభాకాంక్షలు." -యువరాజ్ సింగ్, మాజీ క్రికెటర్
"సచిన్ సర్.. మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు. మాకే కాక రాబోయే తరాలకు మీరు స్ఫూర్తిగా నిలుస్తారు. చాలా సందర్భాల్లో నాకు మద్దతుగా నిలిచినందుకు మీకు కృతజ్ఞతలు." -హిమా దాస్, అథ్లెట్
"చాలా మంది సూపర్స్టార్లు ఉన్నారు. కానీ ఒక్కరే మాస్టర్. మీరు ఆరోగ్యంగా, సంతోషంగా ఉండాలి పాజీ." -ప్రజ్ఞాన్ ఓజా, మాజీ క్రికెటర్
"సచ్ ఒక నిజం, సచ్ ఒక జీవితం, సచ్ ఒక సమాధానం, సచ్ అంటే ఇదే. ప్రపంచం చూసిన గొప్ప బ్యాట్స్‌మన్, ఎంతో వినయ పూర్వకమైన వ్యక్తికి పుట్టినరోజు శుభాకాంక్షలు." -వెంకటేశ్ ప్రసాద్, మాజీ క్రికెటర్