Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

Sourav Ganguly Birthday: ఆ రెండూ మీకు దక్కాలి దాదా.. వెల్లువెత్తిన విషెస్!

Happy Birthday Dada: BCCI and Virender Sehwag Lead Wishes As Sourav Ganguly Turns 49

న్యూఢిల్లీ: టీమిండియా మాజీ కెప్టెన్, బీసీసీఐ ప్రెసిడెంట్ సౌరవ్‌ గంగూలీ నేడు(గురువారం) 49వ పుట్టినరోజు జరుపుకుంటున్నాడు. ఈ సందర్భంగా భారత క్రికెట్‌కు అతను చేస్తున్న సేవలను అభిమానులు, క్రికెటర్లు గుర్తు చేసుకుంటున్నారు. అతనికి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఏ సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ కదిలించినా.. ఎవరి స్టేటస్ చూసినా దాదా పేరే వినిపిస్తోంది. అతని రికార్డులు, ఘనతలను యావత్ క్రికెట్ ప్రపంచం నెమరువేసుకుంటుంది. సినీ, రాజకీయ, క్రీడా అన్ని రంగాలకు చెందిన ప్రముఖులు దాదాకు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నారు.

ఆరోగ్యంగా.. ఆనందంగా..

దాదా సహచర ఆటగాళ్లు వీరేంద్ర సెహ్వాగ్‌, వీవీఎస్‌ లక్ష్మణ్‌, మహ్మద్ కైఫ్‌తో పాటు దిగ్గజాలు, ఈ తరం క్రికెటర్లు సైతం గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.'అంకితభావం, దార్శనికతలో దాదాతో కొంతమందే సరిపోలుతారు. ఎప్పటిలాగే మీరు ఆరోగ్యంగా, ఆనందంగా ఉండాలి దాదా. పుట్టినరోజు శుభాకాంక్షలు దాదా 'అని వీరేంద్ర సెహ్వాగ్‌ ట్వీట్ చేయగా.. 'పుట్టినరోజు శుభాకాంక్షలు గంగూలీ. జీవితంలోనే అతిపెద్ద ఆనందం, ఆశీర్వాదాలు నీకు దక్కాలి. ఈ ఏడాదంతా బాగుండాలి'అని వీవీఎస్‌ లక్ష్మణ్‌ ట్వీట్ చేశాడు.

ఆఫ్‌సైడ్ ఆడుకునే రాకుమారుడికి..

'ఆఫ్‌సైడ్‌ ఫీల్డర్ల మధ్య బంతిని తరలించే రాకుమారుడికి.. పుట్టినరోజు శుభాకాంక్షలు'అని చెన్నై సూపర్‌కింగ్స్‌ ట్వీట్ చేయగా.. 'అతనిలోని దూకుడు, అభిరుచికి మరెవ్వరూ సరిపోరు. భారత క్రికెట్‌ను మార్చేసిన, ఎన్నో రకాలుగా జట్టులో ప్రేరణ నింపిన దాదాకు జన్మదిన శుభాకాంక్షలు'అని పంజాబ్‌ కింగ్స్‌ విష్ చేసింది. ఇక'నా కెప్టెన్‌ గంగూలీకి జన్మదిన శుభాకాంక్షలు. ఎప్పటిలాగే ప్రేమిస్తుంటాను దాదా'అని టీమిండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్‌ సింగ్‌ ట్వీట్ చేశాడు.

పుట్టకతోనే నాయకుడు

'మైదానంలో దాదా మనల్ని నడిపిస్తుంటే మనం చాలా ఉన్నతంగా కనిపిస్తాం. విఫలమైనప్పుడు భుజం తట్టి. రాణించినప్పుడు వెన్నుతట్టే కెప్టెన్‌కు జన్మదిన శుభాకాంక్షలు. దాదా పుట్టుకతోనే నాయకుడు.'అని మహ్మద్‌ కైఫ్‌ ట్వీట్ చేయగా..'జన్మదిన శుభాకాంక్షలు దాదా. టీమిండియా తరఫున మీ సారథ్యంలో అరంగేట్రాన్ని నేనెప్పటికీ మరిచిపోలేను. మీ అండదండలకు ధన్యవాదాలు'అని దినేశ్‌కార్తీక్‌ పేర్కొన్నాడు.'దాదాకు పుట్టినరోజు శుభాకాంక్షలు. భారత క్రికెట్‌ మీకెప్పటికీ రుణపడి ఉంటుంది. అన్నింట్లోనూ అత్యుత్తమ ఫలితాలను రాబట్టిన మీకు కృతజ్ఞతలు. క్రికెట్‌ పట్ల మీ అభిరుచి, అంకితభావం రాబోయే తరాలకు ఆదర్శంగా నిలుస్తాయి'అని వెటరన్ క్రికెటర్ సురేశ్‌ రైనా ట్వీట్ చేశాడు.

Story first published: Thursday, July 8, 2021, 15:44 [IST]
Other articles published on Jul 8, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+