Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హనుమాన్ అంశ్ పార్ట్-2లో విరాట్ కోహ్లీ-అనుష్క శర్మ!

ప్రసిద్ధ ఆధ్యాత్మిక గురువు 'నీమ్ కరోలీ బాబా' జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన హనుమాన్ అంశ్ అనే బాలీవుడ్ మూవీ బాక్సాఫీస్‌ను షేక్ చేస్తోంది. విశాల్ చతుర్వేది దర్శకత్వంలో కేవలం రూ.2 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ ఆధ్యాత్మిక చిత్రం ప్రేక్షకుల మనసులను గెలుచుకుంది.

కంటెంట్ ఉంటే బడ్జెట్‌తో సంబంధం లేదని ఈ మూవీ నిరూపించింది. ఇప్పటికే రూ.150 కోట్ల క్లబ్‌లో చేరి భారీ హిట్‌గా నిలిచింది. ఈ చిత్రంపై ప్రముఖులు కూడా ప్రశంసల జల్లు కురిపించారు. టీమిండియా మాజీ డాషింగ్ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ఈ మూవీని ప్రత్యేకంగా కొనియాడాడు. దాంతో ఈ సినిమా డైరెక్టర్ విశాల్ చతుర్వేది.. టీమిండియా స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీ, అతని సతీమణి, బాలీవుడ్ హీరోయిన్ అనుష్క శర్మలను ఈ మూవీ చూడాలని విజ్ఞప్తి చేశాడు.

Hanuman Ansh Part 2 Producer Namrata Hints at Virat Kohli and Anushka Sharma Connection

భారీ విజయం సాధించడంతో మేకర్స్ పార్ట్-2 తీసే యోచనలో ఉన్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే పార్ట్-2 తెరకెక్కిస్తే అందులో విరాట్ కోహ్లీ, అనుష్క శర్మ అతిథి పాత్రలో నటిస్తారని ప్రచారం జరుగుతోంది. తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత నమ్రతను ప్రశ్నించగా.. ఆమె ఆసక్తికర సమాధానం చెప్పారు. తాను ఇప్పటికే ఈ విషయంపై కొందర్ని సంప్రదించానని, ఈ సినిమా గురించి తమకు ముందే తెలుసని బదులిచ్చారని తెలిపారు.

అయితే వారు నటించడం ఇంకా ఖరారు కాలేదని స్పష్టం చేశారు. అయితే విరాట్ కోహ్లీ, అనుష్క శర్మల కోసం మూవీ మేకర్స్ ప్రయత్నిస్తున్నారనే విషయం అర్థమవుతోంది. విరాట్ కోహ్లీ, అనుష్క శర్మలకు నీమ్ కరోలీ బాబాపై అమితమైన నమ్మకం, భక్తి ఉన్నాయి. వీరు తరచూ ఉత్తరాఖండ్‌లోని 'కైంచీ ధామ్' ఆశ్రమాన్ని సందర్శిస్తారు.

ప్రస్తుతం లండన్‌లో ఉన్న విరాట్ కోహ్లీ.. వెస్టండీస్‌తో సొంతగడ్డపై జరిగే వన్డే సిరీస్‌తో మళ్లీ మైదానంలోకి అడుగుపెట్టనున్నాడు. సెప్టెంబర్ చివర్లో ఈ సిరీస్ ప్రారంభం కానుంది. అంతర్జాతీయ టీ20లతో పాటు టెస్ట్‌లకు వీడ్కోలు పలికిన విరాట్ కోహ్లీ కేవలం వన్డే ఫార్మాట్‌లో మాత్రమే కొనసాగుతున్న విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2027 ఆడటమే లక్ష్యంగా పెట్టుకున్నాడు.

Story first published: Thursday, September 10, 2026, 13:47 [IST]
Other articles published on Sep 10, 2026
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+