Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

WTC Finalలో టీమిండియా అద్భుతాలు చేయగలదు: హనుమ విహారి

Hanuma Vihari says Indian team can do outstanding things in WTC final against New Zealand
WTC Final తో అయినా Hanuma Vihari ఫామ్ లోకి రావాలి.. NZ తో కఠిన సవాలే ! || Oneindia Telugu

లండన్: న్యూజిలాండ్‌తో జరిగే వరల్డ్ టెస్ట్ చాంపియన్‌షిప్ ఫైనల్లో భారత జట్టు అద్భుతాలు చేయగలదని టెస్ట్ బ్యాట్స్‌మన్ హనుమ విహారీ అన్నాడు. న్యూజిలాండ్ లాంటి కఠిన ప్రత్యర్థి ఉన్నప్పటికీ డబ్ల్యూటీసీ ఫైనల్ పోరుకు టీమ్​ఇండియా పూర్తి ఆత్మ విశ్వాసంతో ఉందని తెలిపాడు. ఈ మెగా ఫైనల్‌తో పాటు ఇంగ్లండ్‌తో ఐదు టెస్ట్‌ల సిరీస్‌కు టీమిండియా రెడీగా ఉందన్నాడు. తాను కూడా వ్యక్తిగతంగా సన్నదమవుతున్నానని తెలిపాడు. ఇంగ్లండ్​లోని సౌతాంప్టన్ వేదికగా జూన్ 18 నుంచి 22 వరకు ఈ ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తాజాగా ఇండియా టూడేతో మాట్లాడిన హనుమ విహారీ.. ఇంగ్లండ్ పర్యటన గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

అన్ని విధాల రెడీ అవుతున్నా..

అన్ని విధాల రెడీ అవుతున్నా..

'డబ్ల్యూటీసీ ఫైనల్, ఆ తర్వాత ఇంగ్లండ్​తో జరిగే టెస్టు సిరీస్ కోసం బాగా సిద్ధమవుతున్నాను. ఇది డబ్ల్యూటీసీ మొదటి ఎడిషన్ కాబట్టి భారత అభిమానులందరూ ఆసక్తిగా, ఉత్కంఠంగా ఎదురుచూస్తుంటారు. మేం ఫైనల్లో న్యూజిలాండ్​తో తలపడబోతున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో అది మాకు కఠిన సవాలే. అయితే, భారత జట్టు అద్భుతాలు చేయగలదు. ఆత్మ విశ్వాసంతో బరిలోకి దిగబోతున్నామని ఖచ్చితంగా చెప్పగలను. డబ్ల్యూటీసీతో పాటు ఇంగ్లండ్‌తో సిరీస్‌లో నా సాయశక్తుల రాణించడానికి కృషి చేస్తా'అని హనుమ విహారి చెప్పుకొచ్చాడు.

చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత..

చిరస్మరణీయ ఇన్నింగ్స్ తర్వాత..

గాయం కారణంగా స్వదేశంలో జరిగిన ఇంగ్లండ్ సిరీస్​కు దూరమైన విహారి.. డబ్ల్యూటీసీ ఫైనల్‌తో మళ్లీ టెస్టు జట్టులో చేరనున్నాడు. ఆస్ట్రేలియా పర్యటనలో మూడో టెస్టులో చిరస్మరణీయ ఇన్నింగ్స్ ఆడుతూ.. అతను గాయపడిన విషయం తెలిసిందే. కీలక స్థితిలో రవిచంద్రన్ అశ్విన్‌తో కలిసి విహారి చేసిన పోరాటం అద్భుతం. 161 బంతుల్లో 23 పరుగులతో అజేయంగా నిలిచి, మ్యాచ్‌ను డ్రాగా ముగించాడు. ఆ మ్యాచ్‌లో అతని తొడ కండరాలు పట్టేయగా.. మరో ఎండ్‌లో అశ్విన్ పక్కటెముకలు పట్టేసాయి. అయినా ఈ ఇద్దరి జట్టు ఓటమిని తప్పించాడు. వాస్తవానికి గాయపడకుండా మ్యాచ్‌ను కూడా గెలిపించేవారు.

కౌంటీ క్రికెట్‌లో..

కౌంటీ క్రికెట్‌లో..

గాయంతో ఇంగ్లండ్ పర్యటనకు దూరమైన విహారీ.. విజయ్ హజారే ట్రోఫీలో మాత్రం ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఆంధ్ర జట్టు తరఫున ఏడు మ్యాచ్‌లు ఆడిన అతను ఒకే ఒక హాఫ్ సెంచరీ చేశాడు. ప్రస్తుతం వర్‌విక్‌షైర్ తరఫున కౌంటీ క్రికెట్ ఆడుతున్న విహారీ.. అక్కడ కూడా దారుణంగా విఫలమయ్యాడు. వరుసగా 0, 8, 32, 52, 8, 0 పరుగులు చేశాడు. దాంతో భారత జట్టు తరఫునైనా తిరిగి ఫామ్ అందుకోవాలని ఆతృతగా ఎదురు చూస్తున్నాడు.

విహారి మంచి మనసు..

విహారి మంచి మనసు..

దేశంలో ఆసుపత్రిలో పడకల కోసం ఇంతటి క్లిష్టమైన పరిస్థితి వస్తుందని ఏనాడు ఊహించలేదని, ఇది హృదయవిదారకమని విహారి విచారం వ్యక్తం చేశాడు. కరోనా వైరస్ విపత్కర పరిస్థితిపై కలత చెందిన అతను తనవంతుగా చేయూత అందించాడు. దేశంలో కరోనా రెండో దశ తీవ్రరూపం దాల్చిన వేళ.. తన మిత్రులు, అనుచరులతో కలిసి ఓ బృందాన్ని ఏర్పాటు చేసి అవసరాల్లో ఉన్నవాళ్లకు విహారి సాయం చేస్తున్నాడు. పడకలు, ఆక్సిజన్‌ సిలిండర్లను, ప్లాస్మాథెరపీ లాంటి పలు సేవల్ని ప్రజలకు నేరుగా అందజేస్తున్నాడు. భవిష్యత్తులో మరిన్నీ సేవలు చేస్తానని కూడా ఈ హైదరాబాదీ బ్యాట్స్‌మెన్ వెల్లడించాడు.

Story first published: Sunday, May 16, 2021, 17:37 [IST]
Other articles published on May 16, 2021
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+