For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

Hanuma Vihari: తెలుగోడికి అన్యాయం.. శ్రేయస్ అయ్యర్ కోసం కారణం లేకుండా వేటు!

Hanuma Vihari omitted from the Test squad against New Zealand

హైదరాబాద్: టెస్టులనే నమ్ముకున్న తెలుగు క్రికెటర్‌‌‌‌, హైదరాబాద్ ప్లేయర్ హనుమ విహారికి అన్యాయం జరిగింది. సొంతగడ్డపై న్యూజిలాండ్‌తో జరగనున్న రెండు టెస్ట్‌ల సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో హనుమ విహారికి చోటు దక్కలేదు. చేతన్ శర్మ నేతృత్వంలోని నేషనల్‌‌‌‌ సెలక్షన్‌‌‌‌ కమిటీ ఎలాంటి కారణం చెప్పకుండా, కనీసం వివరణ కూడా ఇవ్వకుండా అతనిపై వేటు వేసింది. గత ఆస్ట్రేలియా టూర్‌‌‌‌లో సిడ్నీ టెస్టులో విహారి వీరోచిత ఇన్నింగ్స్‌‌‌‌తో భారత జట్టును ఓటమి నుంచి గట్టెక్కించాడు. తొడ కండరాల గాయంతో బాధపడుతున్నప్పటికీ అశ్విన్‌‌‌‌తో కలిసి అద్భుతంగా బ్యాటింగ్‌‌‌‌ చేసి టీమ్‌‌‌‌కు ఓటమి తప్పించాడు.

శ్రేయస్ అయ్యర్ కోసం..

శ్రేయస్ అయ్యర్ కోసం..

దాంతో, సిడ్నీ టెస్ట్‌‌‌‌ హీరో అంటూ తనపై సర్వత్రా ప్రశంసల వర్షం కురిసింది. సిడ్నీలో అయిన గాయం వల్లే ఆ తర్వాత సొంతగడ్డపై ఇంగ్లండ్‌‌‌‌తో టెస్టు సిరీస్‌‌‌‌కు విహారి దూరమయ్యాడు. తర్వాత ఇంగ్లండ్‌‌‌‌ టూర్‌‌‌‌కు ఎంపికైనా.. వామప్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో తప్పిస్తే నాలుగు టెస్టుల్లో తనకు చాన్స్‌‌‌‌ రాలేదు. ఐదుగురు బౌలర్ల వ్యూహంతో టీమ్‌మేనేజ్‌మెంట్ విహారిని బెంచ్‌కే పరిమితం చేసింది.

ఈ లెక్కన ఫామ్‌‌‌‌ ఆధారంగా తనపై వేటు వేశారన్న వాదన సరైంది కాదని చెప్పొచ్చు. అదే టైమ్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ను ఉన్నట్టుండి టెస్టు టీమ్‌‌‌‌లోకి తీసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. అయ్యర్‌‌‌‌ ఫస్ట్‌‌‌‌ క్లాస్‌‌‌‌ క్రికెట్‌‌‌‌ ఆడి మూడేళ్లు కావస్తోంది.

తప్పును అంగీకరిస్తూ..

తప్పును అంగీకరిస్తూ..

మొన్నటి ఐపీఎల్‌‌‌‌లోనూ ఏ మాత్రం ఆకట్టుకోలేదు. పైగా, విహారి ఆల్ట్రా డిఫెన్స్‌‌‌‌ బ్యాటింగ్‌‌‌‌ స్టైల్‌‌‌‌ రహానె, పుజారా మాదిరిగా ఉంటుందని, మిడిలార్డర్‌‌‌‌లో వైవిధ్యం కోసం అయ్యర్‌‌‌‌కు చాన్స్‌‌‌‌ ఇచ్చారని సెలక్షన్‌‌‌‌ కమిటీ సన్నిహిత వర్గాల వాదనలోనూ పస లేదు. ఇప్పటికే ఫిట్‌‌‌‌నెస్‌‌‌‌ లేని హార్దిక్‌‌‌‌ పాండ్యాను టీ20 వరల్డ్‌‌‌‌కప్‌‌‌‌లో ఆడించి చేతులు కాల్చుకున్న చేతన్‌‌‌‌ శర్మ నేతృత్వంలోని సెలక్షన్​ కమిటీ ఇప్పుడు విహారిని టెస్టుల నుంచి తప్పించి విమర్శలు ఎదుర్కొంటోంది.

నష్ట నివారణలో భాగంగా ఈ నెలలో సౌతాఫ్రికా టూర్‌‌‌‌కు వెళ్లే భారత్-ఏ టీమ్‌‌‌‌లో విహారిని చేర్చినట్టు ప్రకటించింది. కానీ, తెలుగు క్రికెటర్‌‌‌‌ ఇప్పటికే ఇండియా-ఎ టీమ్‌‌‌‌కు దాదాపు రెండేళ్లు కెప్టెన్‌‌‌‌గా పని చేశాడు. ఒకవేళ విహారిని సౌతాఫ్రికా పంపాలని ముందుగానే భావిస్తే.. మూడు రోజుల కిందట సెలక్ట్‌‌‌‌ చేసిన టీమ్‌‌‌‌లోనే తన పేరు ఉండాలి. కానీ, ఇప్పుడు చేర్చి సెలక్టర్లు తమ తప్పును అంగీకరించారని అనొచ్చు.

అప్పుడూ కూడా ఇలానే..

అప్పుడూ కూడా ఇలానే..

ఓపెనర్‌‌‌‌, మిడిలార్డర్‌‌‌‌ బ్యాటర్‌‌‌‌గానే కాకుండా పార్ట్‌‌‌‌టైమ్‌‌‌‌ స్పిన్నర్‌‌‌‌గానూ సత్తా చాటుతున్న విహారి విషయంలో సెలక్టర్లు, టీమ్​ మేనేజ్​మెంట్​తీరు సరిగ్గా లేదు. బాగానే ఆడుతున్నా అతడిని పక్కనబెడుతున్నారు. గతంలో వెస్టిండీస్‌‌‌‌ టూర్‌‌‌‌లో విహారి నాలుగు ఇన్నింగ్స్‌‌‌‌ల్లో 32, 93, 111, 53 నాటౌట్‌‌‌‌.. స్కోర్లు చేసి ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద సిరీస్‌‌‌‌గా నిలిచాడు.

తన వల్లే విండీస్‌‌‌‌ గడ్డపై భారత్ తొలి టెస్టు సిరీస్‌‌‌‌ నెగ్గింది. కానీ వెంటనే సొంతగడ్డపై సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌‌‌‌లో ఫైనల్‌‌‌‌ ఎలెవన్‌‌‌‌లో చాన్స్‌‌‌‌ ఇవ్వలేదు. ఐదుగురు బౌలర్ల ప్లాన్‌‌‌‌ కోసం తనను విస్మరించారు. వచ్చే నెలలో సౌతాఫ్రికా టూర్‌‌‌‌ ఉన్న నేపథ్యంలో భారత్-ఎ టీమ్‌‌‌‌ తరఫున సత్తా చాటితే విహారి మళ్లీ టీమ్‌‌‌‌లోకి రావొచ్చు. తనను విస్మరించిన సెలక్టర్లకు విహారి ఇప్పుడు బ్యాట్​తో సమాధానం చెప్పాల్సిన అవసరం ఉంది.

కేఎస్ భరత్‌కు చాన్స్..

కేఎస్ భరత్‌కు చాన్స్..

మరో తెలుగు క్రికెటర్, ఆంధ్ర వికెట్‌‌‌‌ కీపర్‌‌‌‌ శ్రీకర్‌‌‌‌ భరత్‌‌‌‌కు ఈ సిరీస్‌కు ఎంపిక చేసిన జట్టులో చోటు దక్కింది. రిషభ్ పంత్‌కు ఈ సిరీస్ నుంచి విశ్రాంతినిచ్చిన నేపథ్యంలో భరత్‌ను ఎంపిక చేశారు. రెగ్యులర్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌ విరాట్‌‌‌‌ కోహ్లీ ఈ సిరీస్‌‌‌‌లో రెండో టెస్ట్‌‌‌‌కు జట్టుకు అందుబాటులోకి రానున్నాడు. ఈ నేపథ్యంలో తొలి టెస్ట్‌‌‌‌లో రహానె జట్టును నడిపించనుండగా చతేశ్వర్‌‌‌‌ పుజారా వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌గా వ్యవహరిస్తాడు. అశ్విన్​, జడేజా, అక్షర్​ ఉన్నప్పటికీ మరో స్పిన్నర్​ జయంత్​ యాదవ్​ను తీసుకున్నారు. ప్రసీద్‌‌‌‌ కృష్ణ నాలుగో పేసర్‌‌‌‌గా జట్టులో చోటు దక్కించుకున్నాడు.

భారత టెస్ట్ జట్టు

భారత టెస్ట్ జట్టు

అజింక్యా రహానె(కెప్టెన్‌‌‌‌), కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌, మయాంక్‌‌‌‌ అగర్వాల్‌‌‌‌, చతేశ్వర్‌‌‌‌ పుజారా(వైస్‌‌‌‌ కెప్టెన్‌‌‌‌), శుభ్‌‌‌‌మన్‌‌‌‌ గిల్‌‌‌‌, శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌, వృద్ధిమాన్‌‌‌‌ సాహా, కేఎస్‌‌‌‌ భరత్‌‌‌‌, రవీంద్ర జడేజా, అశ్విన్‌‌‌‌, అక్షర్‌‌‌‌ పటేల్‌‌‌‌, జయంత్‌‌‌‌ యాదవ్‌‌‌‌, ఇషాంత్‌‌‌‌ శర్మ, ఉమేశ్‌‌‌‌ యాదవ్‌‌‌‌, సిరాజ్‌‌‌‌, ప్రసీద్‌‌‌‌ కృష్ణ.

Story first published: Saturday, November 13, 2021, 10:33 [IST]
Other articles published on Nov 13, 2021
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+