Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

హనుమ విహారికి అండగా అశ్విన్.. ఆంధ్ర క్రికెట్‌కు దబిడి దిబిడే!

టీమిండియా టెస్ట్ స్పెషలిస్ట్, తెలుగు తేజం హనుమ విహారికి వెటరన్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ అండగా నిలిచాడు. పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ కలిగిన ఓ యువ క్రికెటర్‌ను మందలించాననే కారణంతో తనను ఆంధ్ర రంజీ టీమ్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించారని హనుమరి విహారి చేసిన వ్యాఖ్యలు తీవ్ర చర్చనీయాంశమయ్యాయి.

ఈ సీజన్ తొలి మ్యాచ్ సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుందని విహారి సోషల్ మీడియా వేదికగా వెల్లడించాడు. తన కంటే రాజకీయ పలుకుబడి కలిగిన కుర్రాడికి ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వడం తనను అవమానించినట్లుందని ఆవేదన వ్యక్తం చేశాడు. రాజకీయ నాయకుల జోక్యం ఎక్కువైన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ నుంచి తక్షణమే తప్పుకుంటున్నానని, భవిష్యత్తులో మళ్లీ ఆడనని తెలిపాడు.

 Hanuma Vihari Agrees To Chat With R Ashwin Chat Show Amid Andhra Cricket Controversy

కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించినా.. ఆటపై ఉన్న గౌరవంతో ఈ సీజన్ మొత్తం కొనసాగానని తెలిపాడు. విహారితో మందలింపునకు గురైన యువ ప్లేయర్ కేఎన్ పృథ్వీ రాజ్ అతని ఆరోపణలపై స్పందించాడు. విహారి సింపథి గేమ్స్ ఆడుతున్నాడని, జట్టులోని ప్రతీ ఒక్కరికి ఆ రోజు ఏం జరిగిందో తెలుసని అసభ్య పదజాలంతో ఇన్‌స్టా వేదికగా రాసుకొచ్చాడు.

హనుమ విహారి సదరు ప్లేయర్ పేరు ప్రస్తావించకున్నా.. పృథ్వీ రాజే స్వయంగా స్పందించడంతో పాటు ఆ ప్లేయర్‌ తానే అంటూ ప్రకటించడంతో అతని తండ్రి ఎవరో అందరికి తెలిసిపోయింది. అధికార ప్రభుత్వానికి చెందిన తిరుపతి కార్పోరేటరని, కీలక నేత ప్రధాన అనుచరుడని సోషల్ మీడియా వేదికగా జోరుగా ప్రచారం జరుగుతోంది. ఓ కార్పోరేటర్ క్రికెట్ అసోసియేషన్ నిర్ణయాలను ప్రభావితం చేయడం చూసి అంతా విస్మయానికి గురవుతున్నారు.

పృథ్వీ రాజ్ పోస్ట్ నేపథ్యంలో హనుమ విహారి స్పందించాడు. తననే కెప్టెన్‌గా కొనసాగించాలని జట్టులోని ఆటగాళ్లంతా ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌కు రాసిన లేఖను పంచుకున్నాడు. అనంతరం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారుల నుంచి ఆంధ్ర జట్టు సపోర్ట్ స్టాఫ్‌కు ఫోన్స్ వచ్చాయని, వారందర్నీ తనకు వ్యతిరేకంగా మాట్లాడేలా ఒత్తిడి చేస్తున్నారని మరో పోస్ట్‌లో పేర్కొన్నాడు.

హనుమ విహారి వ్యవహారం భారత క్రికెట్ వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. దీనిపై ట్విటర్ వేదికగా స్పందించిన అశ్విన్.. తన యూట్యూబ్ చానెల్‌తో మాట్లాడుతావా? అని విహారిని అడిగాడు. 'కుట్టీ స్టోరీస్ విత్ యాష్ 'విహారీ గారూ'.. మీరు సిద్దంగా ఉన్నారా..?'అని ట్వీట్ చేశాడు. మీరు ఎప్పుడంటే అప్పుడే..? అని విహారి బదులిచ్చాడు. స్టార్ క్రికెటర్లందరూ స్పందిస్తున్న నేపథ్యంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్‌ను బీసీసీఐ వివరణ కోరే అవకాశం ఉంది.

Story first published: Monday, February 26, 2024, 20:07 [IST]
Other articles published on Feb 26, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+