
హైదరాబాద్: ఆస్ట్రేలియా మాజీ వికెట్ కీపర్ బ్రాడ్ హాడిన్ సోమవారం ఐపీఎల్ ప్రాంచైజీ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టుకు ఆసిస్టెంట్ కోచ్‌గా నియమితులయ్యారు. ఈ మేరకు సన్‌రైజర్స్ హైదరాబాద్ యాజమాన్యం ట్విట్టర్‌లో అధికారిక ప్రకటన చేసింది. రాబోయే సీజన్‌కు సన్‌రైజర్స్ హైదరాబాద్ ఇప్పటినుంచే సపోర్టింగ్ స్టాఫ్‌ను పటిష్టం చేస్తోంది.
ఇందులో భాగంగా ఇటీవలే టామ్ మూడీ స్థానంలో హెడ్ కోచ్‌గా ఇంగ్లాండ్ మాజీ కోచ్ ట్రేవర్ బేలిస్‌ను ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. ట్రేవర్ బేలిస్‌తో కలిసి బ్రాడ్ హాడిన్ సన్‌రైజర్స్‌ను విజయాల బాట పట్టించాల్సి ఉంటుంది. గతంలో వీరిద్దరూ ఐపీఎల్‌లో కోల్‌కతా నైట్ రైడర్స్ జట్టుకు పనిచేశారు. ఇద్దరూ కలిసి ఒకేసారి పనిచేయక పోవడం విశేషం.
PKL 2019: యు ముంబా విజయాలకు హర్యానా స్టీలెర్స్ బ్రేకులు వేసేనా?
సన్‌రైజర్స్ హైదరాబాద్ తన ట్విట్టర్‌లో "ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్, 2015 వరల్డ్‌కప్ విన్నింగ్ జట్టులో సభ్యుడిగా ఉన్న బ్రాడ్ హాడిన్‌ను అసిస్టెంట్ కోచ్‌గా నియమించాం" అంటూ ట్వీట్ చేసింది. గత నాలుగు సీజన్లుగా సన్‌రైజర్స్ హైదరాబాద్ ప్లే ఆఫ్స్‌కు క్వాలిఫై అవుతుంది. 2016లో టైటిల్ విజేతగా కూడా నిలిచింది.