షకీబ్‌ను కావాలనే ఇరికించారు: ఐసీసీ విచారణ తెలియదన్న బంగ్లా బోర్డు

హైదరాబాద్: బంగ్లాదేశ్ ఆల్ రౌండర్ షకీబ్ అల్ హాసన్‌ను గత పది నెలల నుంచి అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ అవినీతి నిరోధక శాఖ విచారిస్తున్న విషయంలో తమకు ఎటువంటి సమాచారం లేదని బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డు (బీసీబీ) అధ్యక్షుడు నజ్ముల్ హసన్ స్పష్టం చేశారు.
ఓ బుకీ తనను సంప్రదించిన విషయాన్ని షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు తెలపకపోవడంతో అతడిపై రెండేళ్ల నిషేధం విధిస్తూ అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్(ఐసీసీ) మంగళవారం నిర్ణయం తీసుకుంది. షకీబ్ రెండు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఐసీసీ నిషేధం విధించింది.
ఇందులో ఏడాది సస్పెన్షన్ తర్వాత క్రికెట్ ఆడొచ్చని వెల్లడించింది. 2017 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్(బీపీఎల్) సందర్భంగా నవంబర్‌లో తొలిసారి భారత బుకీ దీపక్ అగర్వాల్ షకీబ్‌ను సంప్రదించగా ఆ తర్వాత 2018 జనవరిలో ఒకసారి, ఏప్రిల్‌లో ఐపీఎల్లో మరోసారి సంప్రదించాడు. ఈ విషయాలను షకీబ్ ఐసీసీ అవినీతి నిరోధక శాఖకు చెప్పలేదు.

ఐసీసీ విచారణలో
అయితే, ఐసీసీ విచారణలో యాంటీ కరప్షన్ కోడ్‌లోని మూడు చార్జ్‌లను ఉల్లంఘించినట్లు షకీబ్ దర్యాప్తు అధికారుల ముందు అంగీకరించడంతో మంగళవారం షకీబ్‌కు శిక్షను ఖరారు చేసింది. అయితే ప్రపంచ క్రికెట్‌ను నివ్వెరపరిచిన ఈ వ్యవహారం బీసీబీకి తెలియకుండానే సాగడంతో ఐసీసీ చాలా గోప్యత పాటించిందని తెలుస్తోంది.
భువీకి ఏమైంది?: ఆగస్టు నుంచి టీమిండియాకు దూరం, గాయంపై లేని స్పష్టత!

నజ్ముల్ హసన్ మాట్లాడుతూ
దీనిపై బంగ్లా క్రికెట్ బోర్డు అధ్యక్షుడు నజ్ముల్ హసన్ మాట్లాడుతూ "జనవరి నుంచి షకీబల్‌పై ఐసీసీ చేస్తున్న విచారణ గురించి నాతోపాటు బీసీబీలోని ఏ ఒక్కరికీ తెలీదు. ఏసీయూ నేరుగా షకీబల్‌తోనే మాట్లాడింది. ఇటీవలి ఆటగాళ్ల సమ్మెపై మాతో జరిపిన చర్చల సందర్భంగానే షకీబల్ ఈ విచారణ గురించి చెప్పాడు" అని తెలిపాడు.

తమీమ్ ఇక్బాల్‌ను సంప్రదించిన బుకీ
మరోవైపు భారత బుకీ దీపక్ అగర్వాల్ మరో బంగ్లా క్రికెటర్ తమీమ్ ఇక్బాల్‌ను కూడా స్పందించాడు. ఈ విషయాన్ని ఐసీసీనే స్వయంగా వెల్లడించింది. షకీబ్‌తోపాటు మరో ఆరుగురు క్రికెటర్లను ఐసీసీ ఏసీయూ విచారించింది. ఈ సందర్భంగా దీపక్ అగర్వాల్ విషయాన్ని తమీమ్ ఇక్బాల్ ఐసీసీ విచారణ అధికారులతో చెప్పాడు.
ఢిల్లీతో జతకట్టిన సన్నీ లియోన్: ఆమె అందం స్టేడియానికి ప్రేక్షకులను తీసుకొస్తుందా?

వాట్సాప్ నెంబర్‌ను బ్లాక్ చేసిన తమీమ్
అయితే, తమీమ్ ముందు జాగ్రత్తగా అతడి వాట్సాప్ నెంబర్‌ను బ్లాక్ చేయడంతో పాటు బంగ్లా క్రికెట్ బోర్డు(బీసీబీ) ఏసీయూకు కూడా సమాచారమిచ్చాడు. దీంతో తమీమ్‌కు ఐసీసీ ఏసీయూ క్లీన్‌చిట్ ఇచ్చింది. షకీబ్‌పై రెండేళ్ల పాటు నిషేధం విధించడంతో నవంబర్ 3 నుంచి ఆరంభమయ్యే భారత్ పర్యటనకు దూరమయ్యాడు.

నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ అభిమానుల ర్యాలీ
ఈ పర్యటనలో భాగంగా బంగ్లాదేశ్ 3 టీ20లు, 2 టెస్టులు ఆడనుంది. మరోవైపు షకీబ్‌పై విధించిన నిషేధాన్ని వెంటనే ఎత్తివేయాలంటూ బంగ్లాదేశ్ క్రికెట్ అభిమానులు పెద్ద ఎత్తున నిరసనకు దిగారు. షకీబ్ సొంత గ్రామం మగురాలో దాదాపు 700 మంది అభిమానులు వీధుల్లో ప్లకార్డులు పట్టుకుని ర్యాలీ తీశారు. ఇదంతా కుట్రలో భాగమ నిషేధం ఎత్తివేయాలని వారు డిమాండ్ చేశారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications