భువీకి ఏమైంది?: ఆగస్టు నుంచి టీమిండియాకు దూరం, గాయంపై లేని స్పష్టత!

హైదరాబాద్: టీమిండియా పేస్ బౌలింగ్ దళం ప్రపంచంలోనే అత్యుత్తమ ఎటాక్‌ను కలిగి ఉంది. ఈ మధ్యకాలంలో భారత పేసర్ల ప్రదర్శన సైతం అద్భుతంగా ఉంది. ఒక పేసర్ గాయపడితే, అతడి స్థానాన్ని మరొక పేసర్ భర్తీ చేస్తున్నాడు. దీనికి కారణం టీమిండియాకు నలుగురు లేదా ఐదుగురు పేసర్లు ఎప్పుడూ సిద్ధంగా ఉండటమే.
ఒకప్పుడు భారత పేస్ బౌలింగ్ దళాన్ని ముందుండి నడిపించిన భువనేశ్వర్ కుమార్ ఈ ఏడాది ఆగస్టు నుంచి జాతీయ జట్టుకు దూరమయ్యాడు. వరల్డ్‌కప్ అనంతరం వెస్టిండిస్ పర్యటనకు ఎంపికైన భువనేశ్వర్ ఆ తర్వాత గాయం కారణంగా జాతీయ జట్టుకు దూరమయ్యాడు. ప్రస్తుతం బుమ్రా బెంగళూరులోని జాతీయ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్నాడు.
బీసీసీఐ సైతం బుమ్రా గాయంపై ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు. అయితే, ఓ జాతీయ పత్రికలో వచ్చిన సమాచారం మేరకు అతడు జాతీయ క్రికెట్ అకాడమీలో మెకాలినరం నొప్పి నుంచి కోలుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. ఇటీవలే బంగ్లాదేశ్‌తో సిరిస్‌కు టీ20, టెస్టు జట్టుని ప్రకటించిన సమయంలో ఛీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్... భువీ గాయంపై స్పందించలేదు.
దీంతో భువీ గాయంపై బీసీసీఐ ఉన్నతాధికారి ఒకరు మాట్లాడుతూ "NCAలో ప్రస్తుతం ఓ ట్రెండ్ నడుస్తోంది. జాతీయ క్రికెట్ అకాడమీ కేవలం పునరావాస కేంద్రంగానే ఉపయోగపడుతుంది. ఇక్కడికి ఇలాంటి కేసులు వస్తూనే ఉన్నాయి. వికెట్ కీపర్ వృద్ధిమాన్ సాహా సైతం గాయంతో తన కెరీర్‌లో ఏడాదిన్నరను కోల్పోయాడు" అని తెలిపాడు.

గాయపడి జాతీయ క్రికెట్ అకాడమీకి వస్తే
వాస్తవానికి... గాయపడి జాతీయ క్రికెట్ అకాడమీకి వచ్చిన ఆటగాడిని త్వరగా కోలుకునేలా చేయాలి. కానీ, బెంగళూరులోని జాతీయ క్రికెట్ ఆకాడమీ మాత్రం అందుకు భిన్నంగా ఉంది. గతంలో, టీమిండియా యువ ఓపెనర్ పృథ్వీ షా కేసును చాలా పేలవంగా నిర్వహించినందుకు జాతీయ క్రికెట్ అకాడమీపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి.

భువనేశ్వర్ గాయం అంత తీవ్రంగా లేనట్లయితే
"భువనేశ్వర్ గాయం అంత తీవ్రంగా లేనట్లయితే, అతడు మైదానంలోకి తిరిగి రావడానికి ఎందుకు ఎక్కువ సమయం తీసుకుంటున్నారో జాతీయ క్రికెట్ అకాడమీ స్పష్టమైన వివరణ ఇవ్వాలి. జస్ప్రీత్ బుమ్రా, హార్దిక్ పాండ్యా ఇంగ్లాండ్ వెళ్లాల్సిన అవసరం ఉందని బోర్డే స్వయంగా ప్రకటించింది. బుమ్రాకు శస్త్రచికిత్స కూడా అవసరం లేదు" అని పేర్కొన్నాడు.

గతేడాది జూలై నుంచి భువనేశ్వర్ అదే గాయంతో
గతేడాది జూలై నుంచి భువనేశ్వర్ అదే గాయంతో ఉన్నారని జాతీయ క్రికెట్ అకాడమీ బోర్డుకి ఇచ్చిన ఓ నివేదికలో పేర్కొంది. మన జాతీయ క్రికెట్ అకాడమీలో భువీకి సరైన ట్రీట్మెంట్ అందడం లేదన్నమాట. "భువీకి సరైన చికిత్స చేయలేదు. అతడిని ప్రపంచ కప్‌కు తీసుకెళ్లాలని జట్టు కోరినందున వల్ల గాయం తీవ్రతరం కాకుండా ఉండేలా అనుమతించబడింది" అని ఆయన బీసీసీఐ అధికారి తెలిపాడు

వైట్-బాల్ క్రికెట్ ఎంపికలో భువీదే అగ్రస్థానం
"భువీ ఇప్పటికీ వైట్-బాల్ క్రికెట్ ఎంపికలో ముందు వరుసలో ఉంటాడు. కానీ, అతడు వచ్చే ఏడాది T20 వరల్డ్‌కప్‌లో చోటు దక్కించుకోవాలంటే ముందు అతడు తిరిగి మైదానంలోకి రావాలి" అని ఆయన పేర్కొన్నాడు. మరోవైపు ఎన్‌సీఏ చీఫ్ రాహుల్ ద్రవిడ్‌తో బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ భేటీ అయ్యారు.

ఎన్‌సీఏ చీఫ్ ద్రవిడ్‌తో సమావేశమైన దాదా
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ద్రవిడ్‌తో దాదా బుధవారం సమావేశమయ్యారు. ఈ సమావేశంలో ఎన్‌సీఏలోని ఇతర అధికారులూ పాల్గొన్నారు. అకాడమీ పనితీరు, అభివృద్ధి అంశాలపై ఈ ఇద్దరు భారత మాజీ కెప్టెన్లు చర్చించారు. బెంగళూరులో కొత్తగా నిర్మించాల్సిన ఎన్‌సీఏ, దాని అభివృద్ధి ప్రణాళికపై ద్రవిడ్, గంగూలీ దృష్టి సారించారు.

జాతీయ క్రికెట్ అకాడమీని మరో స్థాయికి
ఇక జాతీయ క్రికెట్ అకాడమీని మరో స్థాయికి తీసుకెళ్లేందుకు రూపొందించిన భవిష్య ప్రణాళికను గంగూలీ, ద్రవిడ్ సమీక్షించారు. ప్రస్తుతం గాయపడిన ఆటగాళ్ల పునరావాస శిబిరంగానే ఎన్‌సీఏ ఉపయోగపడుతోంది. ఈ తరుణంలో యువ ఆటగాళ్లకు అత్యున్నత స్థాయిలో శిక్షణనిస్తూ రిజర్వ్ బెంచ్‌ను పటిష్టం చేయాలని అనుకుంటున్నారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications