Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

విడదీసిన కరోనా.. విష్ణూ మిస్‌యూ అంటున్న గుత్తా జ్వాలా

Gutta jwala on Twitter ‘Missing my boo’

హైదరాబాద్: సినిమా స్టార్లు, క్రీడాకారుల మధ్య ప్రేమ వ్యవహారాలు కొత్తేం కాదు. భారత్‌లో క్రికెటర్లు.. సినిమా హీరోయిన్లతో పెట్టుకున్న ఎఫైర్లు అన్నీ ఇన్నీ కాదు. కొందరి బంధాలు పెళ్లి పీటలు కూడా ఎక్కాయి. మన్సూర్ అలీఖన్ పటౌడీ-రేఖ నుంచి విరాట్-అనుష్క వరకు చాలా మంది ప్రేమాయణం నడిపారు. పెళ్లితో ఒక్కటయ్యారు.

ఇక ఇటీవల భారత డబుల్స్ షట్లర్ గుత్తాజ్వాలా... తమిళ నటుడు విష్ణు విశాల్‌తో డేటింగ్ చేయడం హాట్‌టాపిక్‌గా మారిన విషయం తెలిసిందే. అది కూడా పెళ్లైన తర్వాత ఆమె డేటింగ్ చేయడం సంచలనం అయింది. ఇక తమ ప్రేమ వ్యహహారాన్ని బాహటంగానే చెప్పిన గుత్తా జ్వాలా.. త్వరలో పెళ్లి కూడా చేసుకుంటామని స్పష్టం చేసింది.

త్వరలోనే మా పెళ్లి..

త్వరలోనే మా పెళ్లి..

ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తమిళ నటుడు విష్ణు విశాల్ తో రిలేషన్ షిప్ గురించి ప్రశ్నించగా... తామిద్దరం డేటింగ్ లో ఉన్నామని, త్వరలోనే పెళ్లి చేసుకుంటామని తెలిపింది. అయితే పెళ్లి ఎప్పుడన్నది చెప్పలేనని, అందరికీ చెప్పే చేసుకుంటానని పేర్కొంది. మరోవైపు, విష్ణు తన భార్యకు కొన్నేళ్ల క్రితం విడాకులు ఇచ్చాడు. దీనికి కారణం కూడా గుత్తా జ్వాలనే అనే ప్రచారం జోరుగా సాగింది.

అకాడమీ కోసం..

భారత బ్యాడ్మింటన్ డబుల్స్ ‌లో గుత్తా జ్వాల మంచి పేరు ప్రఖ్యాతులు సంపాదించింది. ఇటీవలే కోచింగ్ రంగంలో అడుగుపెట్టిన ఆమె సొంత అకాడమీ కోసం ఇళ్లు కూడా అమ్మింది. అయితే తాజాగా జ్వాలా చేసిన ట్వీట్ నెట్టింటహల్‌చల్ చేస్తోంది.

విడదీసిన.. కరోనా

విడదీసిన.. కరోనా

కరోనా దెబ్బకు అన్ని రంగాలు అతలా కుతలమయ్యాయి. అటు సినిమా షూటింగ్‌లు.. ఇటు క్రీడా ఈవెంట్లన్నీ రద్దయ్యాయి. దేశమే స్వీయ నిర్భంధంలోకి వెళ్లింది. దీంతో ఎక్కడి వారు అక్కడ చిక్కుపోయారు. ఈ కరోనా జ్వాలా-విష్ణును కూడా విడదీసింది. దీంతో తన ప్రియుడ్ని చూడలేక ఉండబోతున్న ఈ డబుల్స్ స్టార్.. ‘మిస్సింగ్ మై బూ'అని ట్వీట్ చేసింది. పైగా దీనికి విష్ణుతో రోమాన్స్ చేస్తున్న ఫొటోలను జత చేసింది. ఈ ట్వీట్‌పై అభిమానులు సరదాగా కామెంట్ చేస్తున్నారు. విష్ణు లేకపోవడంతో జ్వాలా తట్టుకులేకపోతుందని వ్యంగ్యస్త్రాలు సంధిస్తున్నారు.

ప్రేమ వివాహం.. అంతలోనే విడిపోయింది..

ప్రేమ వివాహం.. అంతలోనే విడిపోయింది..

గుత్తా జ్వాల ఫుల్ ఫామ్‌లో ఉన్న సమయంలోనే సహచర ఆటగాడు చేతన్ ఆనంద్‌తో ప్రేమలో పడింది. చాలా కాలం పాటు ప్రేమాయణం సాగించిన తర్వాత వీళ్లిద్దరూ వివాహం చేసుకున్నారు. ఆరేళ్ల పాటు మంచిగానే ఉన్న ఈ జంట.. 2011లో ఊహించని రీతిలో విడాకులు తీసుకుని షాకిచ్చింది. ఇక, అప్పటి నుంచి ఆమె ఒంటరిగానే జీవనం సాగిస్తోంది. అయితే టీమిండియా మాజీ కెప్టెన్ అజారుద్దీన్‌తో డేటింగ్ చేసినట్లు ఆ మధ్యలో వార్తులు వినిపించాయి.

Story first published: Sunday, March 29, 2020, 11:20 [IST]
Other articles published on Mar 29, 2020
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+