ఫ్లాఫ్ 36 ఊహించలేదు.. బుద్దిని వాడాలి: భారత దిగ్గజ క్రికెటర్

న్యూఢిల్లీ: టెస్ట్‌ల్లో టీమిండియా మరోసారి 42 పరుగుల కంటే స్వల్ప స్కోర్‌కే ఆలౌట్ అవుతుందని తానెప్పుడు అనుకోలేదని భారత దిగ్గజ క్రికెటర్ గుండప్ప విశ్వనాథ్ అన్నాడు. ఆస్ట్రేలియాతో డే/నైట్ టెస్టు రెండో ఇన్నింగ్స్‌లో కోహ్లీసేన 36 పరుగులకే పరిమితమవ్వడం తనను తీవ్రంగా బాధించిందని తెలిపాడు. అయితే ఈ మ్యాచ్ గురించి ఆటగాళ్లు ఎంత తర్వగా మరిచిపోతే అంత మంచిదన్నాడు. లేకుంటా మిగతా టెస్టుల్లో రాణించడం కష్టమని, దారుణ ఓటమికి సమష్టిగా బాధ్యత వహించి తదుపరి మ్యాచ్‌లో బదులు తీర్చుకోవాలన్నాడు. ఈ చెత్త ఇన్నింగ్స్‌కు ముందు భారత్ పేరిట అత్యల్ప స్కోర్ 42 ఉండేది. 1942లో ఇంగ్లండ్ చేతిలో 42కే ఆలౌటైన నాటి భారత జట్టులో గుండప్ప విశ్వనాథ్ ఓ సభ్యుడు. ఈ క్రమంలో ఈ లోయెస్ట్ స్కోర్‌పై స్పందించిన ఈ మాజీ క్రికెటర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

పుంజుకోవడం కష్టమేమి కాదు..
‘అడిలైడ్‌లో మూడోరోజు పిచ్ వేగం అనూహ్యంగా పెరిగింది. ఆస్ట్రేలియా బౌలర్లు నిలకడగా బంతులు విసిరారు. లార్డ్స్‌లోనూ ఇలాగే జరిగింది. బ్యాట్స్‌మెన్ బంతిని డిఫెండ్ చేసినా బ్యాటు అంచుకు తగిలి ఫీల్డర్ల చేతుల్లోకి వెళ్లింది. పేసర్లంతా బ్యాట్స్‌మెన్‌ను ఒత్తిడిలోనే ఉంచారు. చతేశ్వర్ పుజారా ఆడింది అద్భుతమైన బంతి. మయాంక్ ఎదుర్కొన్నది అంతే. రహానే క్రీజులోంచి ఆడాడు. కోహ్లీ దూరంగా వెళ్తున్న బంతిని కొట్టాడు. బహుశా వేగంగా పరుగులు చేసి ఒత్తిడి తగ్గించాలన్నది అతని ఆలోచన కావొచ్చు. అయితే జట్టులోని ఎక్కువ మందికి 60-70 టెస్టుల అనుభవం ఉండటంతో సిరీసులో పుంజుకోవడం కష్టమేమీ కాదు. రహానే గతంలోనూ స్మార్ట్ కెప్టెన్సీతో గెలిపించాడు.

మార్పులు చేయాల్సిందే..
జట్టులో కొన్ని మార్పులు అవసరం. పృథ్వీషా స్థానంలో శుభ్‌మన్ గిల్ రావాలి. ఇందులో మరో ఆలోచన లేదు. కోహ్లీ బదులు రాహుల్ వస్తాడు. షమీ గాయం తీవ్రత గురించి నాకు తెలియదు. రోహిత్ శర్మ చివరి రెండు టెస్టులకు అందుబాటులోకి వస్తాడు. ఫీల్డింగ్ మెరుగుపడాలి. అడిలైడ్‌లోనే కాదు ఇప్పటి వరకు ఆసీస్ టూర్‌లోనే చాలా క్యాచ్‌లు వదిలేశారు. లేదంటే తొలి టెస్టులో 100కు పైగా ఆధిక్యం లభించేది. అప్పుడు ఆట మరోలా ఉండేది.

గ్యాప్ ఉండొద్దు..
రహానే టెక్నిక్, బ్యాటింగ్‌లో ఇబ్బందేమీ లేదు. సానుకూలంగా ఆడితే సరిపోతుంది. ఇక టెస్టులు ఆడుతున్నప్పుడు చేతి-కంటి సమన్వయం, బ్యాటు వేగం, క్రీజును ఉపయోగించడం ఎవరికివారే విశ్లేషించుకోవాలి. బ్యాట్, ప్యాడ్ల మధ్య బంతి వెళ్లకుండా ఆడాలి. బంతికి దగ్గరగా ఆడాలి. స్వింగ్ అయితే బంతి పిచ్ అయ్యే చోటుకు వెళ్లి ఎదుర్కోవాలి. బంతి లెంగ్త్‌ను ముందుగానే పసిగట్టి ఆడాలి. ఇక స్పిన్, బౌన్స్ అయితే ఫుట్‌వర్క్‌ను ఉపయోగించుకోవాలి. టీమిండియా ఆటగాళ్లు హార్డ్ హ్యాండ్స్‌తో ఆడుతున్నారని అనుకోను. ఎందుకంటే తొలి ఇన్నింగ్స్‌లో ఎక్కువ బంతులు స్లిప్, కీపర్ వద్దకు వెళ్లలేదు.

టెస్ట్‌లు స్మార్ట్‌గా ఆడాలి..
నేనిచ్చే సలహా ఒక్కటే. మంచి ఫుట్‌వర్క్‌తో బంతిని దగ్గరగా ఆడాలి. ఇది వన్డే, టీ20 క్రికెట్ కాదు. సుదీర్ఘ ఫార్మాట్ అని గుర్తించాలి. అయినా ఇప్పుడు టెస్టులు ఐదు రోజుల వరకు వెళ్లడం లేదు. మూడు, నాలుగు రోజుల్లోనే ముగుస్తున్నాయి. భారత్ జట్టు ఒక్కరిదే కాదు. ప్రపంచ వ్యాప్తంగా ఇదే సమస్య. ఇందుకు టీమిండియా ఆటగాళ్లనూ నిందించొద్దు. నిజానికి వారికి రంజీలు ఆడేంత సమయం చిక్కడం లేదు. టెస్టు క్రికెట్ బుద్ధితో ఆడేది. ఆటగాళ్లు తెలివిని ప్రదర్శించాలి. పరిస్థితులకు అనుకూలంగా ఆడాలి' అని గుండప్ప సూచించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications