Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

T20 World Cup 2024: అఫ్గాన్ ప్లేయర్ ఛీటింగ్.. ఆస్కార్ లెవెల్ యాక్టింగ్!(వీడియో)

టీ20 ప్రపంచకప్ 2024లో అఫ్గానిస్థాన్ సంచలన విజయాన్నందుకుంది. సెమీస్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో అఫ్గాన్ అద్భుతం చేసింది. బంగ్లాదేశ్‌తో మంగళవారం ఉదయం జరిగిన తమ చివరి సూపర్-8 మ్యాచ్‌లో అఫ్గాన్ డక్‌వర్త్ లూయిస్ పద్దతిన 8 పరుగుల తేడాతో విజయం సాధించింది.

ఈ గెలుపుతో గ్రూప్-1 రన్నరప్‌గా అఫ్గాన్ సెమీస్ చేరింది. ఐసీసీ టోర్నీల్లో అఫ్గాన్ సెమీస్ చేరడం ఇదే తొలిసారి. దాంతో బంగ్లాదేశ్, మాజీ ఛాంపియన్ ఆస్ట్రేలియా ఇంటిదారిపట్టాయి. ఆద్యంతం ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్ సస్పెన్స్ థ్రిల్లర్ సినిమాను తలపించింది. వర్షం కూడా పదే పదే అంతరాయం కలిగించడం.. ఆటగాళ్లు తమ భావోద్వేగాలను అదుపులో ఉంచుకోకపోవడం అభిమానులకు కావాల్సిన మజాను అందించింది.

Gulbadin Naib s Dramatic Fall After Afghanistan Coach s Rain Call Video goes viral

అయితే అఫ్గానిస్థాన్ బౌలర్ గుల్బాదిన్ నైబ్ తమ జట్టు విజయం కోసం క్రీడా స్పూర్తికి విరుద్దంగా ప్రవర్తించాడు. అంపైర్లతో పాటు ప్రత్యర్థి ఆటగాళ్లను ఛీటింగ్ చేశాడు. గుల్బాదిన్ నైబ్‌పై సోషల్ మీడియా వేదికగా జోకులు పేలుతున్నాయి. మాజీ క్రికెటర్లు సైతం అతనిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ తమదైన శైలిలో జోకులు పేల్చుతున్నారు.

అసలేం జరిగిందంటే..?
ఈ మ్యాచ్ కీలక సమయంలో గుల్బాదిన్ నైబ్‌ గాయమైనట్లు నటించాడు. అయితే అఫ్గాన్ కోచ్ జోనాథన్ ట్రాట్ సూచనలతోనే గుల్బాదిన్ నైబ్ ఇలా ప్రవర్తించాడని, అతని సలహాలను అందుకునేందుకే గాయమైనట్లు నటించాడనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. స్లిప్‌లో ఫీల్డింగ్‌ చేస్తున్న గుల్బాదిన్ నైబ్ ఒక్కసారి కుప్పకూలిపోయాడు.

తొడ కండరాలు పట్టేసాయని, నొప్పితో బాధపడుతున్నానని తెలిపాడు. దాంతో ఫిజియోలు మైదానంలోకి వచ్చారు. వారితో పాటు టీమ్ 12వ ప్లేయర్‌ను కోచ్ జొనాథన్ ట్రాట్ మైదానంలోకి పంపాడు. అతని ద్వారా కొన్ని సూచనలను జట్టుకు చేరవేసాడు. గుల్బాదిన్ నైబ్ గాయం డ్రామా కారణంగా మ్యాచ్ కాసేపు ఆగిపోగా ఆ వెంటనే వర్షం అంతరాయం కలిగించింది. ఆ తర్వాత అఫ్గాన్ విజయం లాంఛనమైంది.

బంగ్లాదేశ్ ఆఖరి వికెట్ తీసిన అనంతరం గుల్బాదిన్ తన గాయం డ్రామా విషయం మరిచిపోయి వేగంగా పరుగెత్తాడు. తొడ కండరాల గాయంతో బాధపడే వ్యక్తి అలా ఎలా? వేగంగా పరుగెత్తుతాడని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.

ఆస్కార్ లెవెల్ యాక్టింగ్..
టీమిండియా వెటరన్ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్‌తో పాటు ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ మైకేల్ వాన్, ప్రముఖ కామెంటేటర్ సైమన్ డౌల్ గుల్బాదిన్ యాక్టింగ్‌పై వ్యంగ్యాస్త్రాలు సంధించారు. గుల్బాదిన్‌కు రెడ్ కార్డ్ ఇవ్వాలని అశ్విన్ కామెంట్ చేయగా.. తొడ కండరాల గాయంతో వికెట్ తీసిన తొలి బౌలర్ గుల్బాదిన్ అని మైకేల్ వాన్ సెటైర్లు పేల్చాడు.

సైమన్ డౌల్ అయితే గుల్బాదిన్‌కు చికిత్స చేసిన ఫిజియోల వివరాలు చెప్పాలని, తాను చాలా రోజులుగా మోకాలి నొప్పితో బాధపడుతున్నానని, అతనికి చూపించుకుంటానని తెలిపాడు. అభిమానులు మాత్రం ఆస్కార్ లెవల్ యాక్టింగ్ అంటూ విమర్శలు గుప్పిస్తున్నారు.

Story first published: Tuesday, June 25, 2024, 17:24 [IST]
Other articles published on Jun 25, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+