For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2025: మహమ్మద్ షమీకి షాకిచ్చిన గుజరాత్ టైటాన్స్.. రిటెన్షన్ లిస్ట్ ఇదే!

టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షమీకి గుజరాత్ టైటాన్స్ షాకిచ్చినట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగా వేలం నేపథ్యంలో షమీని ఆ జట్టు వదులుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. గాయం కారణంగా ఏడాదికిపైగా షమీ ఆటకు దూరమవడంతో గుజరాత్ టైటాన్స్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

చీలమండ గాయంతో మహహ్మద్ షమీ భారత జట్టుకు దూరమైన విషయం తెలిసిందే. వన్డే ప్రపంచకప్ 2023 ఫైనల్లో చివరిసారిగా ఆడిన షమీ.. శస్త్ర చికిత్స చేయించుకున్నాడు. ఈ క్రమంలోనే ఐపీఎల్ 2024 సీజన్‌తో పాటు టీ20 ప్రపంచకప్ 2024కు దూరమయ్యాడు. ప్రస్తుతం గాయం నుంచి పూర్తిగా కోలుకొని టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.

Gujarat Titans IPL 2025 Retention List Mohammed Shami Out and 2 Uncapped Players In

ఇటీవలే నేషనల్ క్రికెట్ అకాడమీ(ఎన్‌సీఏ)లో రిహాబిలిటేషన్ పూర్తి చేసుకున్న షమీ.. ఫిట్‌నెస్ టెస్ట్‌లను కూడా క్లియర్ చేశాడు. అయితే షమీకి భారత సెలెక్టర్లు షాకిచ్చారు. సౌతాఫ్రికాతో టీ20 సిరీస్‌కు గానీ.. ఆస్ట్రేలియాతో బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో కానీ చోటివ్వలేదు. మరోవైపు షమీ.. రంజీ ట్రోఫీ ఆడి తన సత్తా చాటాలనుకుంటున్నాడు. బెంగాల్ తరఫున నాలుగో రౌండ్ రంజీ మ్యాచ్ ఆడేందుకు సిద్దమవుతున్నాడు.

షమీని సెలెక్టర్లు పట్టించుకోకపోవడంతో పాటు అతని వయసు నేపథ్యంలో గుజరాత్ టైటాన్స్ రిటైన్ చేసుకోకుండా వేలంలోకి వదిలేసింది. ఒకవేళ షమీ ఫామ్ సాధించి మునపటిలా సత్తా చాటితే.. వేలంలో తిరిగి కొనుగోలు చేయడం లేదా? ఆర్‌టీఎమ్ ద్వారా తీసుకునే ప్రయత్నం చేయాలనుకుంటోంది.

మరోవైపు గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌తో పాటు రషీద్ ఖాన్, సాయి సుదర్శన్, రాహుల్ తెవాటియా, షారుఖ్ ఖాన్‌లను రిటైన్ చేసుకున్నట్లు తెలుస్తోంది. ఐపీఎల్ 2025 మెగావేలానికి సంబంధించిన రిటెన్షన్ పాలసీని బీసీసీఐ ఇప్పటికే ప్రకటించింది. ఆరుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకోవడం లేదా వేలంలో ఆర్‌టీఎమ్ ద్వారా తిరిగి కొనుగులు చేసే అవకాశం కల్పించింది.

ఇందులో గరిష్టంగా ఐదుగురు క్యాప్‌డ్ ప్లేయర్లు.. ఇద్దరూ అనామక ప్లేయర్లను తీసుకోవచ్చని పేర్కొంది. విదేశీ ఆటగాళ్ల విషయంలో ఎలాంటి పరిమితులు విధించలేదు. రిటైన్ చేసుకునే ఆటగాళ్లకు వరుసగా రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు, రూ. 11 కోట్లు చెల్లించాలని, మరో ఇద్దరిని రిటైన్ చేసుకోవాలంటే మళ్లీ రూ. 18 కోట్లు, రూ. 14 కోట్లు ఇవ్వాలని పేర్కొంది.

అనామక ఆటగాళ్లకు రూ. 4 కోట్లు చెల్లించాలని తెలిపింది. టీమ్ పర్స్ వాల్యూను రూ. 120 కోట్లకు పెంచింది. అక్టోబర్ 31లోపు రిటెన్షన్ జాబితాలను సమర్పించాలని 10 ఫ్రాంచైజీలను ఆదేశించింది.

Story first published: Tuesday, October 29, 2024, 21:49 [IST]
Other articles published on Oct 29, 2024
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+