న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X
For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts
 

IPL 2022: రాజస్థాన్‌తో క్వాలిఫయర్ మ్యాచ్.. గుజరాత్‌ టైటాన్స్‌ను కలవరపెడుతున్న చెత్త రికార్డు!

 Gujarat Titans are being bothered by batting firts ahead of RR qualifier 1 game in IPL 2022

హైదరాబాద్: ఐపీఎల్ 2022 సీజన్‌ విజయవంతంగా లీగ్‌ దశను పూర్తిచేసుకొని ప్లేఆఫ్స్‌లోకి అడుగుపెట్టింది. పాయింట్స్ టేబుల్‌లో తొలి రెండు స్థానాల్లో నిలిచిన గుజరాత్‌ టైటాన్స్, రాజస్థాన్‌ రాయల్స్ మంగళవారం తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్ ఆడనున్నాయి. మూడు, నాలుగు స్థానాల్లో నిలిచిన లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు(ఆర్‌సీబీ) బుధవారం ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో పోటీపడనున్నాయి. ఈ నేపథ్యంలో తొలి క్వాలిఫయర్‌ మ్యాచ్‌లో ఎవరు గెలుస్తారనేదానిపై సర్వత్రా ఆసక్తిగా నెలకొంది. లీగ్ దశలో టాప్-2 టీమ్స్ సత్తాచాటాయి. బలబలాల పరంగా కూడా సమంగా ఉన్నాయి. అయితే ఈ కీలక మ్యాచ్ ముందు గుజరాత్ టైటాన్స్‌కు ఓ టెన్షన్ మొదలైంది.

ముందు బ్యాటింగ్ చేస్తే..

ముందు బ్యాటింగ్ చేస్తే..

ఈసారి కొత్తగా వచ్చిన గుజరాత్‌ జట్టు ఆది నుంచి అద్భుత విజయాలతో నంబర్‌వన్‌ స్థానంలో దూసుకెళ్లింది. హార్దిక్‌ పాండ్య నేతృత్వంలో మొత్తం 14 లీగ్‌ మ్యాచుల్లో 10 విజయాలు సాధించి 20 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచింది. అయితే ఈ 10 విజయాల్లో 7 సార్లు చేజింగ్ ద్వారానే సాధించడం విశేషం. ఓడిన నాలుగు సార్లలో మూడు సార్లు ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. ఆర్‌సీబీతో జరిగిన చివరి లీగ్ మ్యాచ్‌లో కూడా గుజరాత్ ముందుగా బ్యాటింగ్ చేసే ఓటమిపాలైంది. చేజింగ్‌లో చూపించినంత పోరాటం.. లక్ష్యాన్ని కాపాడుకోవడంలో గుజరాత్ చూపించడం లేదు. ఇప్పుడు ఇదే టెన్షన్ ఆ జట్టుకు పట్టుకుంది. కీలక పోరులో టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్ చేయాల్సి వస్తే పరిస్థితి ఏందనేది? ఆ జట్టును కలవరపెడుతుంది

 సమష్టిగా రాణించడం..

సమష్టిగా రాణించడం..

గుజరాత్ టేబుల్ టాపర్‌గా నిలవడానికి ప్రధాన కారణం సమష్టిగా రాణించడమే. టాపార్డర్‌ విఫలమైనప్పుడు మిడిలార్డర్‌ బ్యాట్స్‌మెన్‌ రాణించడం గుజరాత్‌కు కలిసొచ్చింది. ఆ జట్టులో టాప్‌ బ్యాట్స్‌మన్‌గా హార్దిక్‌ పాండ్యా 413 పరుగులతో 11వ స్థానంలో నిలిచాడు. 403 రన్స్‌తో శుభ్‌మన్‌ గిల్ 13వ స్థానంలో నిలిచాడు. గత చివరి నాలుగు మ్యాచ్‌లను తీసుకుంటే ఓపెనర్లు శుభ్‌మన్‌ గిల్‌, వృద్ధిమాన్‌ సాహాలో ఒకరు మాత్రమే మంచి ఆరంభం ఇస్తున్నారు. అయినప్పటికీ స్వల్ప వ్యవధిలో వికెట్లను చేజార్చుకుని ఆ జట్టు ఒత్తిడిలోకి వెళ్తోంది. ఆఖర్లో డేవిడ్‌ మిల్లర్‌, రాహుల్‌ తెవాతియా, రషీద్ ఖాన్‌ హిట్టర్లు.. స్ట్రోక్‌ షాట్లు ఆడుతుండటంతో విజయాలను నమోదు చేస్తోంది.

 బౌలింగ్ బలంగా ఉన్నా..

బౌలింగ్ బలంగా ఉన్నా..

అయితే షమీ, దయాల్, అల్జారీ జోసెఫ్, రషీద్‌ ఖాన్‌, లాకీ ఫెర్గూసన్‌తో బౌలింగ్‌ దళం పటిష్ఠంగా ఉండటం గుజరాత్‌కు బాగా కలిసొస్తున్న మరో విషయం. సాయికిశోర్‌ కూడా అవకాశం వచ్చినప్పుడు ఫర్వాలేదనిపించాడు. కానీ లక్ష్యాన్ని కాపాడుకోవడంలో కాస్త జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. ఒకవేళ పొరపాటున నాకౌట్‌ దశలో ఇలాగే తొలుత బ్యాటింగ్‌ చేయాల్సి వస్తే ఫలితంలో తేడా వచ్చే ప్రమాదం లేకపోలేదు. ఇక బౌలింగ్‌ పరంగా అత్యధిక వికెట్లు తీసిన టాప్‌-10 బౌలర్లలో రషీద్‌ ఖాన్‌ (18) ఆరు, షమీ (18) ఎనిమిదో స్థానంలో చోటు దక్కించుకున్నారు.

 ఓడితే మరో చాన్స్..

ఓడితే మరో చాన్స్..

క్వాలిఫయర్-1 మ్యాచ్‌లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్‌కు చేరనుండగా ఓడిన జట్టు రెండో క్వాలిఫయర్‌లో మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం దొరుకుతుంది. లక్నో, ఆర్‌సీబీ మధ్య బుధవారం జరిగే ఎలిమినేటర్‌ మ్యాచ్‌లో విజేతగా నిలిచిన జట్టుతో రెండో క్వాలిఫయర్‌లో తలపడనుంది. సెకండ్ క్వాలిఫయర్‌లో గెలిచి జట్టు ఫైనల్లో టైటిల్ కోసం పోటీపడుతుంది.

Story first published: Monday, May 23, 2022, 19:01 [IST]
Other articles published on May 23, 2022
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Yes No
Settings X