
కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా రాజస్థాన్ రాయల్స్‌తో జరుగుతున్న కీలక క్వాలిఫయర్ మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉన్నా.. తమకు అచ్చొచ్చిన చేజింగ్‌కే మొగ్గు చూపుతున్నానని గుజరాత్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఈ మ్యాచ్ కోసం తమ ఆటగాళ్లంతా ఉత్సాహంగా ఉన్నారని, ఈ మ్యాచ్‌ను తాము ఓ సాధారణ మ్యాచ్‌లానే భావిస్తున్నామని చెప్పాడు. తమ బలాలపై ఫోకస్ పెట్టి ప్రణాళికబద్దంగా ఆడేందుకు ప్రయత్నిస్తామని చెప్పాడు. వికెట్ పరిస్థితుల నేపథ్యంలో ఒక మార్పు చేశామని చెప్పిన హార్దిక్ పాండ్యా.. లాకీ ఫెర్గూసన్ స్థానంలో అల్జారీ జోసెఫ్ వచ్చాడని చెప్పాడు.
ఇక తొలుత బ్యాటింగ్ చేయడం మాకు కలిసొచ్చే విషయమని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ తెలిపాడు. ముందుగా బ్యాటింగ్ చేసి అనుకూలమైన ఫలితాలు సాధించామని, వికెట్ కూడా బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉందని చెప్పాడు. ప్రస్తుత మ్యాచ్‌పై ఫోకస్ పెట్టి ప్రణాళిక ప్రకారం ఆడటం చాలా ముఖ్యమని తెలిపాడు. ఈ టోర్నీలో తాము అద్భుత క్రికెట్ ఆడామని చెప్పిన సంజూ.. ఆ ప్రదర్శననే రిపీట్ చేసేందుకు ప్రయత్నిస్తామన్నాడు. ఈ మ్యాచ్‌ను సాధారణ గేమ్‌లా భావించి స్టాండార్డ్స్‌కు తగ్గట్లు ఆడాల్సిన అవసరం ఉందని చెప్పాడు. ఇక మేం సేమ్ టీమ్‌తో బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.
తుది జట్లు
రాజస్థాన రాయల్స్: యశస్వి జైస్వాల్, జోస్ బట్లర్, సంజూ శాంసన్(కీపర్), దేవదత్ పడిక్కల్, రవిచంద్రన్ అశ్విన్, షిమ్రాన్ హెట్‌మైర్, రియాన్ పరాగ్, ట్రెంట్ బౌల్ట్, ప్రసిధ్ కృష్ణ, యుజ్వేంద్ర చాహల్, ఒబేడ్ మెక్‌కాయ్
గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్, మాథ్యూ వేడ్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, సాయి కిషోర్, యశ్ దయాల్, అల్జారీ జోసెఫ్, మహమ్మద్ షమీ