GT vs RR: జోస్ బట్లర్ విధ్వంసం.. గుజరాత్ ముందు కొండంత లక్ష్యం!

కోల్‌కతా: ఐపీఎల్ 2022 సీజన్‌లో నేరుగా ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓపెనర్ జోస్ బట్లర్(56 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్స్‌లతో 89) హాఫ్ సెంచరీతో చెలరేగాడు. దాంతో గుజరాత్ టైటాన్స్ ముందు రాజస్థాన్ రాయల్స్ 189 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. ముందుగా బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 188 పరుగులు చేసింది. జోస్ బట్లర్‌కు తోడుగా సంజూ శాంసన్(26 బంతుల్లో 5 ఫోర్లు, 3 సిక్స్‌లతో 47), దేవదత్ పడిక్కల్(20 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్స్‌లతో 28) రాణించారు. గుజరాత్ బౌలర్లలో షమీ, యశ్ దయాల్, సాయి కిషోర్, హార్దిక్ పాండ్యా తలో వికెట్ తీసారు.

చెలరేగిన సంజూ..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన రాజస్థాన్ రాయల్స్‌కు ఆదిలోనే గట్టి షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్‌లోనే యువ ఓపెనర్ యశస్వీ జైస్వాల్‌ను యశ్ ధయాల్ కీపర్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో క్రీజులోకి వచ్చిన కెప్టెన్ సంజూ శాంసన్ ధాటిగా ఆడాడు. షమీ వేసిన 5వ ఓవర్‌లో వరుసగా రెండు బౌండరీలు బాదిన సంజూ.. అల్జారీ జోసెఫ్ వేసిన 6వ ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు కొట్టాడు. దాంతో పవర్ ప్లేలో రాజస్థాన్ వికెట్ నష్టానికి 55 పరుగులు చేసింది. ఆ తర్వాత కూడా ఈ జోడీ అదే జోరును కొనసాగించింది.

బట్లర్ హాఫ్ సెంచరీ..
అయితే హాఫ్ సెంచరీకి చేరువైన సంజూ శాంసన్‌ను సాయి కిషోర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు. దాంతో రెండో వికెట్‌కు నమోదైన 68 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. క్రీజులోకి వచ్చిన పడిక్కల్ సైతం ధాటిగా ఆడాడు. గుజరాత్ బౌలర్లపై వరుస బౌండరీలతో విరుచుకుపడ్డాడు. అయితే అతని జోరుకు హార్దిక్ పాండ్యా బ్రేక్ వేసాడు. క్లీన్ బౌల్డ్ చేసి పెవిలియన్‌కు చేర్చాడు. క్రీజులోకి వచ్చిన హెట్‌మైర్‌తో బట్లర్ ఆచితూచి ఆడాడు. యశ్ దయాల్ వేసిన 17వ ఓవర్‌లో వరుసగా మూడు బౌండరీలు బాదిన బట్లర్ హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. అయితే అతను ఇచ్చిన క్యాచ్‌ను అంచనా వేయడంలో విఫలమైన హార్దిక్ పాండ్యా నేలపాలు చేశాడు. ఈ అవకాశంతో బట్లర్ చెలరేగిపోయాడు.

చెత్త ఫీల్డింగ్‌తో..
అల్జారీ జోసెఫ్ వేసిన 18వ ఓవర్‌లో మూడు బౌండరీలు బాదిన బట్లర్.. షమీ వేసిన 19వ ఓవర్‌లో మరో లైఫ్ అందుకున్నాడు. అతను ఇచ్చిన క్యాచ్‌ను రషీద్ ఖాన్ నేలపాలు చేశాడు. అయితే ఆ మరుసటి బంతికే భారీ షాట్ ఆడే క్రమంలో హెట్‌మైర్(4) రాహుల్ తెవాటియాకు చిక్కాడు. ఆ తర్వాత బట్లర్ ఫోర్, సిక్స్ బాదడంతో ఈ ఓవర్‌లో 13 రన్స్ వచ్చాయి. యశ్ దయాల్ వేసిన చివరి ఓవర్‌లో బట్లర్ సిక్సర్‌తో జట్టు స్కోర్‌ను 180 మార్క్ ధాటించాడు. చివరి బంతికి రెండో పరుగు తీసే ప్రయత్నంలో అతను రనౌటవ్వగా.. ఆ బంతి కాస్త నోబాల్‌గా మారింది. మరోసారి వేసిన లాస్ట్ బాల్‌కు అశ్విన్ రెండు పరుగులు రాబట్టాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications