Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs RR: అందుకే మా మ్యాచ్ విన్నర్ ఆడటం లేదు: సంజూ శాంసన్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నాను. డ్యూ వచ్చే అవకాశం ఉంది. ఐపీఎల్‌లో ప్రతీ మ్యాచ్‌ కీలకమే. గత రెండు మ్యాచ్‌ల్లో మాకు గొప్ప ఫలితాలు దక్కాయి.

ఇదే జోరును ముందుకు సాగించే ప్రయత్నం చేస్తాం. కెప్టెన్సీ బాధ్యతలు తిరిగి చేపట్టడం సంతోషంగా ఉంది. ఇదో కొత్త జట్టు. జట్టులో కొత్త ఆటగాళ్లు ఉన్నారు. మేం ఆరుగురు ఆటగాళ్లను మాత్రమే రిటైన్ చేసుకున్నా.. కొత్త జట్టే. పిచ్ అడ్వాంటేజ్‌ను ఉపయోగించుకుంటాం. వ్యక్తిగత కారణాలతో హసరంగా దూరమయ్యాడు. అతని స్థానంలో ఫరూఖీ తుది జట్టులోకి వచ్చాడు.'అని సంజూ శాంసన్ చెప్పుకొచ్చాడు. గత రెండు మ్యాచ్‌ల్లో హసరంగా.. మ్యాచ్ విన్నింగ్ పెర్ఫామెన్స్ కనబర్చాడు.

GT vs RR IPL 2025 Sanju Samson Reveals Why Wanindu Hasaranga Not Playing vs Gujarat Titans

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. గత కొన్ని మ్యాచ్‌ల్లో రెండో ఇన్నింగ్స్ సమయంలో ఇక్కడ విపరీతమైన డ్యూ వచ్చింది. గత మ్యాచ్‌ల్లో కూడా మేం ముందే బ్యాటింగ్ చేశాం. మేం ఒక్కో మ్యాచ్ గెలుచుకుంటూ పోవాలనుకుంటున్నాం. ఎన్ని గెలిచామని లెక్కించుకోవడం లేదు. టాప్-3, 4 నిలవడమే మా లక్ష్యం. సొంతగడ్డపై మాకు మంచి రికార్డే ఉంది. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నాం. అభిమానుల మద్దతు అద్భుతం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: సాయి సుదర్శన్, శుభ్‌మన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), షెర్ఫానే రూథర్‌ఫోర్డ్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, రవిశ్రీనివాసన్ సాయి కిషోర్, మహమ్మద్ సిరాజ్, ప్రసిధ్ కృష్ణ, ఇషాంత్ శర్మ.

రాజస్థాన్ రాయల్స్: యశస్వి జైస్వాల్, సంజు శాంసన్ (కీపర్/కెప్టెన్), నితీష్ రాణా, రియాన్ పరాగ్, షిమ్రాన్ హెట్మెయర్, ధ్రువ్ జురెల్, జోఫ్రా ఆర్చర్, మహేశ్ తీక్షణ, ఫజల్‌హాక్ ఫరూకీ, సందీప్ శర్మ, తుషార్ దేశ్‌పాండే.

Story first published: Wednesday, April 9, 2025, 19:23 [IST]
Other articles published on Apr 9, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+