Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs PBKS: అందుకే కేన్ మామను తీసుకున్నాం: శుభ్‌మన్ గిల్

ఐపీఎల్ 2024 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శిఖర్ ధావన్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్నాడు. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉందనే ఈ నిర్ణయం తీసుకున్నానని శిఖర్ ధావన్ తెలిపాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేయాలనుకుంటున్నాం. ఈ పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండటంతో పాటు మ్యాచ్ అసాంతం ఒకేలా ఉండనుంది.

దాంతోనే మేం ఛేజింగ్‌ చేయాలనుకుంటున్నాం. కొన్ని మ్యాచ్‌ల్లో భారీ స్కోర్లు నమోదయ్యాయి. అయితే ప్రతీ మ్యాచ్‌లో అలా జరగదు. ఎందుకంటే ప్రతీ జట్టు బలంగానే ఉంది. మేం మంచి క్రికెట్ ఆడుతున్నాం. టోర్నీలో ఇది ఆరంభం మాత్రమే. మరింత మెరుగైన ప్రదర్శన చేసేందుకు ప్రయత్నిస్తాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. లివింగ్‌స్టోన్ స్థానంలో సికిందర్ రాజాను తీసుకున్నాం.'అని శిఖర్ ధావన్ తెలిపాడు.

GT vs PBKS Shubman Gill Reveals The Reason Why Kane Williamson Including vs Punjab in IPL 2024

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని గుజరాత్ టైటాన్స్ సారథి శుభ్‌మన్ గిల్ అన్నాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. పిచ్ బౌలింగ్‌కు అనుకూలంగా ఉండనుంది. అయితే ఇక్కడి ఓవర్‌కాస్ట్ కండిషన్స్ చూస్తుంటే డ్యూ వచ్చే అవకాశం లేదనుకుంటా. ఈ పిచ్‌పై మేం కొన్ని మ్యాచ్‌లు ఆడాం.

భారీ స్కోర్ నమోదు చేసి ప్రత్యర్థి జట్టుపై ఒత్తిడి తెస్తాం. తుది జట్టులో ఒక మార్పు చేశాం. ఫిట్‌నెస్ సమస్య‌లతో బాధపడుతున్న డేవిడ్ మిల్లర్ స్థానంలో కేన్ విలియమ్సన్ తుది జట్టులోకి వచ్చాడు.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

పంజాబ్ కింగ్స్: శిఖర్ ధావన్(కెప్టెన్), జానీ బెయిర్‌స్టో, జితేశ్ శర్మ(కీపర్), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, సామ్ కరణ్, శశాంక్ సింగ్, సికిందర్ రాజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడా, అర్ష్‌దీప్ సింగ్

గుజరాత్ టైటాన్స్:వృద్దిమాన్ సాహా(కీపర్), శుభ్‌మన్ గిల్(కెప్టెన్), సాయి సుదర్శన్, కేన్ విలియమ్సన్, విజయ్ శంకర్, అజ్మతుల్లా ఒమర్జాయ్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, ఉమేశ్ యాదవ్, దర్శన్ నల్కండే.

Story first published: Thursday, April 4, 2024, 19:34 [IST]
Other articles published on Apr 4, 2024
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+