ఐపీఎల్ 2024 సీజన్‌లో పంజాబ్ కింగ్స్ మరో విజయం సాధించింది. గుజరాత్ టైటాన్స్‌తో గురువారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్‌లో పంజాబ్ కింగ్స్ 3 వికెట్ల తేడాతో గెలుపొందింది. శశాంక్ సింగ్(29 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 61 నాటౌట్) సంచలన బ్యాటింగ్‌తో పంజాబ్ కింగ్స్‌కు చిరస్మరనీయ విజయాన్ని అందించాడు.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లకు 199 పరుగులు చేసింది. ప్టెన్ శుభ్‌మన్ గిల్(48 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్స్‌లతో 89 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో రాణించగా.. సాయి సుదర్శన్(19 బంతుల్లో 6 ఫోర్లతో 33), రాహుల్ తెవాటియా(8 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 23 నాటౌట్) మెరుపులు మెరిపించారు. పంజాబ్ బౌలర్లలో కగిసో రబడా రెండు వికెట్లు తీయగా.. హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్ తలో వికెట్ తీసారు.

అనంతరం లక్ష్యచేధనకు దిగిన పంజాబ్ కింగ్స్ 19.5 ఓవర్లలో 7 వికెట్లకు 200 పరుగులు చేసి సంచలన విజయాన్నందుకుంది. శశాంక్ సింగ్‌కు తోడుగా అషుతోష్ శర్మ(17 బంతుల్లో 3 ఫోర్లు, సిక్స్‌తో 31), ప్రభ్‌సిమ్రాన్ సింగ్(24 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 35) రాణించాడు.
గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ రెండు వికెట్లు తీయగా.. అజ్మతుల్లా ఒమర్జాయ్, ఉమేశ్ యాదవ్, రషీద్ ఖాన్, నూర్ అహ్మద్, మోహిత్ శర్మ, దర్షన్ నల్కండే తలో వికెట్ తీసారు.
111 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి ఓటమి దిశగా సాగిన పంజాబ్ కింగ్స్‌కు శశాంక్ సింగ్ ఊపిరి పోసాడు. అశుతోష్ శర్మతో కలిసి సంచలన బ్యాటింగ్‌తో జట్టు విజయం దిశగా నడిపాడు. ఈ ఇద్దరూ ఏడో వికెట్‌కు విలువైన 43 పరుగులు జోడించారు.
చివరి ఓవర్‌లో అషుతోష్ శర్మ ఔటైనా.. శశాంక్ సింగ్ విజయలాంఛనాన్ని పూర్తి చేశాడు. గుజరాత్ టైటాన్స్ చెత్త ఫీల్డింగ్‌తో పాటు మోహిత్ శర్మ 19వ ఓవర్ ఆ జట్టు పతనాన్ని శాసించాడు. ఈ ఓవర్‌లో మోహిత్ శర్మ 18 పరుగులివ్వడం పంజాబ్ విజయానికి కలిసొచ్చింది.