
ముంబై: గుజరాత్ టైటాన్స్ హిట్టర్ రాహుల్ తెవాటియా తీవ్ర అసహనానికి గురయ్యాడు. పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో సహచర ఆటగాడైన సాయి సుదర్శన్‌పై కస్సుమన్నాడు. నోట్లో ఏం పెట్టుకున్నావ్? అంటూ కోపంతో ఊగిపోయాడు. ప్రస్తుతం ఈ ఘటనకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. బ్యాటింగ్ సందర్భంగా రనౌటయ్యే ప్రమాదాన్ని నాన్‌స్ట్రైకర్ సాయి సుదర్శన్ తెలియజేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశాడు.
గుజరాత్ టైటాన్స్ ఇన్నింగ్స్ 12వ ఓవర్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. లివింగ్ స్టోన్ వేసిన ఈ ఓవర్ చివరి బంతిని లెఫ్ట్ కవర్ పాయింట్ దిశగా ఆడి క్విక్ సింగిల్ తీసే ప్రయత్నం చేశాడు. అయితే నాన్ స్ట్రైకర్‌గా ఉన్న సాయి సుదర్శన్ స్పందించలేదు. దాంతో సగం పిచ్ దాటి వచ్చిన తెవాటియా మళ్లీ వెనక్కి పరుగెత్తాడు. దాంతో కొద్దిలో రనౌటయ్యే ప్రమాదాన్ని తప్పించుకున్నాడు. దాంతో తీవ్ర ఆగ్రహానికి గురైన తెవాటియా.. సాయి సుదర్శన్ వైపు తిరిగి.. సింగిల్ వద్దని నోటితో చెప్పొచ్చుగా.. నోట్లో ఏమన్న పెట్టుకున్నావా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. అయితే ఆ కొద్దిసేపటికే రబడా బౌలింగ్‌లో తెవాటియా.. క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
పంజాబ్ కింగ్స్ స్టార్ పేసర్ కగిసో రబడా(4/33) నాలుగు వికెట్లతో చెలరేగడంతో గుజరాత్ టైటాన్స్ 144 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని నిర్దేశించింది. ఆరంభం నుంచే పంజాబ్ బౌలర్లు కట్టుదిట్టంగా బౌలింగ్ చేయడంతో గుజరాత్ వరుసగా వికెట్లు కోల్పోయింది. యువ ప్లేయర్ సాయి సుదర్శన్(50 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 65 నాటౌట్) అజేయ హాఫ్ సెంచరీతో ఆదుకోవడంతో గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 143 పరుగులు చేసింది. గుజరాత్‌లో సాయి సుదర్శన్‌కు తోడుగా ఎవరూ రాణించలేదు. రిషి ధావన్ సూపర్ ఫీల్డింగ్‌తో రనౌట్ చేయడం గేమ్ చేంజర్‌గా మారింది. పంజాబ్ బౌలర్లలో రబడాకు తోడుగా.. రిషి ధావన్, అర్షదీప్ సింగ్, లియామ్ లివింగ్ స్టోన్ తలో వికెట్ తీసారు.