Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs PBKS: అందుకే బౌలింగ్ ఎంచుకున్నా: శుభ్‌మన్ గిల్

ఐపీఎల్ 2025 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పిచ్ కండిషన్స్ నేపథ్యంలోనే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ తెలిపాడు. డ్యూ ప్రభావం కూడా ఉండునుందని చెప్పాడు. 'మేం ముందుగా బౌలింగ్ చేస్తాం. ఈ వికెట్ బాగుంది. డ్యూ వచ్చే అవకాశం ఉంది. ఇక్కడ తేమ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. భారీ లక్ష్యాలను కూడా చేధించవచ్చు.

అందుకే ముందుగా బౌలింగ్ చేస్తున్నాం. ఈ సీజన్‌ కోసం అద్భుతంగా సన్నదమయ్యాం. అన్ని విధాల రెడీగా ఉన్నాం. బౌలింగ్ అటాక్ బాగుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వేదికగా ఆడటం అదృష్టంగా భావిస్తున్నా. మేం నలుగురు పేసర్లు, ఇద్దరు స్పిన్నర్లతో బరిలోకి దిగుతున్నాం.'అని శుభ్‌మన్ గిల్ చెప్పుకొచ్చాడు.

GT vs PBKS IPL 2025 Gujarat skipper Shubman Gill reveals why he elected bowling first against Punjab
Photo Credit: screen grab for JioHotstar

మరోవైపు టాస్ గెలిస్తే తాము కూడా బౌలింగ్ ఎంచుకునేవాళ్లమని శ్రేయస్ అయ్యర్ తెలిపాడు. 'మేం కూడా ముందుగా బౌలింగ్ చేయాలనుకున్నాం. నేను ఎప్పుడూ ఛేజింగ్ చేయడానికి ఇష్టపడుతాను. ఈ సవాల్‌ను స్వీకరిస్తున్నాం. జట్టులో చాలా మంది తెలిసిన వ్యక్తిలో ఉన్నారు. రికీ పాంటింగ్ ఉన్నాడు. జట్టు ఐక్యంగా ఉండటం ముఖ్యం. మా జట్టులో చాలా మంది ఆల్‌రౌండర్లు ఉన్నారు. దాంతో తుది జట్టు ఎంపిక కాస్త కష్టంగా మారింది. మేం ముందుగా బ్యాటింగ్ చేస్తున్నాం కాబట్టి ఓ స్పిన్నర్‌తో పాటు ముగ్గురు పేసర్లతో బరిలోకి దిగుతున్నాం.'అని శ్రేయస్ అయ్యర్ చెప్పుకొచ్చాడు.

తుది జట్లు:

గుజరాత్ టైటాన్స్: శుభమన్ గిల్(కెప్టెన్), జోస్ బట్లర్(కీపర్), సాయి సుదర్శన్, షారుక్ ఖాన్, రాహుల్ తెవాటియా, రవి శ్రీనివాసన్ సాయి కిషోర్, అర్షద్ ఖాన్, రషీద్ ఖాన్, కగిసో రబడా, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ.

పంజాబ్ కింగ్స్: ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (కీపర్), ప్రియాంష్ ఆర్య, శ్రేయాస్ అయ్యర్ (కెప్టెన్), శశాంక్ సింగ్, మార్కస్ స్టోయినిస్, గ్లెన్ మాక్స్‌వెల్, సూర్యాన్ష్ షెడ్జ్, అజ్మతుల్లా ఒమర్జాయ్, మార్కో జాన్సెన్, అర్ష్‌దీప్ సింగ్, యుజ్వేంద్ర చాహల్

Story first published: Tuesday, March 25, 2025, 19:23 [IST]
Other articles published on Mar 25, 2025
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+