Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block

GT vs PBKS: అందుకే బ్యాటింగ్ ఎంచుకున్నా: హార్దిక్ పాండ్యా

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా పంజాబ్ కింగ్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో గుజరాత్ టైటాన్స్ టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకుంది. డ్యూ ప్రభావం అంతగా ఉండదని భావించే ఈ నిర్ణయం తీసుకున్నానని గుజరాత్ టైటాన్స్ సారథి హార్దిక్ పాండ్యా తెలిపాడు. ఇప్పటికే తమ జట్టు అద్భుతమైన ప్రదర్శన కనబర్చిందని, దాన్ని అలానే కొనసాగిస్తామన్నాడు. బౌలింగ్ వేయాడానికి తాను సిద్దంగా ఉన్నానని చెప్పిన హార్దిక్ పాండ్యా.. జట్టు అవసరాలను బట్టి బంతిని అందుకుంటానని చెప్పాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని తెలిపాడు.

మయాంక్ అగర్వాల్ టాస్ గెలిచినా ఫీల్డింగ్ ఎంచుకునేవాడినని చెప్పాడు. 10 మ్యాచ్‌ల్లో 8 సార్లు టాస్ ఓడిపోయానన్న మయాంక్.. తాము దూకుడుగా ఆడుతున్నామని చెప్పాడు. అయితే కీలక సమయాల్లో చేసిన తప్పిదాలు తమ విజయవకాశాలను దెబ్బతీసాయని చెప్పాడు. ఇక నుంచైనా అలాంటి తప్పిదాలు చేయకుండా విజయం కోసం సాయశక్తులా ప్రయత్నిస్తామని పేర్కొన్నాడు. ఎలాంటి మార్పులు లేకుండా బరిలోకి దిగుతున్నామని చెప్పాడు.

GT vs PBKS: Gujarat captain Hardik Pandya opts to bat against Punjab, both sides remain unchanged

ఇప్పటివరకు ఆడిన తొమ్మిది మ్యాచ్‌ల్లో పంజాబ్ నాలుగింట్లో విజయం సాధించి 5 మ్యాచ్‌ల్లో ఓడింది. మొత్తం 8 పాయింట్లతో టేబుల్‌లో ఎనిమిదో స్థానంలో కొనసాగుతోంది. తన చివరి మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్‌ చేతిలో ఓడింది. మరో గుజరాత్ టైటాన్స్ 9 మ్యాచ్‌ల్లో 8 మ్యాచ్‌లతో ప్లే ఆఫ్స్ బెర్త్‌ ఖాయం చేసుకుంది.

తుది జట్లు:
పంజాబ్ కింగ్స్: మయాంక్ అగర్వాల్(కెప్టెన్), శిఖర్ ధావన్, జానీ బెయిర్ స్టో, భానుక రాజపక్స, లియామ్ లివింగ్‌స్టోన్, జితేశ్ శర్మ, రిషి ధావన్, కగిసో రబడా, రాహుల్ చాహర్, అర్షదీప్ సింగ్, సందీప్ శర్మ

గుజరాత్ టైటాన్స్: వృద్దిమాన్ సాహా, శుభ్‌మన్ గిల్, సాయి సుదర్శన్, హార్దిక్ పాండ్యా, డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, అల్జారీ జోసెఫ్, ప్రదీప్ సంగ్వాన్, లాకీ ఫెర్గూసర్, మహమ్మద్ షమీ

Story first published: Tuesday, May 3, 2022, 19:29 [IST]
Other articles published on May 3, 2022
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+