GT vs MI: చెలరేగిన రోహిత్, డేవిడ్.. గుజరాత్ ముందు భారీ లక్ష్యం

ముంబై: ఐపీఎల్ 2022 సీజన్‌లో భాగంగా గుజరాత్ టైటాన్స్‌తో జరుగుతున్న మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ బ్యాటర్లు రోహిత్ శర్మ(28 బంతుల్లో5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 43), ఇషాన్ కిషన్(29 బంతుల్లో 5 ఫోర్లు, సిక్స్‌తో 45), టీమ్ డేవిడ్ (21 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 44 నాటౌట్) ధాటిగా ఆడారు. దాంతో గుజరాత్ టైటాన్స్ ముందు ముంబై 178 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది. రోహిత్, ఇషాన్ కిషన్ అద్భుతమైన ఆరంభానికి టీమ్ డెవిడ్ మెరుపులు తోడవడంతో ముంబై నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 177 పరుగులు చేసింది. గుజరాత్ బౌలర్లలో రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీయగా.. అల్జారీ జోసెఫ్, లాకీ ఫెర్గూసన్, ప్రదీప్ సంగ్వాన్ తలో వికెట్ పడగొట్టారు.

అద్భుతమైన ఆరంభం..
టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ముంబై ఇండియన్స్‌కు ఓపెనర్లు ఇషాన్ కిషన్, రోహిత్ శర్మ శుభారంభం అందించారు. ఆరంభం నుంచే ధాటిగా ఆడుతూ గుజరాత్ బౌలర్లపై విరుచకుపడ్డారు. అల్జారీ జోసెఫ్ వేసిన రెండో ఓవర్‌లో రెండు బౌండరీలు వరుసగా బాదిన హిట్ మ్యాన్.. అదే ఓవర్‌లో మరో భారీ సిక్సర్ కొట్టాడు. అతను కొట్టిన ఈ షాట్‌కు టాటా పంచ్ కార్ దెబ్బతిన్నది. ఈ ఇద్దరి విధ్వంసంతో పవర్ ప్లేలో ముంబై వికెట్ నష్టపోకుండా 63 పరుగులు చేసింది. హాఫ్ సెంచరీకి చేరువైన హిట్‌మ్యాన్‌ను రషీద్ ఖాన్ సూపర్ డెలివరీతో పెవిలియన్ చేర్చాడు.

రోహిత్ వికెట్‌తో..
రివర్స్ స్వీప్ ఆడటంలో విఫలమైన రోహిత్ శర్మ మూల్యం చెల్లించుకున్నాడు. బ్యాట్‌ను మిస్సైన బంతి రోహిత్ ప్రైవేట్ పార్ట్‌కు బలంగా తాకింది. ఎల్బీ కోసం గుజరాత్ ఆటగాళ్లు అప్పీల్ చేయగా ఫీల్డ్ అంపైర్ నాటౌటిచ్చాడు. రివ్యూ తీసుకున్న హార్దిక్ పాండ్యా ఫలితం రాబట్టాడు. తొలి వికెట్‌కు నమోదైన 74 పరుగుల భాగస్వామ్యానికి తెరపడింది. ఆ తర్వాత వచ్చిన సూర్యకుమార్(12) నిరాశపరిచాడు. ప్రదీప్ సాంగ్వాన్ బౌలింగ్‌లో భారీ షాట్‌కు ప్రయత్నించి క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.

మిడిల్ ఓవర్లలో విఫలమైనా.
.
ధాటిగా ఆడే క్రమంలో ఇషాన్ కిషన్ సైతం హాఫ్ సెంచరీ చేజార్చుకున్నాడు. అల్జారీ జోసెఫ్ బౌలింగ్‌లో క్యాచ్ ఔటయ్యాడు. రషీద్ ఖాన్ బౌలింగ్‌లో కీరన్ పొలార్డ్(4) క్లీన్ బౌల్డ్ కాగా.. నిలకడగా ఆడుతున్న తిలక్ వర్మ(21) హార్దిక్ పాండ్యా సూపర్ ఫీల్డింగ్‌కు రనౌట్‌గా వెనుదిరిగాడు. ఓ వైపు వికెట్లు పడుతున్నా మరోవైపు టీమ్ డేవిడ్ భారీ షాట్లతో విరుచుకుపడ్డాడు. డానియల్ సామ్స్ (0) విఫలమైనా.. ఆఖరి ఓవర్‌లో రెండు భారీ సిక్స్‌లు బాది 177 పరుగుల భారీ స్కోర్ అందించాడు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications