అహ్మదాబాద్: ఐపీఎల్ 2023 సీజన్‌లో ముంబై ఇండియన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. గుజరాత్ టైటాన్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో సమష్టిగా విఫలమైన రోహిత్ సేన 55 పరుగుల భారీ తేడాతో ఓటమిపాలైంది. పేలవ డెత్ బౌలింగ్‌కు చెత్త బ్యాటింగ్ ముంబై ఇండియన్స్ పతనాన్ని శాసించింది.
ఈ మ్యాచ్‌లో ముందుగా బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 207 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(34 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 56) హాఫ్ సెంచరీతో రాణించగా.. డేవిడ్ మిల్లర్(22 బంతుల్లో 2 ఫోర్లు, 4 సిక్స్‌లతో 46), అభినవ్ మనోహర్(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 42), రాహుల్ తేవాడియా(5 బంతుల్లో 3 సిక్సర్లతో 20 నాటౌట్) మెరుపులు మెరిపించారు.

ముంబై బౌలర్లలో పియూష్ చావ్లా రెండు వికెట్లు తీయగా.. అర్జున్ టెండూల్కర్, జాసన్ బెహ్రాండార్ఫ్, రిలే మెరిడిత్, కుమార్ కార్తీకేయ తలో వికెట్ తీసారు.
అనంతరం లక్ష్యచేధనకు దిగిన ముంబై ఇండియన్స్ నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్లకు 152 పరుగులే చేసి ఓటమిపాలైంది. నెహాల్ వదేరా(21 బంతుల్లో 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో 40), కామెరూన్ గ్రీన్(26 బంతుల్లో 3 ఫోర్లతో 33) టాప్ స్కోరర్లుగా నిలవగా మిగతా బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. గుజరాత్ టైటాన్స్ బౌలర్లలో నూర్ అహ్మద్ మూడు వికెట్లు తీయగా.. మోహిత్ శర్మ, రషీద్ ఖాన్ రెండేసి వికెట్లు పడగొట్టారు. హార్దిక్ పాండ్యాకు ఓ వికెట్ దక్కింది.
శుభారంభం లేదు..
భారీ లక్ష్యచేధనలో ముంబై ఇండియన్స్‌కు శుభారంభం దక్కలేదు. ఇన్నింగ్స్ సెకండ్ ఓవర్‌లోనే కెప్టెన్ రోహిత్ శర్మ(2) .. హార్దిక్ పాండ్యాకు రిటర్న్ క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. క్రీజులోకి వచ్చిన కామెరూన్ గ్రీన్‌తో కలిసి ఇషాన్ కిషన్(21 బంతుల్లో ఫోర్‌తో 13) ఆచితూచి ఆడాడు. దాంతో ముంబై పవర్ ప్లేలో వికెట్ నష్టానికి 29 పరుగులు మాత్రమే చేసింది.
దెబ్బతీసిన నూర్ అహ్మద్..
ఆ వెంటనే రషీద్ ఖాన్ బౌలింగ్‌లో ఇషాన్ కిషన్ క్యాచ్ ఔట్‌గా వెనుదిరగ్గా.. అదే ఓవర్ చివరి బంతికి తెలుగు తేజం తిలక్ వర్మ వికెట్ల ముందు దొరికిపోయాడు. రివ్యూ తీసుకున్నా ఫలితం లేకపోయింది. క్రీజులోకి వచ్చిన సూర్య బౌండరీలతో ధాటిగా ఆడే ప్రయత్నం చేయగా.. క్రీజులో సెట్ అయిన కామెరూన్ గ్రీన్(33)ను నూర్ అహ్మద్ క్లీన్ బౌల్డ్ చేశాడు. అదే ఓవర్‌లో టీమ్ డేవిడ్(0)ను కూడా సిల్వర్ డక్‌గా పెవిలియన్ చేర్చాడు.
నెహాల్ వదేరా చెలరేగినా..
దాంతో 59 పరుగులకే ముంబై 5 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ఈ పరిస్థితుల్లో సూర్య జట్టును ఆదుకునే ప్రయత్నం చేయగా.. నూర్ అహ్మద్ సూపర్ రిటర్న్ క్యాచ్‌తో పెవిలియన్ చేర్చాడు. ఈ పరిస్థితుల్లో నెహాల్ వదేరా సూపర్ బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. 3 ఫోర్లు, 3 సిక్స్‌లతో అభిమానులను అలరించాడు. పియూష్ చావ్లా(18) రనౌటవ్వగా.. వదేరాను మోహిత్ శర్మ క్యాచ్ ఔట్ చేశాడు. దాంతో ముంబై ఓటమి ఖాయమైంది. క్రీజులోకి వచ్చిన అర్జున్ టెండూల్కర్ ఓ సిక్సర్ బాది క్యాచ్ ఔటయ్యాడు.